MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Mystery Temple: దేవుడికి మందును నైవేద్యంగా పెట్టే ఆల‌యం.. నేటికీ వీడని మిస్టరీ

Mystery Temple: దేవుడికి మందును నైవేద్యంగా పెట్టే ఆల‌యం.. నేటికీ వీడని మిస్టరీ

Mystery Temple: సాధారణంగా ఆలయాలకు వెళ్లినప్పుడు దేవుడికి పండ్లు, కొబ్బ‌రికాయ‌ల‌ను నైవేద్యంగా స‌మ‌ర్పిస్తుంటాం. అయితే మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని కాలభైరవ ఆలయంలో మాత్రం భక్తులు మందు బాటిళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు.

3 Min read
Author : Narender Vaitla
Published : Sep 30 2026, 07:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉజ్జయినిలో కొలువైన కాలభైరవుడు
Image Credit : Planning My Trip/Youtube

ఉజ్జయినిలో కొలువైన కాలభైరవుడు

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరం ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిలయం. షిప్రా నది తీరంలో ఉన్న కాలభైరవ ఆలయం అక్కడి ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. శివుడి ఉగ్ర స్వరూపంగా కాలభైరవుడిని భక్తులు ఆరాధిస్తారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన కచ్చితమైన చారిత్రక కాలం స్పష్టంగా తెలియకపోయినా.. ఈ క్షేత్రానికి పురాతన ప్రాధాన్యం ఉందని స్థానిక విశ్వాసాలు చెబుతున్నాయి. స్కంద పురాణంతో పాటు కొన్ని పురాతన గ్రంథాల్లో ఈ క్షేత్రం ప్రస్తావన ఉన్నట్లు చెబుతారు. కాలభైరవుడిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఉజ్జయినికి వస్తుంటారు. ముఖ్యంగా తమ కోరికలు నెరవేరిన తర్వాత మొక్కులు చెల్లించుకునే వారు ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుతారు. ఈ క్షేత్రానికి తాంత్రిక సంప్రదాయాలతోనూ సంబంధం ఉందనే విశ్వాసం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మందు ఎందుకు నైవేద్యంగా ఇస్తారు?
Image Credit : Planning My Trip/Youtube

మందు ఎందుకు నైవేద్యంగా ఇస్తారు?

కాలభైరవ ఆలయంలో ఆల్క‌హాల్‌ను సమర్పించడం వెనుక తాంత్రిక సంప్రదాయాల ప్రభావం ఉందని చెబుతారు. పంచమకర ఆచారాల్లో మందు కూడా ఒక భాగంగా పేర్కొంటారు. ఈ సంప్రదాయంలో ఆల్కహాల్ తో పాటు మాంసం, మత్స్యం, ముద్ర, మైథునం వంటి అంశాలు ప్ర‌స్తావిస్తారు. అయితే కాలక్రమంలో ఈ ఆచారాల్లో చాలా వరకు సాధారణ పూజా విధానాల్లో కనిపించకుండా పోయాయి. ఉజ్జయిని కాలభైరవ ఆలయంలో మాత్రం మందు సమర్పించే ఆచారం కొనసాగుతోంది.

భక్తులు ఆలయం బయట ఉన్న దుకాణాల్లో మందు బాటిళ్లను కొనుగోలు చేసి పూలు, పండ్లు, కొబ్బరికాయలతో పాటు వాటిని తీసుకెళ్లి స్వామివారికి సమర్పిస్తారు. భక్తుల విశ్వాసం కారణంగా ఆలయ పరిసరాల్లో ప్రత్యేకంగా మందు విక్రయించే దుకాణాలు కూడా కనిపిస్తాయి. 2015లో భక్తులకు అధిక ధరల భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆల్కహాల్ దుకాణం ఏర్పాటు చేశారు.

35
విగ్రహం మందు స్వీకరిస్తుందా?
Image Credit : Planning My Trip/Youtube

విగ్రహం మందు స్వీకరిస్తుందా?

ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశం స్వామివారికి ఆల్క‌హాల్‌ సమర్పించే విధానం. భక్తుడు తీసుకొచ్చిన మందు బాటిల్‌ను పూజారి స్వీకరించి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం కొంత మందును ప్రత్యేకమైన పాత్రలోకి తీసుకుని కాలభైరవుడి విగ్రహం పెదాల దగ్గర ఉంచుతారు.

ఆ పాత్రలోని ద్రవం క్రమంగా తగ్గిపోవడం భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆల్క‌హాల్‌ ఎక్కడికి వెళ్తుందనే విషయంపై స్పష్టమైన వివరణ తమకు పూజారులు సైతం చెప్తుంటారు. దీనిని కాలభైరవుడి మహిమగా భక్తులు భావిస్తారు. పూజ పూర్తయిన తర్వాత బాటిల్‌లో మిగిలిన మందును భక్తుడికి తిరిగి ఇస్తారు. అయితే ఈ ప్రక్రియ వెనుక ఉన్న కారణంపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. భక్తులకు ఇది ఆధ్యాత్మిక అనుభూతిగా కనిపిస్తే.. ఈ ఘటనను శాస్త్రీయ కోణంలో పరిశీలించాల్సిన అంశంగా మరికొందరు చూస్తారు.

45
రోజూ వేలాది బాటిళ్లు.. ప్రత్యేక రోజుల్లో రద్దీ
Image Credit : Planning My Trip/Youtube

రోజూ వేలాది బాటిళ్లు.. ప్రత్యేక రోజుల్లో రద్దీ

కాలభైరవుడికి మందు సమర్పించే ఆచారం కారణంగా ఆలయానికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. రోజువారీగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆల్కహాల్ బాటిళ్లను తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. కొన్ని కథనాల్లో రోజుకు సుమారు 2,000 బాటిళ్ల వరకు సమర్పిస్తారని పేర్కొంటున్నప్పటికీ.. దీనికి సంబంధించి అధికారికంగా ధృవీకరించిన ఖచ్చితమైన లెక్కలు అందుబాటులో లేవు.

ఆదివారం, మంగళవారం రోజులను కాలభైరవుడి ఆరాధనకు ప్రత్యేకమైనవిగా భక్తులు భావిస్తారు. దీంతో ఈ రోజుల్లో ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాలభైరవుడిని పూజిస్తే భయాలు, కష్టాలు తొలగిపోతాయని, ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుందని భక్తుల నమ్మకం. గతంలో తాంత్రిక సాధకులు ఈ క్షేత్రాన్ని ప్రత్యేకంగా సందర్శించేవారని కూడా స్థానిక కథనాలు చెబుతున్నాయి.

55
కాలభైరవుడి జన్మకథ ఇదే..
Image Credit : Planning My Trip/Youtube

కాలభైరవుడి జన్మకథ ఇదే..

హిందూ పురాణాల్లో కాలభైరవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయనను శివుడి శక్తివంతమైన స్వరూపంగా పరిగణిస్తారు. కాలభైరవుడి ఆవిర్భావానికి సంబంధించి వివిధ పురాణాల్లో భిన్నమైన కథనాలు కనిపిస్తాయి. కొన్ని స్థానిక విశ్వాసాల ప్రకారం శివుడి నుంచి వెలువడిన శక్తి రెండు రూపాలుగా వ్యక్తమై.. వాటిలో ఒకటి కాలభైరవుడిగా, మరొకటి బటుక భైరవుడిగా ప్రసిద్ధి చెందింది. బటుక భైరవుడిని బాల స్వరూపంగా, కాలభైరవుడిని యువ స్వరూపంగా ఆరాధిస్తారు.

ఉజ్జయిని కాలభైరవ ఆలయానికి ఉన్న ప్రత్యేకత కేవలం పురాతన విశ్వాసాల్లోనే కాదు.. అక్కడ కొనసాగుతున్న ఆల్కహాల్ నైవేద్య సంప్రదాయంలోనూ కనిపిస్తుంది. దేవుడి విగ్రహం ఆల్క‌హాల్‌ను స్వీకరిస్తుందనే నమ్మకానికి ఇప్పటికీ భక్తుల్లో బలమైన విశ్వాసం ఉంది. ఇదే సమయంలో ఈ ఘటన వెనుక ఉన్న భౌతిక కారణంపై ఆసక్తి కూడా కొనసాగుతోంది. ఆధ్యాత్మిక విశ్వాసం, తాంత్రిక సంప్రదాయం, చారిత్రక నేపథ్యం కలగలిసిన ఈ ఆలయం ఉజ్జయిని పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆధ్యాత్మిక విషయాలు
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
VRK Diet : అసలు ఏమిటీ విఆర్కే డైట్? డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులను నయం చేస్తుందా?
Recommended image2
తల నరికేసినా కూడా వారాల తరబడి బతికేయగల వింత జంతువు ఇది..!
Recommended image3
Bank Account: అకౌంట్ హోల్డర్ చనిపోతే వారి ఖాతాలోని డబ్బులు ఏమవుతాయి? వాటిని ఎలా తీసుకోవచ్చు?
Related Stories
Recommended image1
5 నెల‌ల్లో 2.5 కోట్ల వ్యూస్‌.. పెళ్లి భ‌ర‌త్ అయినా, గ‌ణేశ్ నిమ‌జ్జ‌న‌మైనా ఈ పాట ఉండాల్సిందే
Recommended image2
కుటుంబ పెద్ద చ‌నిపోతే.. ఇతర సభ్యులు ఎందుకు గుండు చేసుకుంటారు? అస‌లు రీజ‌న్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved