MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Feature
  • Most Venomous Snakes: ఒక్కకాటుతో ఏనుగును కూడా చంపేసే స్నేక్.. ఇండియాలో టాప్ 5 విషపూరితమైన పాముల ఇవే

Most Venomous Snakes: ఒక్కకాటుతో ఏనుగును కూడా చంపేసే స్నేక్.. ఇండియాలో టాప్ 5 విషపూరితమైన పాముల ఇవే

Most Venomous Snakes: భారత్‌లో అత్యంత విషపూరితమైన పాములు చాలానే ఉన్నాయి. అయితే, వీటిలో టాప్ 5 పాములు ఏవో మీకు తెలుసా? టాప్ విషసర్పాలు, వాటి లక్షణాలు, కాటు వేస్తే అయ్యే ప్రమాదం, ప్రాణాలు రక్షించే ఫస్ట్ ఎయిడ్ టిప్స్ ఇక్కడ తెలుసుకుందాం.

4 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 05 2026, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఈ 5 పాములు కనిపిస్తే అస్సలు రిస్క్ తీసుకోవద్దు.. ఒక్క కాటుతో గేమ్ ఓవర్
Image Credit : Gemini

ఈ 5 పాములు కనిపిస్తే అస్సలు రిస్క్ తీసుకోవద్దు.. ఒక్క కాటుతో గేమ్ ఓవర్

భారతదేశంలో దాదాపు 300 రకాల పాము జాతులు నివసిస్తున్నాయి. వీటిలో సుమారు 60 వరకు విషపూరితమైనవి కాగా, కొన్ని మాత్రమే మానవులకు తీవ్రమైన హాని కలిగిస్తాయి. మన దేశంలో నమోదవుతున్న అత్యధిక పాము కాటు మరణాలకు బిగ్ ఫోర్ గా పిలిచే నాలుగు ప్రధాన పాములే కారణమని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషసర్పం కింగ్ కోబ్రా కూడా భారతదేశంలోనే ఉంది. అసలు మన దేశంలో అత్యంత ప్రమాదకరమైన ఆ టాప్ 5 విషసర్పాలు ఏవి, వాటి కాటు పడితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, తక్షణమే ఏం చేయాలో వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
1. ఇండియన్ కోబ్రా (నాగుపాము)
Image Credit : Asianet News

1. ఇండియన్ కోబ్రా (నాగుపాము)

మన దేశంలో సాంస్కృతికంగా, సంప్రదాయపరంగా నాగుపాముకు ప్రత్యేక స్థానం ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ ఇది కనిపిస్తుంది.

• విషం రకం: న్యూరోటాక్సిక్, కార్డియోటాక్సిక్ అంటే నాడులు, గుండె వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

• పొడవు: సాధారణంగా 1 నుంచి 1.5 మీటర్లు (3 నుంచి 6 ఫీట్లు). కొన్ని 2.2 మీటర్ల వరకు పెరుగుతాయి.

• గుర్తించడం ఎలా: ముప్పు ఎదురైనప్పుడు పడగ విప్పుతుంది. పడగ వెనుక భాగంలో కళ్ళద్దాల వంటి గుర్తు ఉంటుంది. పసుపు-గోధుమ రంగు నుండి నలుపు రంగులో ఉంటుంది.

• ఆహారం: ఎలుకలు, కప్పలు, తొండలు, పక్షులు, ఇతర పాములు.

• కాటేస్తే లక్షణాలు: కనురెప్పలు వాలిపోవడం, మాట్లాడటం, మింగడంలో ఇబ్బంది, కండరాల పక్షవాతం, శ్వాస తీసుకోవడం కష్టంగా మారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

• ముఖ్య విషయాలు: నాగుపాములు ఎక్కువగా జనావాసాలు, వ్యవసాయ పొలాల వద్ద ఎలుకల కోసం వస్తుంటాయి. అందుకే ఇవి ఎక్కువగా మానవులకు ఎదురవుతుంటాయి.

37
2. కామన్ క్రేట్ (కట్లపాము)
Image Credit : Wikipedia

2. కామన్ క్రేట్ (కట్లపాము)

భారతదేశంలో నేలమీద సంచరించే పాములలో అత్యంత శక్తివంతమైన విషం ఉన్న పాము కట్లపాము. ఇది రాత్రి వేళల్లో మాత్రమే బయటకు వస్తుంది.

• విషం రకం: అత్యంత శక్తివంతమైన న్యూరోటాక్సిక్.

• పొడవు: 0.9 నుంచి 1.5 మీటర్లు (3 నుంచి 5 ఫీట్లు).

• గుర్తించడం ఎలా: మెరిసే నలుపు లేదా డార్క్ స్టీల్-బ్లూ రంగులో ఉంటుంది. శరీరంపై జతలుగా సన్నని తెల్లటి నిలువు చారలు ఉంటాయి. చర్మం మెత్తగా, మృదువుగా ఉంటుంది.

• రాత్రి వేళల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. పగటిపూట బయటకు రాకుండా దాక్కుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళ నేలపై నిద్రించే వారిని ఇది ఎక్కువగా కాటేస్తుంటుంది.

• లక్షణాలు: దీని కాటు అసలు నొప్పే ఉండదు. ఏదో చిన్న చీమ లేదా కీటకం కుట్టినట్లు అనిపిస్తుంది. కానీ ఉదయానికి శరీరం పక్షవాతానికి గురై, శ్వాస ఆడక ప్రాణాలు కోల్పోతారు.

47
3. రస్సెల్స్ వైపర్ (రక్తపింజరి))
Image Credit : our own

3. రస్సెల్స్ వైపర్ (రక్తపింజరి))

భారత్‌లో నమోదయ్యే తీవ్రమైన పాము కాటు కేసుల్లో దాదాపు 40 శాతానికి పైగా రక్తపింజరి వల్లే జరుగుతున్నాయి. ఇది చాలా కోపంగా ఉండే రకం పాములు.

• విషం రకం: హెమోటాక్సిక్, సైటోటాక్సిక్. రక్తం, కణజాలంపై దాడి చేస్తుంది.

• పొడవు: 1 నుంచి 1.5 మీటర్లు. లావుగా, బలంగా ఉంటుంది.

• గుర్తించడం ఎలా: శరీరంపై మూడు వరుసల్లో గొలుసుకట్టు లాంటి గోధుమ రంగు ఓవల్ మచ్చలు ఉంటాయి. తల త్రిభుజాకారంలో ఉంటుంది.

• ప్రమాదం అనిపిస్తే ముక్కు రంధ్రాల ద్వారా గాలిని బయటకు వదులుతూ ప్రెజర్ కుక్కర్ విజిల్ లాంటి పెద్ద శబ్దాన్ని చేస్తుంది.

• లక్షణాలు: కాటు వేసిన చోట విపరీతమైన నొప్పి, వాపు వస్తాయి. అంతర్గత రక్తస్రావం, రక్తం గడ్డకట్టే సామర్థ్యం కోల్పోవడం, కణజాలం దెబ్బతినడం, కిడ్నీలు విఫలమవ్వడం వంటి తీవ్ర సమస్యలు వస్తాయి.

57
4. సా-స్కేల్డ్ వైపర్ (చిన్న రక్తపింజరి)
Image Credit : Asianet News

4. సా-స్కేల్డ్ వైపర్ (చిన్న రక్తపింజరి)

ఇది పరిమాణంలో చాలా చిన్నదే అయినా, తన కోపంతోనూ, విషంతోనూ అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ఎడారి, పొడి ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

• విషం రకం: హెమోటాక్సిక్.

• పొడవు: 30 నుంచి 80 సెంటీమీటర్లు మాత్రమే.

• గుర్తించడం ఎలా: గరుకుగా ఉండే పొలుసులు ఉంటాయి. తలపై త్రిశూలం లేదా క్రాస్ గుర్తు లాంటి తెల్లటి ముద్ర ఉంటుంది.

• శత్రువులు ఎదురైనప్పుడు తన గరుకు పొలుసులను ఒకదానికొకటి ఎనిమిది ఆకారంలో రుద్దుతూ కత్తితో కోసినట్లు లేదా రంపపు శబ్దాన్ని చేస్తుంది.

• లక్షణాలు: తీవ్రమైన నొప్పి, శరీరంలో అంతర్గత రక్తస్రావం, చర్మంపై బొబ్బలు రావడం, రక్తం గడ్డకట్టకపోవడం దీని ప్రధాన లక్షణాలు.

67
5. కింగ్ కోబ్రా (రాచనాగు)
Image Credit : chatgpt.com

5. కింగ్ కోబ్రా (రాచనాగు)

ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషసర్పం రాచనాగు. ఇది దాదాపు 3 నుంచి 4 మీటర్లు వరకు పెరుగుతుంది.

• విషం రకం: న్యూరోటాక్సిక్.

• ప్రత్యేకత: కామన్ క్రేట్ కంటే దీని విషం తక్కువ డోస్ కలిగినదే అయినప్పటికీ, ఒకే కాటులో ఇది అత్యధిక పరిమాణంలో విషాన్ని బాధితుడి శరీరంలోకి పంపుతుంది.

• ఆహారం: ఇది ప్రధానంగా ఇతర పాములను తింటుంది.

• సంచారం: దట్టమైన అడవులు, పశ్చిమ కనుమలు, ఈశాన్య భారత్, ఒడిశా ప్రాంతాల్లో కనిపిస్తుంది.

• లక్షణాలు: దీని సింగిల్ బైట్ పడితే పెద్ద ఆసియా ఏనుగు కూడా కొన్ని గంటల్లో చనిపోతుంది. మనుషులు 30 నిమిషాల్లో శ్వాస నిలిచిపోయి కుప్పకూలిపోతారు.

77
పాము కాటు వేస్తే పాటించాల్సిన ఫస్ట్ ఎయిడ్ జాగ్రత్తలు ఏమిటి?
Image Credit : pinterest

పాము కాటు వేస్తే పాటించాల్సిన ఫస్ట్ ఎయిడ్ జాగ్రత్తలు ఏమిటి?

పాము కాటుకు గురైనప్పుడు సరైన సమయంలో ఫస్ట్ ఎయిడ్ అందించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. మన దేశంలో బిగ్ ఫోర్ పాముల విషాన్ని విరిచేందుకు పాలివాలెంట్ యాంటీవినమ్ అందుబాటులో ఉంది.

పాము కాటేస్తే ఏం చేయాలి?

• బాధితుడు ముందుగా ప్రశాంతంగా ఉండాలి. భయపడితే గుండె వేగం పెరిగి విషం వేగంగా శరీరంలోకి పాకుతుంది.

• కాటు పడిన అవయవాన్ని అసలు కదల్చకుండా ఉంచాలి.

• వాపు రాకముందే చేతికి ఉన్న ఉంగరాలు, గడియారాలు, బిగుతుగా ఉన్న దుస్తులను తీసివేయాలి.

• ఆలస్యం చేయకుండా యాంటీవినమ్ అందుబాటులో ఉండే దగ్గరలోని ఆసుపత్రికి తక్షణమే తీసుకెళ్లాలి.

• సాధ్యమైతే సురక్షితమైన దూరం నుండి పాము ఫోటో తీయండి. అంతే తప్ప పామును పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించవద్దు.

ఏం చేయకూడదు?

• కాటు వేసిన చోట బ్లేడుతో కోయడం లేదా నోటితో విషాన్ని పీల్చడానికి ప్రయత్నించకూడదు.

• గాయం వద్ద ఐస్ ముక్కలు పెట్టడం లేదా మూలికా వైద్యం చేయకూడదు.

• కాటు పడిన భాగానికి పైన తాడు లేదా గుడ్డతో రక్తం ప్రసరించకుండా గట్టిగా కట్టకూడదు.

సకాలంలో వైద్య సహాయం అందిస్తే పాము కాటు నుండి నూటికి నూరు శాతం ప్రాణాలను కాపాడుకోవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Unique Temples : దేవుళ్లకు నైవేద్యంగా మందు, మటన్, చేపలు.. భక్తులకూ ఇవే ప్రసాదం.. ఎక్కడో తెలుసా?
Recommended image2
Telugu Saying: లోకువ మొగుడికి నూకల జావ! ఈ సామెత అసలు అర్థం ఏంటో తెలుసా?
Recommended image3
గాలి నుంచి కరెంట్ ఎలా తయారవుతుంది.? విండ్ టర్బైన్ వెనుక అసలు ప్రాసెస్ ఇదే
Related Stories
Recommended image1
Weather Update: బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలకు 6 రోజులు వర్ష గండం.. ఐఎండీ అలర్ట్
Recommended image2
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved