MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Banana Business: వృథాగా పడేసే అరటి బోదెలతో వ్యాపారం.. ఏడాదికి రెండున్నర కోట్ల రూపాయల ఆదాయం

Banana Business: వృథాగా పడేసే అరటి బోదెలతో వ్యాపారం.. ఏడాదికి రెండున్నర కోట్ల రూపాయల ఆదాయం

Banana Business: అరటి గెలలు కోశాక అరటి బోదెలను పారేస్తారు. కానీ అలా పారేసిన అరటి బోదెలతోనే వ్యాపారం చేసి కోట్లు గడిస్తున్నారు బీహార్‌కు చెందిన ముగ్గురు స్నేహితులు. ఆ అరటి బోదెలతో రకరకాల వస్తువులు తయారు చేసి అమ్ముతున్నారు.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 29 2026, 05:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అరటి బోదెలతో సూపర్ బిజినెస్!
Image Credit : ChatGPT

అరటి బోదెలతో సూపర్ బిజినెస్!

అరటితోటలు ఉన్న వారు చూసే ఉంటారు.. గెలలు కోశాక పొలాల్లోనే అరటి బోదెలను పడేస్తారు. వాటిని వ్యర్థ పదార్థాలుగా చూస్తారు. కానీ బీహార్‌కు చెందిన జగత్ కల్యాణ్, సత్యం కుమార్, నితీష్ కుమార్ వర్మ అనే ముగ్గురు స్నేహితులు మాత్రం వాటితో బిజినెస్ చేస్తూ కోట్లు గడిస్తున్నారు. వీరు 2021లో 'తరువర్ ఆగ్రో' (Taruwar Agro) అనే కంపెనీని స్టార్ట్ చేశారు. వ్యవసాయ వ్యర్థాలతో కూడా లాభదాయకమైన వ్యాపారం చేయొచ్చని వీరు నిరూపించారు.

ఈ ముగ్గురు స్నేహితులు బిజినెస్ మేనేజ్‌మెంట్ చదువుతున్నప్పుడు కలిశారు. రకరకాల వ్యాపారాలు చేసేందుకు అవకాశాలను పరిశీలించారు. ముఖ్యంగా బీహార్‌లో అరటి సాగు తర్వాత మిగిలిపోయే బోదెల సమస్య వీరికి కనిపించింది. దాన్నే బిజినెస్ ఛాన్స్‌గా చూశారు. 2021లో తరువర్ ఆగ్రోను స్థాపించి, అరటి నార తీసే టెక్నాలజీ కోసం ఇతరుల మద్దతు తీసుకున్నారు. రైతులకు భారంగా మారిన వ్యర్థాలను తమ ముడి సరుకుగా మార్చి వ్యాపారం మొదలుపెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అరటి బోదెల నుంచి నార తీసి..
Image Credit : Getty

అరటి బోదెల నుంచి నార తీసి..

వీరు రైతులతో ఒప్పందం చేసుకున్నారు. అరటి గెలలు కోశాక, తోటల నుంచి బోదెలను రైతులు వీరికి అందిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక యంత్రాలు లేదా పద్ధతులను ఉపయోగించి ఈ బోదెల పైపొరల నుంచి సహజమైన నారను తీస్తారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ప్రకారం, ఈ అరటి నార ఎన్నో విలువైన వస్తువుల తయారీకి బెస్ట్ ముడిసరుకుగా పనిచేస్తుంది. ఎలాంటి రసాయనాలు వాడకుండా నార తీసే ఈ పద్ధతి పర్యావరణానికి కూడా చాలా మంచిది.

అలా తీసిన అరటి నారతో ఎన్నో రకాల వస్తువులను తయారు చేస్తున్నారు. యోగా మ్యాట్లు, ఫైల్ కవర్లు, బుట్టలు, పూజ మ్యాట్లు, రకరకాల టెక్స్‌టైల్ వస్తువులు ఇందులో ఉన్నాయి. అంతేకాదు, అరటి బోదెల నుంచి వర్మీకంపోస్ట్ (వానపాముల ఎరువు), అరటి బోదె రసం లాంటివి కూడా తయారు చేస్తున్నారు. వాటిని మార్కెట్లో అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారు.

33
రూ.15 లక్షలతో మొదలై..
Image Credit : Gemini AI

రూ.15 లక్షలతో మొదలై..

జగత్ కల్యాణ్, సత్యం కుమార్, నితీష్ కుమార్ వర్మ కలిసి ఈ వ్యాపారానికి సుమారు రూ.15 లక్షల పెట్టుబడి, రూ.5 లక్షల వర్కింగ్ క్యాపిటల్‌తో వ్యాపారాన్ని ప్రారంభించారు. సొంత పొదుపు, కుటుంబ సభ్యుల సాయంతో ఈ డబ్బు సమకూర్చారు. సెప్టెంబర్ 2026 యువర్ స్టోరీ (YourStory) రిపోర్ట్ ప్రకారం, FY26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం సుమారు రూ.2.5 కోట్లకు చేరుకుంది. రైతుల నుంచి అరటి బోదెలు కొనడం వల్ల వారికి అదనపు ఆదాయం దొరుకుతోంది. వ్యవసాయ వ్యర్థాలకు కొత్త బిజినెస్ వాల్యూ తీసుకొచ్చిన ఈ ప్రయత్నం.. స్థానికులకు, ముఖ్యంగా మహిళలకు (60% వరకు) ఉపాధి కల్పిస్తోంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
జీవితాంతం ఒక్కచుక్క కూడా నీరు తాగని ప్రాణి ఏదో తెలుసా? ఇది ఎలా బ్రతుకుతుంది?
Recommended image2
Top 10 Fastest Trains: రాకెట్ కంటే స్పీడ్.. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన టాప్ 10 రైళ్లు ఇవే
Recommended image3
Coconut : కొబ్బరికాయను ఎలా కొట్టాలి..? ఈజీగా పగలాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
Related Stories
Recommended image1
Poori oil: వేడి నూనెలో ఆ పదార్థాలు వేస్తే పూరీలు, పకోడీలు నూనె పీల్చవా?
Recommended image2
Toothpaste: మీ టూత్‌పేస్టు వెజ్ లేదా నాన్-వెజ్? ఇలా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved