MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • తల నరికేసినా కూడా వారాల తరబడి బతికేయగల వింత జంతువు ఇది..!

తల నరికేసినా కూడా వారాల తరబడి బతికేయగల వింత జంతువు ఇది..!

మనిషి శరీరం నుంచి చేతులు, కాళ్లు వేరు చేసినా బతకగలమేమో కానీ, తల వేరే చేస్తే బతకలేం. కానీ, ఓ జంతువు మాత్రం.. మీరు దాని తలను, మొండాన్ని వేరు చేసినా కూడా దర్జాగా బతికేయగలదు. ఎలానో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 30 2026, 05:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తల లేకున్నా బతికే వింత జీవి ఏది?
Image Credit : gemini ai

తల లేకున్నా బతికే వింత జీవి ఏది?

ఈ భూమి మీద చాలా రకాల జంతువులు ఉన్నాయి. ప్రకృతి సృష్టంచిన జీవుల్లో అత్యంత శక్తివంతమైన, విచిత్రమైన జంతువులు చాలా ఉన్నాయి. వాటిలో ఒక జంతువు.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఎంతలా అంటే... తన తలను శరీరం నుంచి వేరు చేసినా కూడా.. అది ప్రాణాలతో జీవించగలదు. ఆ జంతువు మరేదో కాదు.. బొద్దింక. అవును, మీరు చదివింది నిజమే, డైనోసార్లు అంతరించిపోయిన కాలం నుంచి భూమిపై ఉన్న ఈ బొద్దింక గురించి కొన్ని నమ్మసక్యం కాని విషయాలు ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తల లేకపోయినా బతకగలదా?
Image Credit : pinterest

తల లేకపోయినా బతకగలదా?

ఒక మనిషికి లేదా ఇతర జీవులకు తల తొలగిపోతే క్షణాల వ్యవధిలో మరణిస్తారు. కానీ, బొద్దింక తల లేకపోయినా సరే దాదాపు ఒక వారం లేదా రెండు వారాల పాటు హాయిగా బతికేయగలదు. దీనికి కారణం వాటి శ్వాస వ్యవస్థ. ఇవి ముక్కు ద్వారా కాకుండా తమ శరీరంపై ఉండే చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. అయితే.. తల లేకపోవడం వల్ల నోరు కూడా పోతుంది కాబట్టి.. నీరు, ఆహారం లభించక చివరికి ఆకలితో అలమటించి చనిపోతాయి. అలా ఆకలితో చనిపోవడానికి కూడా కనీసం వారం రోజులు తీసుకుంటుంది. అప్పటి వరకు అది బతకగలదు.

34
శరీరం ద్వారానే శ్వాస..
Image Credit : pinterest

శరీరం ద్వారానే శ్వాస..

బొద్దింకలు తమ శరీర భాగాల ద్వారానే ఆక్సిజన్‌‌ను గ్రహిస్తాయి కాబట్టి, శ్వాస తీసుకోవడానికి మెదడు లేదా తల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు.. ఇవి చాలా శక్తివంతమైనవి. ఎంతలా అంటే.. రేడియేషన్ తట్టుకునే అద్భుతమైన శక్తి దీనికి ఉంది. మానవులు లేదా ఇతర జీవులు ప్రాణాలు కోల్పోయే మోతాదులో రేడియేషన్ ఉన్నప్పటికీ, బొద్దింకలు సులభంగా తట్టుకుని జీవించగలవు.

44
ఆహారం లేకుండా ఎన్ని రోజులు బతకగలవంటే...
Image Credit : pinterest

ఆహారం లేకుండా ఎన్ని రోజులు బతకగలవంటే...

ఆహారం లేకుండా మనం ఒక రోజంతా ఉంటేనే నీరసపడిపోతాం. కానీ, బొద్దింకలు ఏదీ తినకుండా దాదాపు ఒక నెల రోజుల పాటు జీవించగలవు. అలాగే నీరు లేకుండా కూడా కొన్ని వారాల పాటు ఇవి బతకగలవు. ప్రకృతిలో ఏ పరిస్థితులనైనా ఎదుర్కొంటూ తన వంశాన్ని కాపాడుకోవడంలో ఈ బొద్దింకల జీవన విధానం నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Account: అకౌంట్ హోల్డర్ చనిపోతే వారి ఖాతాలోని డబ్బులు ఏమవుతాయి? వాటిని ఎలా తీసుకోవచ్చు?
Recommended image2
స‌ముద్రాలు ఒక్క‌సారిగా మంచినీటిగా మారితే ఏమ‌వుతుందో తెలుసా.? విప‌త్తు ఖాయం
Recommended image3
Psychology: సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి ఎక్కువగా ఏడ్చే 5 సందర్భాలు ఇవే!
Related Stories
Recommended image1
Demon Pavan: రీతూని నేను వాడుకోలేదు... బ్రేకప్ చెప్పి షాకిచ్చిన డెమాన్ పవన్..!
Recommended image2
Blind Village: ఈ గ్రామంలో చెట్టును చూస్తే చూపు పోతుందా? ఈ గ్రామం వెనక ఉన్న కథేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved