MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలకు 6 రోజులు వర్ష గండం.. ఐఎండీ అలర్ట్

Weather Update: బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలకు 6 రోజులు వర్ష గండం.. ఐఎండీ అలర్ట్

Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 6 రోజులు వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ సహా ఏపీ జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. ఏఏ ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 05 2026, 08:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
IMD Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఆ 6 రోజులు భారీ వర్షాలు
Image Credit : chatgpt

IMD Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఆ 6 రోజులు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. గడిచిన వారం రోజులుగా ప్రభావం చూపిన వాయుగుండం ముగిసిందనుకునే లోపే, బంగాళాఖాతం మరో తీవ్ర ప్రకంపనలకు సిద్ధమైంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో ఉపరితల ఆవర్తనం బలపడింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల వాయు చక్రవాతం ఏర్పడింది.

సముద్ర మట్టం నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి. ఐకాన్ శాటిలైట్ డేటా ప్రకారం.. దేశమంతటా ద్రోణి వాతావరణం తీవ్రంగా ఉంది. దీనికారణంగా ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ రాబోయే 6 రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ (IMD), ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) స్పష్టం చేశాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పసిఫిక్‌లో ప్రళయ తుపాన్లు: ప్రపంచ వాతావరణంలో అలజడి
Image Credit : Getty

పసిఫిక్‌లో ప్రళయ తుపాన్లు: ప్రపంచ వాతావరణంలో అలజడి

ఒకవైపు మన దగ్గర ఆవర్తన ప్రభావం ఉంటే, మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో గ్లోబల్ వెదర్ పూర్తిగా మారేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పసిఫిక్‌లో ఏర్పడిన ‘డాల్ఫిన్’ అతి తీవ్ర తుపాను గంటకు 195 కిలోమీటర్ల భయంకరమైన వేగంతో విరుచుకుపడుతోంది. ఇది తూర్పు చైనా వైపు దూసుకెళ్తూ జపాన్‌ను ముంచెత్తుతోంది.

ఇదే సమయంలో ఫిలిప్పీన్స్ దగ్గర 'కుజిరా' అనే మరో తుపాను గంటకు 65 కిలోమీటర్ల వేగంతో సృష్టిస్తున్న అలజడి వల్ల అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవే కాకుండా తూర్పు పసిఫిక్‌లో మరిన్ని అల్పపీడనాలు సిద్ధమవుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రం విపరీతంగా వేడెక్కడం వల్ల 'ఎల్ నినో' సమస్య ఇంకా కొనసాగుతోందని, అందుకే గ్లోబల్ లెవెల్‌లో తుపాన్లు వరుసకడుతున్నాయని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Related Articles

Related image1
Liquor Ban: ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్, బ్యాగ్‌పైపర్ మందు బ్రాండ్లపై బ్యాన్.. అసలు కారణం ఇదే
Related image2
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
35
తెలంగాణ వెదర్ అప్‌డేట్
Image Credit : Gemini

తెలంగాణ వెదర్ అప్‌డేట్

తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 10 వరకు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధ, గురువారాల్లో అనేక ప్రాంతాల్లో వాన జల్లులు పడతాయి. పగటిపూటంతా దట్టమైన మేఘాలు కమ్మేసి, మధ్యాహ్నం నుంచి వర్ష తీవ్రత పెరిగే ఛాన్స్ ఉంది. సాయంత్రం వేళల్లో ఆఫీసుల నుంచి ఇంటికి తిరిగి వెళ్లే సమయానికి వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీ ప్లాన్స్ ముందే వేసుకోవడం బెటర్.

రాత్రి 11 గంటల వరకు అక్కడక్కడా వర్షాలు పడొచ్చు. నిర్మల్, ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, గద్వాల, సిరిసిల్ల, సిద్ధిపేట, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కావచ్చు.

45
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో హెచ్చరికలు, ఎల్లో అలర్ట్
Image Credit : Getty

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో హెచ్చరికలు, ఎల్లో అలర్ట్

ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఆగస్టు 10 వరకు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉండొచ్చు. రాయలసీమలో చెదురుమదురుగా జల్లులు కురుస్తాయి.

ఇప్పటికే మంగళవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 9 సెం.మీ, జోగినాథునిపాలెంలో 7.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. అరేబియా, బంగాళాఖాతంలో ఏర్పడిన ఈదురుగాలుల వల్ల ఏపీ తీరంలో గంటకు 40 నుంచి 48 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీచ్‌లకు వెళ్లే పర్యాటకులు సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

55
పిడుగుల గండం.. రైతన్నలు, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
Image Credit : Asianet News

పిడుగుల గండం.. రైతన్నలు, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే

ఈ వర్షాలతో పాటు ఆందోళన కలిగించే ప్రధాన అంశం ఉరుములు, మెరుపులు, పిడుగులు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఉరుములు, పిడుగుల ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గజపతినగరం, ఎస్.కోట, భీమునిపట్నం ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

పిడుగులు పడే సమయంలో చెట్ల కింద గానీ, బహిరంగ ప్రదేశాల్లో గానీ నిలబడకూడదు. ఇక పసిఫిక్‌లో ఎల్ నినో తీవ్రత వల్ల మన దగ్గర వర్షాలు నిలకడగా పడినా.. మరీ ఆశాజనకమైన భారీ వర్షాలు కురవకపోవచ్చు. అందువల్ల పంటలు సాగు చేసే రైతన్నలు కేవలం వర్షపు నీటిపైనే ఆధారపడకుండా నీటి నిర్వహణకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
హైదరాబాద్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jogi Ramesh: రాజీవ్‌కు ఆ స‌మ‌స్య ఉంద‌ని తెలిసి మ‌రీ నా గొంతు కోశారు.. జోగి ర‌మేశ్ కోడ‌లు ఆవేద‌న
Recommended image2
Now Playing
AP Telangana Weather Alert: ఏపీ, తెలంగాణలో మరో 6 రోజులు దంచికొట్టనున్న వర్షాలు
Recommended image3
Now Playing
మావి కుటుంబాలు కాదా చంద్రబాబు రెచ్చిపోయిన జోగి | Jogi Ramesh Family Issue
Related Stories
Recommended image1
Liquor Ban: ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్, బ్యాగ్‌పైపర్ మందు బ్రాండ్లపై బ్యాన్.. అసలు కారణం ఇదే
Recommended image2
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved