MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Traffic Lights: రెడ్ అంటే ఆగాలి, గ్రీన్ అంటే వెళ్లాలి.. ఈ రంగులనే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?

Traffic Lights: రెడ్ అంటే ఆగాలి, గ్రీన్ అంటే వెళ్లాలి.. ఈ రంగులనే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?

Traffic Lights: రోడ్లపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటిస్తుంటారు. రెడ్‌ లైట్ పడితే ఆగిపోవడం, ఆకుపచ్చ లైట్ వెలిగితే ముందుకు సాగడం, పసుపు రంగు కనిపిస్తే సిద్ధంగా ఉండటం తెలిసిందే. అయితే ఇందుకు ఈ రంగుల‌నే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా? 

2 Min read
Author : Narender Vaitla
Published : May 26 2026, 06:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రైల్వే సిగ్నల్స్‌తో ప్రారంభమైన వ్యవస్థ
Image Credit : Gemini AI

రైల్వే సిగ్నల్స్‌తో ప్రారంభమైన వ్యవస్థ

ట్రాఫిక్ లైట్ల చరిత్ర 1830–1840 కాలంలో బ్రిటన్ రైల్వేల దగ్గర మొదలైంది. ఆ రోజుల్లో రైళ్ల మధ్య ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లకు సంకేతాలు ఇవ్వడానికి ప్రత్యేక సిగ్నల్ వ్యవస్థ అవసరమైంది. అప్పుడు మూడు రంగులను ఉపయోగించేవారు. ఎరుపు – ప్రమాదం లేదా ఆగాలి, ఆకుపచ్చ – జాగ్రత్త, తెలుపు – మార్గం సురక్షితం. ఈ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఇంజినీర్ హెన్రీ బూత్ కీలక పాత్ర పోషించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
తెలుపు రంగుతో జరిగిన ప్రమాదం
Image Credit : ANI

తెలుపు రంగుతో జరిగిన ప్రమాదం

మొదట్లో “ముందుకు వెళ్లొచ్చు” అనే అర్థంలో తెలుపు రంగును ఉపయోగించేవారు. కానీ రాత్రి సమయంలో డ్రైవర్లు తెలుపు లైట్‌ను దూరంలోని నక్షత్రాలు లేదా ఇతర వెలుగులతో పోల్చుకోవ‌డంతో గంద‌ర‌గోళంలో ప‌డ్డారు. ఒకసారి సిగ్నల్‌లో ఉన్న ఎరుపు గాజు పగిలిపోవడంతో లోపలున్న తెలుపు లైట్ కనిపించింది. డ్రైవర్ దాన్ని సురక్షిత సంకేతంగా భావించి రైలును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో రైళ్ల ఢీకొన్న ప్రమాదం జరిగింది. ఆ ఘటన తర్వాత అధికారులు తెలుపు రంగును పూర్తిగా తొలగించి, దాని స్థానంలో ఆకుపచ్చ రంగును తీసుకొచ్చారు. అలాగే పసుపు రంగును “జాగ్రత్త” సంకేతంగా నిర్ణయించారు.

Related Articles

Related image1
Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్‌కు మూడు రెక్క‌లే ఎందుకు ఉంటాయి.? దీనికి అస‌లు కార‌ణం ఏంటంటే
Related image2
ఇక‌పై ప‌దే ప‌దే బ్యాట‌రీలు కొనాల్సిన ప‌నిలేదు.. టైప్‌సీ ఛార్జ‌ర్‌తో ఛార్జింగ్ చేసుకునే సెల్స్ వ‌చ్చేశాయ్‌
35
ప్రపంచంలో తొలి ట్రాఫిక్ లైట్ ఎక్కడ పెట్టారు?
Image Credit : our own

ప్రపంచంలో తొలి ట్రాఫిక్ లైట్ ఎక్కడ పెట్టారు?

రైల్వే సిగ్నల్ విధానాన్ని తరువాత రోడ్లపై కూడా అమలు చేశారు. ప్రపంచంలో తొలి ట్రాఫిక్ సిగ్నల్‌ను 1868 డిసెంబర్ 10న ప్లేస్ ఆఫ్ వెస్ట్‌మినిస్ట‌ర్ బయట ఏర్పాటు చేశారు. దీనిని జాన్ పీక్ నైట్ రూపొందించారు. మొదట ఇది గ్యాస్‌తో పనిచేసే విధంగా ఉండేది. అప్పట్లో కేవలం ఎరుపు, ఆకుపచ్చ రంగులే ఉండేవి. ఒక పోలీస్ అధికారి చేతితో ఈ సిగ్నల్స్‌ను నియంత్రించేవాడు. తర్వాత 1912లో లెస్ట‌ర్‌ వైర్ తొలి ఎలక్ట్రిక్ ట్రాఫిక్ లైట్‌ను రూపొందించారు. ఆ తరువాత 1920లో విలియ‌మ్ పాట్స్‌ ఆధునిక మూడు రంగుల ట్రాఫిక్ లైట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు.

45
ఆగడానికి ఎరుపు రంగునే ఎందుకు ఎంచుకున్నారు?
Image Credit : Generated by google gemini AI

ఆగడానికి ఎరుపు రంగునే ఎందుకు ఎంచుకున్నారు?

ఎరుపు రంగుకు శాస్త్రీయ కారణం ఉంది. కాంతి తరంగాల్లో ఎరుపు రంగు వెవ్‌లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అది పొగ, వర్షం, దుమ్ము, పొగమంచులో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా మనిషి మ‌న‌సులో కూడా ఎరుపు రంగు ప్రమాదం, హెచ్చరిక, అపాయం అనే భావనను కలిగిస్తుంది. అందుకే “ఆగాలి” అనే సంకేతానికి ఎరుపు రంగును ఉపయోగించడం ప్రారంభించారు.

55
ఆకుపచ్చ రంగు ముందుకు వెళ్లమనే సంకేతంగా ఎందుకు మారింది?
Image Credit : Generated by google gemini AI

ఆకుపచ్చ రంగు ముందుకు వెళ్లమనే సంకేతంగా ఎందుకు మారింది?

మన క‌ళ్లు ఆకుపచ్చ రంగును చాలా త్వరగా గుర్తుప‌డ‌తాయి. పగలు, రాత్రి రెండింట్లోనూ ఆకుపచ్చ కాంతి స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల డ్రైవర్లు సులభంగా గుర్తించగలుగుతారు. ఇక పసుపు రంగును మధ్యస్థ హెచ్చరికగా ఉపయోగించారు. అంటే “త్వరలో సిగ్నల్ మారబోతోంది.. సిద్ధంగా ఉండండి” అనే అర్థం. ఇలా శాస్త్రీయ కారణాలు, భద్రతా అవసరాలు కలిసి నేటి ట్రాఫిక్ లైట్ వ్యవస్థను రూపొందించాయి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఇదే రంగుల విధానం ఉండటానికి ఇదే కారణం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
షుగర్ ఉత్పత్తి, వాడకంలో వరల్డ్ నెంబర్ 1 ఎవరో తెలుసా..?
Recommended image2
India vs USA : మనలా అమెరికాలో ఇళ్లకు గేట్లు, కాంపౌండ్ వాల్స్ ఉండవు.. ఎందుకో తెలుసా?
Recommended image3
Car Tyres: టైర్లు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి.? వేరే కలర్‌లో ఎందుకు ఉండవో ఆలోచించారా.?
Related Stories
Recommended image1
Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్‌కు మూడు రెక్క‌లే ఎందుకు ఉంటాయి.? దీనికి అస‌లు కార‌ణం ఏంటంటే
Recommended image2
ఇక‌పై ప‌దే ప‌దే బ్యాట‌రీలు కొనాల్సిన ప‌నిలేదు.. టైప్‌సీ ఛార్జ‌ర్‌తో ఛార్జింగ్ చేసుకునే సెల్స్ వ‌చ్చేశాయ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved