MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Brushing: టూత్ బ్రష్ vs వేప పుల్ల, నోటి ఆరోగ్యానికి ఏది మంచిది? ఏది వాడకూడదు? నిపుణులు ఏమంటున్నారు?

Brushing: టూత్ బ్రష్ vs వేప పుల్ల, నోటి ఆరోగ్యానికి ఏది మంచిది? ఏది వాడకూడదు? నిపుణులు ఏమంటున్నారు?

Brushing: ప్రస్తుతం పళ్లు శుభ్రం చేసుకోడానికి రకరకాల టూత్ బ్రెష్ లు, పేస్ట్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ పూర్వం పల్లెటూర్లలో బ్రెష్ లకు బదులుగా వేప పుల్లలు వాడేవారు. ఇప్పటికీ పల్లెల్లో అవి వాడుతూనే ఉన్నారు. వేప పుల్లల వల్ల లాభం ఏంటి? నష్టం ఏంటి?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 30 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టూత్ బ్రష్ vs వేప పుల్ల నోటి ఆరోగ్యానికి ఏది మంచిది?
Image Credit : Gemini AI

టూత్ బ్రష్ vs వేప పుల్ల నోటి ఆరోగ్యానికి ఏది మంచిది?

ప్రస్తుతం పళ్లు శుభ్రం చేసుకోవడానికి రకరకాల టూత్ బ్రష్‌లూ, పేస్ట్‌లూ అందుబాటులో ఉన్నాయి. కానీ పూర్వం పల్లెటూర్లలో బ్రష్‌లకు బదులుగా వేప పుల్లలు వాడేవారు. ఇప్పటికీ పల్లెల్లో వాటిని వాడుతూనే ఉన్నారు. మన పూర్వీకుల కాలం నుండి పళ్లు శుభ్రం చేసుకోవడానికి వేప పుల్ల అత్యంత ప్రాచుర్యంలో ఉన్న సహజ సిద్ధమైన సాధనం.

అయితే నేటి ఆధునిక కాలంలో టూత్ బ్రష్‌లు, పేస్ట్‌లు నిత్య జీవితంలో భాగమయ్యాయి. ఇప్పటికీ చాలా మంది "మా తాతల కాలంలో వేప పుల్ల వాడి పళ్లను ఆరోగ్యంగా ఉంచుకున్నారు, ఇప్పుడు బ్రష్ ఎందుకు?" అని ప్రశ్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో వేప పుల్ల, టూత్ బ్రష్‌ల వాడకం మరియు వాటి లాభనష్టాల గురించి డెంటల్ స్పెషలిస్ట్‌లు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వేప పుల్లలోని ప్రయోజనాలు - నాచురల్ హెల్త్
Image Credit : Gemini AI

వేప పుల్లలోని ప్రయోజనాలు - నాచురల్ హెల్త్

వేప పుల్లలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వేప రసంలో ఉండే సహజ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని హానికర బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. అంతేకాకుండా చిగుళ్ల ఇన్ఫెక్షన్లు, నోటి దుర్వాసన మరియు పంటి నొప్పుల నుండి ఇది తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది. పళ్లపై చేరుకునే బ్యాక్టీరియల్ బయోఫిల్మ్‌ను తొలగించి పళ్లు పుచ్చకుండా రక్షిస్తుంది. కానీ చాలామందికి ఈ వేప పుల్లను వాడటం రాదు. సరైన పద్ధతిలో వాడితే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

35
వేప పుల్ల వాడకంలో సమస్యలు
Image Credit : Gemini AI

వేప పుల్ల వాడకంలో సమస్యలు

వేప పుల్ల ఎంతో మంచిదైనప్పటికీ, ప్రస్తుత కాలంలో దీని వాడకంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. పూర్వకాలంలో జొన్న రొట్టెలు, అంబలి, సద్దన్నం వంటి పీచు పదార్థాలు ఎక్కువగా తినేవారు. కానీ నేటి కాలంలో పిజ్జాలు, బర్గర్లు, స్వీట్లు, కేకులు, కూల్ డ్రింక్స్ వాడకం ఎక్కువైంది. ఈ ఆధునిక ఆహార వ్యర్థాలు పళ్ల సందుల్లో సులభంగా ఇరుక్కుపోతాయి. వేప పుల్ల డిజైన్ (ఎర్గోనామిక్స్) ముందు పళ్లకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. లోపలి, వెనక పళ్లు, పళ్ల సందులను శుభ్రం చేయడం దీనితో కుదరదు.

వేప పుల్ల పీచులు గట్టిగా ఉండి తోముతున్నప్పుడు చిగుళ్లలోకి గుచ్చుకుంటే గాయాలై ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. అంతేకాదు గట్టిగా రుద్దడం వల్ల పళ్లకు నష్టం కలుగుతుంది. టూత్ బ్రష్‌లను బ్రిజిల్స్ సైజ్, సాఫ్ట్‌నెస్, గ్రిప్ వంటి అనేక పరిశోధనల ఆధారంగా తయారు చేస్తారు. వేప పుల్లకు అలాంటి పరిమాణం లేదా ప్రామాణికత (స్టాండర్డైజేషన్) ఉండదు.

45
వేప పుల్ల ఎలా వాడాలి?
Image Credit : Gemini AI

వేప పుల్ల ఎలా వాడాలి?

వేప పుల్లను వాడాలనుకునేవారు మరీ పచ్చిగా ఉన్నది గానీ, బాగా ఎండిపోయిన బ్రౌన్ రంగుది గానీ కాకుండా దోరగా ఉన్న జానెడు పొడవు పుల్లను ఎంచుకోవాలి. ఒక చివరను 5 నిమిషాల పాటు నమిలి పెయింట్ బ్రష్‌లా మెత్తగా అయ్యాక, పళ్లపై నెమ్మదిగా రుద్దాలి. చివరగా దానిని చీల్చి నాలుక శుభ్రం చేసుకునేందుకు టంగ్ క్లీనర్‌గా కూడా వాడవచ్చు.

సరైన బ్రషింగ్ విధానం (Correct Brushing Technique)

డెంటిస్ట్‌లు సాఫ్ట్ టూత్ బ్రష్‌ను సిఫార్సు చేస్తారు. పళ్లను తోముకునేటప్పుడు గట్టిగా రుద్దకూడదు. మనం దువ్వెనను పాత బ్రష్‌తో ఎలా శుభ్రం చేస్తామో, అలాగే బ్రష్‌ను పంటికి-చిగురుకు మధ్య ఉంచి నెమ్మదిగా కిందకి ఒత్తిడి తెస్తూ శుభ్రం చేయాలి. చాలామంది ముందు పళ్లను మాత్రమే శుభ్రం చేసుకుని, లోపలి పళ్లను వదిలేస్తారు. ఉమ్మి గ్రంథులు ఉండే లోపలి భాగంలోనే కాల్సిఫైడ్ పాచి (క్యాలిక్యులస్) ఎక్కువగా చేరుతుంది కాబట్టి లోపలి వైపు తప్పనిసరిగా బ్రష్ చేయాలి.

ఉదయం ఒక నిమిషం, రాత్రి పడుకునే ముందు ఒక నిమిషం చొప్పున రోజుకు రెండు నిమిషాలు అద్దం ముందు చూసుకుంటూ బ్రష్ చేయాలి. పెన్నుతో కాగితంపై రాసేంత తేలికపాటి ఒత్తిడి మాత్రమే ఉపయోగించాలి. బ్రషింగ్ పూర్తికాగానే టంగ్ క్లీనర్ వాడటం వల్ల నోటి దుర్వాసన తగ్గి రుచి బాగా తెలుస్తుంది. పళ్ల సందుల్లో ఇరుక్కున్న ఆహారాన్ని తొలగించడానికి ఫ్లాసింగ్ (Flossing) ఉపయోగించాలి.

55
ఫైనల్‌గా ఏది వాడాలి?
Image Credit : Gemini AI

ఫైనల్‌గా ఏది వాడాలి?

వారానికి ఒకసారి వేప పుల్లను నమలడం వల్ల దాని రసంలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పళ్లకు మేలు చేస్తాయి. కానీ పూర్తిస్థాయి బ్రషింగ్‌కు ప్రత్యామ్నాయంగా కేవలం వేప పుల్లపైనే ఆధారపడటం సరికాదు. నేటి ఆహారపు అలవాట్లకు అనుగుణంగా సాఫ్ట్ టూత్ బ్రష్, ఫ్లాసింగ్, టంగ్ క్లీనింగ్ పాటించడమే పరిపూర్ణ నోటి ఆరోగ్యానికి శ్రేయస్కరం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Color Changing Lake: ఎడారిలో విచిత్రం.. ఏడాదంతా రంగులు మారే గులాబీ సరస్సు.. అసలు రహస్యం ఇదే
Recommended image2
Lemon Tree: బాల్కనీని కుండీల్లో నిమ్మ మొక్క పెంచండిలా.. గుత్తుగుత్తులుగా కాయలు కాస్తాయి
Recommended image3
Banana Business: వృథాగా పడేసే అరటి బోదెలతో వ్యాపారం.. ఏడాదికి రెండున్నర కోట్ల రూపాయల ఆదాయం
Related Stories
Recommended image1
Tooth Powder: 90s లో పళ్ళు తోమడానికి వాడే పళ్లపొడి గుర్తుందా? ఇప్పటికీ అవి వాడుతున్నారా?
Recommended image2
Reynolds Pen: 90s కిడ్స్‌కి ఫేవరేట్‌ రెనాల్డ్స్ పెన్ను గుర్తుందా? రేనాల్డ్స్ చరిత్ర ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved