MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Slowest Train:మనిషి నడిచే వేగం కన్నా.. నెమ్మదిగా కదిలే రైలు, ఈ రైలు ఎక్కడానికి క్యూలు కడుతున్న జనం, ఎక్కడో తెలుసా?

Slowest Train:మనిషి నడిచే వేగం కన్నా.. నెమ్మదిగా కదిలే రైలు, ఈ రైలు ఎక్కడానికి క్యూలు కడుతున్న జనం, ఎక్కడో తెలుసా?

 Slowest Train: ఒక మనిషి గంటకు 8 నుంచి 9 కిలోమీటర్లు చాలా ఈజీగా నడిచేయగలడు. అలా మనిషి నడిచే వేగం కంటే తక్కువ వేగంతో నడిచే రైలు ఒకటి ఉందని మీకు తెలుసా? అది ఎక్కడానికి జనాలు క్యూలు కట్టేస్తుంటారు? ఏంటి ఆ రైలు స్పెషల్? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 06 2026, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ రైలు కంటే మనమే ఫాస్ట్ గా నడవచ్చు...
Image Credit : Gemini

ఈ రైలు కంటే మనమే ఫాస్ట్ గా నడవచ్చు...

మన దేశంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో రైలు ఎక్కే ఉంటారు. రైలు ప్రయాణం కొన్ని గంటల పాటు, రోజుల పాటు సాగుతుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కవ మంది రైలు జర్నీనే ఇష్టపడతారు. అయితే.. ఈ మధ్యకాలంలో రైలు ప్రయాణం చాలా సులువు అయ్యిందనే చెప్పాలి. అత్యంత వేగంగా నడిచే రైళ్లు చాలానే వచ్చాయి. అయితే.. ఇలాంటి రోజుల్లో కూడా మన దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఒకటి ఉందని మీకు తెలుసా..? అంత నెమ్మదిగా నడిస్తే.. ఆ రైలు ఎవరు ఎక్కుతారు అని మాత్రం అనుకోకుండి.. ఈ రైలు ఎక్కడానికి రోజూ క్యూలు కట్టేవారు కూడా ఉన్నారు.. ఇంతకీ ఆ రైలు ఎక్కడ ఉంది? ఎక్కడ నుంచి ప్రయాణిస్తుంది? ఇంత నెమ్మదిగా వెళ్లడం వెనక కారణం ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అద్భుతమైన రైలు ప్రయాణం..
Image Credit : easemytrip

అద్భుతమైన రైలు ప్రయాణం..

ఈ రైలు చాలా నెమ్మదిగా వెళ్లినా.. ఇంకాస్త నెమ్మదిగా వెళితే బాగుండు అనే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే.. ఇది దట్టమైన అడవులు, పొగమంచుతో నిండిన కొండలు, చీకటిగా ఉండే సొరంగాలు, టీ తోటల మధ్యలో సాగుతుంది. ఈ రైలు ఎక్కినప్పుడు ఎంత సేపు కూర్చొన్నాం అనే భావన కంటే..ప్రకృతి మీద మాత్రమే దృష్టి ఉంటుంది. చాలా అద్భుతమైన అనుభూతిని మిగులుస్తుంది.

34
నీలగిరి పర్వాతాల మధ్య నడిచే రైలు...
Image Credit : easemytrip

నీలగిరి పర్వాతాల మధ్య నడిచే రైలు...

ఈ రైలు మెట్టపళయం, ఊటీ మధ్య నీలగిరి కొండల మధ్య నడుస్తుంది. భారతదేశంలోనే అత్యంత నెమ్మదిగా కదిలే రైలుగా దీనికి గుర్తింపు ఉంది. గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. అంటే.. ఆ రైలు కంటే మనుషులే వేగంగా నడవగలరు. మొత్తం 46 కిలోమీటర్ల పాటు ఈ ప్రయాణం సాగుతుంది. అంటే మొత్తం ఐదు గంటల ప్రయాణం. అంత నెమ్మదిగా నడిచినా.. అత్యంత అందమైన ప్రయాణంగా.. ఆ రైలు ఎక్కిన ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది.

44
నెమ్మదిగా రైలు కదలడానికి కారణం ఏంటి..?
Image Credit : easemytrip

నెమ్మదిగా రైలు కదలడానికి కారణం ఏంటి..?

ఈ రైలు నీలగిరి పర్వాతాల మధ్య ప్రయాణిస్తుంది. కొండల నిటారు భాగం మీద రైలు కదులుతుంది. అందుకే... ఇతర ప్యాసింజర్ రైలు కన్నా తక్కువ వేగంతో ఈ రైలు కదులుతుంది. ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే.. భద్రతా కారణాల దృష్ట్యా నెమ్మదిగా కదులుతుంది. భద్రత కోసం నెమ్మదిగా కదిలినా.. చుట్టూ మనోహర దృశ్యాలు ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

సినిమా పాటల చిత్రీకరణ...

ఈ రైలులో కొన్ని సినిమా పాటలు కూడా చిత్రీకరించడం విశేషం. షారూఖ్ ఖాన్, మలైకా అరోరా కలిసి నటించిన దిల్ సే మూవీలో చయ్య చయ్య పాట కూడా ఈ రైలులోనే చిత్రీకరించారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ప్రయాణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Investment : ఈరోజు తులం బంగారం కొంటే 2050 నాటికి ఎంత డబ్బు వస్తుంది? లాభం ఎంత?
Recommended image2
Dimple Cheeks : కొందరి బుగ్గలపై సొట్టలు పడతాయి? ఈ సొట్టబుగ్గలకు కారణమేంటి?
Recommended image3
Ambani Ice cream: అంబానీ వారి ఐస్‌క్రీమ్.. అది కూడా కేవలం రూ.10లకే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved