MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Lemon Tree: బాల్కనీని కుండీల్లో నిమ్మ మొక్క పెంచండిలా.. గుత్తుగుత్తులుగా కాయలు కాస్తాయి

Lemon Tree: బాల్కనీని కుండీల్లో నిమ్మ మొక్క పెంచండిలా.. గుత్తుగుత్తులుగా కాయలు కాస్తాయి

lemon Tree: బాల్కనీలో కొద్దిగా స్థలం ఉన్నా సరే కుండీల్లో నిమ్మ చెట్టును సులువుగా పెంచుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు మీ ఇంట్లోనే నిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 29 2026, 05:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కుండీలో నిమ్మచెట్టును పెంచడం ఎలా?
Image Credit : ChatGPT

కుండీలో నిమ్మచెట్టును పెంచడం ఎలా?

బాల్కనీలోనే కుండీలో నిమ్మ చెట్టును చాలా సులువుగా పెంచవచ్చు. చిన్న ప్రదేశాల్లోనూ కుండీల్లో నిమ్మ చెట్లను పెంచొచ్చు. 'కంటైనర్ కల్చర్' పద్ధతికి సరిపోయే పొట్టి రకం నిమ్మ మొక్కలు ఇప్పుడు నర్సరీలో చాలానే ఉన్నాయి. చెట్టు సైజు, కాసే కాయల సంఖ్య కుండీల్లో పరిమితంగానే ఉంటాయి. కానీ సరైన వాతావరణం, సరైన జాగ్రత్తలు తీసుకుంటే కుండీల్లోనూ నిమ్మకాయలు గుత్తుగుత్తులుగా కాస్తాయి.

నిమ్మకాయ పెంపకంలో సరైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి. విత్తనాల ద్వారా పెంచే మొక్కలు కాయలు కాయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. పైగా అవి తల్లి చెట్టు లక్షణాలను లేదా పండ్ల నాణ్యతను పొందుతాయో లేదో కచ్చితంగా చెప్పలేం. నర్సరీల్లో దొరికే అంటుకట్టిన (grafted) లేదా పొట్టి రకం (dwarf) మొక్కలు కుండీల్లో పెంచడానికి బాగా సరిపోతాయి. ఇంటి కుండీకి సరిపోయే మంచి రకాన్ని ఎంచుకుంటే, చెట్టు బాగా పెరిగి మంచి దిగుబడి వస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నిమ్మ చెట్టుకు ఎంత పెద్ద కుండీ కావాలి?
Image Credit : stockPhoto

నిమ్మ చెట్టుకు ఎంత పెద్ద కుండీ కావాలి?

మొక్క ఎదుగుదలకు తగిన కుండీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మొదట్లో మొక్క సైజుకు తగ్గట్టుగా చిన్న కుండీలో పెంచొచ్చు. మొక్క పెరిగే కొద్దీ క్రమంగా పెద్ద కుండీలోకి మార్చుకోవాలి. చిన్న మొక్కను ఒకేసారి అతి పెద్ద కుండీలో నాటడం మంచిది కాదు. మట్టి ఎక్కువసేపు తడిగా ఉండటం వల్ల వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎదిగిన నిమ్మ చెట్టుకు దాని సైజుకు తగ్గట్టుగా, నీళ్లు బయటకు వెళ్లేందుకు తగినన్ని రంధ్రాలు ఉన్న పెద్ద కుండీ అవసరం.నిమ్మ చెట్టుకు సూర్యరశ్మి చాలా ముఖ్యం. ఇది బాగా కాయలు కాయాలంటే రోజుకు కనీసం ఆరు గంటల పాటు నేరుగా ఎండ తగలాలి. కేవలం వెలుతురు ఉంటే సరిపోదు; సూర్యుడి వేడి మొక్కకు అత్యవసరం. ఎప్పుడూ నీడలో ఉండే చోట పెడితే కాయలు కాయడం కష్టం. గాలి బాగా ఆడే బాల్కనీలో, ఎక్కువ ఎండ తగిలే చోట మొక్కను పెట్టడం మంచిది. అసలు ఎండ రాని బాల్కనీలో ఈ మొక్కను పెంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

33
కుండీలో నిమ్మకాయలు ఎప్పుడు కాస్తాయి?
Image Credit : pinterest

కుండీలో నిమ్మకాయలు ఎప్పుడు కాస్తాయి?

నిమ్మకాయలు ఎప్పుడు కాస్తాయి అనేది మొక్క వయసు, రకం, వెలుతురు, పోషకాలు, మనం తీసుకునే జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది. చిన్న పొట్టి రకం మొక్కలు కొన్ని ఏళ్లు పెరిగాకే కాయలు కాయడం మొదలుపెడతాయి. కొన్ని నిమ్మ రకాల్లో పూత వచ్చాక, కాయ పూర్తిగా పండటానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం కూడా పట్టొచ్చు. కుండీ సైజు చెట్టు ఎదుగుదలను, కాయల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. సరైన రకం, కనీసం 6 గంటల పాటు నేరుగా ఎండ, మంచి డ్రైనేజీ, సరైన నీరు, పోషకాలు ఉంటేనే ఇంట్లో నిమ్మకాయల దిగుబడిని ఆశించగలం.

నీళ్లు పోసే విషయంలో చాలామంది చేసే పెద్ద తప్పు.. "ఎక్కువ నీళ్లు పోస్తే ఎక్కువ పెరుగుతుంది" అని అనుకోవడం. ఇది పూర్తిగా తప్పు. నిమ్మ చెట్టుకు రోజూ నీళ్లు పోయాలనే రూల్ ఏమీ లేదు. ఎండ, గాలి, కుండీ సైజు, మట్టి మిశ్రమాన్ని బట్టి అవసరమైన నీటి పరిమాణం మారుతుంది. మట్టి ఎప్పుడూ బురదగా లేదా మరీ తడిగా ఉండకూడదు. నీళ్లు పోసినప్పుడు, అడుగున ఉన్న రంధ్రాల ద్వారా అదనపు నీరు బయటకు వెళ్లిపోవాలి. కుండీ కింద పెట్టే ప్లేట్‌లో నీళ్లు నిలిచిపోకుండా చూసుకోవడం చాలా అవసరం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
తోటపని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Color Changing Lake: ఎడారిలో విచిత్రం.. ఏడాదంతా రంగులు మారే గులాబీ సరస్సు.. అసలు రహస్యం ఇదే
Recommended image2
Banana Business: వృథాగా పడేసే అరటి బోదెలతో వ్యాపారం.. ఏడాదికి రెండున్నర కోట్ల రూపాయల ఆదాయం
Recommended image3
జీవితాంతం ఒక్కచుక్క కూడా నీరు తాగని ప్రాణి ఏదో తెలుసా? ఇది ఎలా బ్రతుకుతుంది?
Related Stories
Recommended image1
Poori oil: వేడి నూనెలో ఆ పదార్థాలు వేస్తే పూరీలు, పకోడీలు నూనె పీల్చవా?
Recommended image2
Banana Business: వృథాగా పడేసే అరటి బోదెలతో వ్యాపారం.. ఏడాదికి రెండున్నర కోట్ల రూపాయల ఆదాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved