MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • గుడిలో పెట్టే పులిహోర రెసిపీ ఇదిగో.. ఈ సీక్రెట్ టిప్స్ తో రుచి అదిరిపోతుంది

గుడిలో పెట్టే పులిహోర రెసిపీ ఇదిగో.. ఈ సీక్రెట్ టిప్స్ తో రుచి అదిరిపోతుంది

గుడిలో ప్రసాదంగా పెట్టే పులిహోర అంటే ఎంతో మందికి ఇష్టం. దాని రుచి, సువాసన ఎంతో బావుంటుంది. టెంపుల్ స్టైల్లో పులిహోర ఇంట్లో రుచిగా రావాలంటే ఎలా వండాలో రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 30 2026, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
గుడిలో పెట్టే పులిహోర రెసిపీ
Image Credit : Vismai Foods

గుడిలో పెట్టే పులిహోర రెసిపీ

గుడిలో పెట్టే పులిహోర ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఆ పులిహోర సువాసన, పులుపు-కారం కలిసిన ఆ రుచి చాలా బావుంటుంది. ఇంట్లో ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ స్పెషల్ టేస్ట్ రావడం లేదని చాలామంది ఫీల్ అవుతుంటారు. సరైన కొలతలతో వండింతే అచ్చం గుడిలో లాంటి పులిహోరను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఆ రుచి వెనక ఉన్న సీక్రెట్ టిప్స్, రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
టెంపుల్ స్టైల్ పులిహోర రెసిపీకి కావాల్సిన పదార్థాలు
Image Credit : Pinterest

టెంపుల్ స్టైల్ పులిహోర రెసిపీకి కావాల్సిన పదార్థాలు

బియ్యం - 2 కప్పులు

నీళ్లు - తగినన్ని

  • నువ్వుల నూనె - 1 టీస్పూన్
  • చింతపండు - పెద్ద నిమ్మకాయ సైజు
  • నువ్వుల నూనె - 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు
  • ఆవాలు - 1 టీస్పూన్
  • మినప్పప్పు - 1 టీస్పూన్
  • పచ్చిశెనగపప్పు - 1 1/2 టీస్పూన్
  • పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
  • ఎండుమిర్చి - 4 నుంచి 5
  • పచ్చిమిర్చి - 1 లేదా 2
  • కరివేపాకు - 1 రెమ్మ
  • ఇంగువ - 1/4 టీస్పూన్
  • పసుపు - 1/4 టీస్పూన్
  • ఉప్పు - తగినంత

పులిహోర పొడి కోసం:

  • ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
  • ఎండుమిర్చి - 5 నుంచి 6
  • పచ్చిశెనగపప్పు - 1 టేబుల్ స్పూన్
  • మినప్పప్పు - 1 టీస్పూన్
  • మెంతులు - 1/2 టీస్పూన్
  • నువ్వులు - 1 టీస్పూన్
  • మిరియాలు - 1/2 టీస్పూన్
  • జీలకర్ర - 1/2 టీస్పూన్
33
రెసిపీ ఇలా
Image Credit : Pinterest

రెసిపీ ఇలా

  • ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి పొడిపొడిగా వండుకోండి. అన్నం మెత్తబడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఉడికిన అన్నాన్ని ఒక పెద్ద పళ్లెంలో ఆరబోసి, కొద్దిగా నువ్వుల నూనె కలపండి.
  • ఆ తర్వాత చింతపండును వేడి నీళ్లలో నానబెట్టి, గుజ్జు తీసి వడకట్టుకోండి. ఈ చింతపండు రసాన్ని స్టవ్ మీద పెట్టి కాసేపు మరిగించండి.
  • అందులో పసుపు, ఉప్పు వేసి పచ్చివాసన పోయేదాకా ఉడికించండి. ఇది కొద్దిగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేయండి.
  • మినప్పప్పు, మెంతులు, నువ్వులు, మిరియాలు, జీలకర్రను విడివిడిగా లేదా ఒకదాని తర్వాత ఒకటి మీడియం మంట మీద దోరగా వేయించుకోండి.
  • ఇవి బాగా చల్లారాక మిక్సీలో వేసి కాస్త బరకగా పొడి చేసుకోండి. గుడి పులిహోరకు ఆ అద్భుతమైన సువాసనను ఇచ్చే అసలైన సీక్రెట్ పొడి ఇదే!
  • కడాయిలో నువ్వుల నూనె వేడి చేసి ఆవాలు వేయండి. అవి చిటపటలాడాక మినప్పప్పు, పచ్చిశెనగపప్పు, పల్లీలు వేసి దోరగా వేయించండి.
  • ఆ తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ కలపండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న చింతపండు గుజ్జును ఇందులో పోసి బాగా మరిగించండి.
  • నూనె పైకి తేలి, మిశ్రమం చిక్కబడేదాకా మీడియం మంట మీద ఉడికించండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పులిహోర పొడిని వేసి బాగా కలపండి.
  • మరో 3-5 నిమిషాలు ఉడికించి దించేయండి. చల్లారిన అన్నం మీద ఈ పులికాచల్ వేసి, అన్నం విరిగిపోకుండా నెమ్మదిగా కలపండి.
  • కలిపిన వెంటనే తినేయకుండా, కనీసం అరగంట నుంచి గంట పాటు పక్కన పెడితే.. పులుపు అన్నానికి బాగా పట్టి రుచి అదిరిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mutton Curry: చలికాలంలో మటన్ కూర చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎందుకు?
Recommended image2
DMart: ఈ దసరాకు డీమార్ట్ లో షాపింగ్ చేయండి.. రూ.1500 వరకూ ఆదా చేయండి
Recommended image3
ఉప్పు డబ్బాలో నీళ్లు పడ్డాయా? ఇలా పొడిగా మార్చేయండి
Related Stories
Recommended image1
Holidays: ప్రపంచంలో అత్యధిక సెలవులు కలిగిన దేశం ఏదో తెలుసా? షాక్ అయిపోతారు
Recommended image2
Mutton Curry: చలికాలంలో మటన్ కూర చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved