సన్‌ఫ్లవర్స్ సూర్యుడి వైపే ఎందుకు తిరిగి ఉంటాయో తెలుసా?
feature Jul 04 2026
Author: Arun Kumar P Image Credits:Getty
Telugu
పొద్దుతిరుగుడు ఉపయోగాలు
ప్రపంచంలోని అందమైన పువ్వులలో పొద్దుతిరుగుడు ఒకటి. ఇది ఎన్నో ప్రయోజనాలున్న పువ్వు కూడా. వంట నూనెల కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
Image credits: Getty
Telugu
సూర్యుడి చుట్టూ తిరిగే ఏకైక పువ్వు
పొద్దుతిరుగుడు పువ్వులు ఎప్పుడూ సూర్యుడు ఉన్నవైపే తిరిగివుంటాయి... ఇదే వీటి ప్రత్యేకత. వీటికి సూర్యుడితో విడదీయరాని బంధం ఉంది.
Image credits: Getty
Telugu
సూర్యుడితో పాటే ప్రయాణం
సూర్యుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తాడు. పొద్దుతిరుగుడు పువ్వు కూడా సూర్యుడితో పాటే తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది. రాత్రిపూట కూడా మరుసటి రోజు సూర్యుడి కోసం ఎదురుచూస్తుంది.
Image credits: Getty
Telugu
సన్ ప్లవర్ గురించి సైన్స్ ఏం చెబుతోంది?
పొద్దుతిరుగుడు పువ్వుల ఈ ప్రవర్తనను సైన్స్ పరిభాషలో 'హీలియోట్రోపిజం' (Heliotropism) అంటారు. అంటే ఏమిటో తెలుసుకుందాం.
Image credits: Getty
Telugu
హార్మోన్లే కారణమా?
పొద్దుతిరుగుడు మొక్కల పెరుగుదలలో హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పువ్వు కింద ఉండే ఆకుల్లో ఈ హార్మోన్లు తయారవుతాయి. అక్కడి నుంచి పువ్వు కాడకు చేరుకుంటాయి.
Image credits: Getty
Telugu
కాంతి ప్రభావం
సూర్యరశ్మి పడే దిశకు వ్యతిరేక దిశలో ఈ హార్మోన్లు ఎక్కువగా పోగవుతాయి. ఆ భాగంలో కణాలు వేగంగా పెరిగి కాడపై ఒత్తిడిని కలిగిస్తాయి. దీంతో పువ్వు కాంతి ఉన్న సూర్యుడి వైపు వంగుతుంది.
Image credits: Getty
Telugu
సూర్యుడిని అనుసరిస్తూ..
సూర్యుడు తూర్పున ఉన్నప్పుడు, కాడ పశ్చిమ భాగంలో కణాలు వేగంగా పెరుగుతాయి. దీంతో పువ్వు తూర్పు వైపు తిరుగుతుంది. సూర్యుడు పడమరకు వెళ్లేకొద్దీ, ఈ ప్రక్రియ కొనసాగుతుంది.