MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Train: ఈ రైలు 70 స్టేషన్లు మీదుగా ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటుంది.. ఎందుకో తెలుసా?

Train: ఈ రైలు 70 స్టేషన్లు మీదుగా ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటుంది.. ఎందుకో తెలుసా?

Train: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా నెట్ వర్క్. దీనిలో రోజూ లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. అయితే ఒక రైలు మాత్రం  70కి పైగా స్టేషన్లను దాటి వెళుతుంది. కానీ ఒక్కచోట కూడా ఆగదు. ఎందుకు ఆగదో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 03 2026, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ప్రత్యేకమైన రైలు
Image Credit : Gemini AI

ప్రత్యేకమైన రైలు

ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వే పేరు సంపాదించింది. ప్రతిరోజూ కోట్లాది మంది దీనిలో ప్రయాణిస్తూనే ఉంటారు. వందల రైళ్లలో ఒక ప్రత్యేకమైన రైలు ఉంది. అది ఒడిశా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్. ఈ రైలు బీహార్ రాష్ట్రం నుంచి చాలా దూరం ప్రయాణిస్తుంది. 70 స్టేషన్లు దాటి వెళుతున్నా ఒక్క స్టేషన్లో కూడా ఆగదు.  అక్కడ ప్రయాణికుల కోసం ఒక్క స్టేషన్‌లో కూడా ఆగకపోవడం దీనిలోని అసలు విశేషం. ఒడిశా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు  నెంబర్ 12820). ఇది ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి భువనేశ్వర్ వరకు ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణంలో 12819 నంబర్‌తో భువనేశ్వర్ నుంచి ఆనంద్ విహార్‌కు వెళ్తుంది. ఈ రైలు సుమారు 1,782 కిలోమీటర్ల దూరాన్ని 28 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల గుండా ఈ రైలు ప్రయాణిస్తుంది. అయితే కేవలం 13 ప్రధాన స్టేషన్లలో మాత్రమే ఇది ఆగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ రాష్ట్రంలో ఒక్కచోటా ఆగదు
Image Credit : social media

ఈ రాష్ట్రంలో ఒక్కచోటా ఆగదు

ఈ రైలుకు బీహార్ రాష్ట్రంలోని 70కి పైగా రైల్వే స్టేషన్లను దాటి వెళుతుంది.  పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌ దాటిన తర్వాత బీహార్‌లోకి ప్రవేశించే ఈ రైలు.. ససారం, గయా, మన్‌పూర్ సహా ఎన్నో ముఖ్యమైన స్టేషన్లను దాటుకుంటూ వెళ్తుంది. అయినా ఎక్కడా ఆగదు. ఇలా ఎందుకు ఈ రైలు ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తుందో తెలుసా?  ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి. ప్రతిచోటా ఆగితే ప్రయాణ సమయం పెరిగిపోతుంది.

Related Articles

Related image1
Homemade Ghee: మీగడ, వెన్న లేకపోయినా పెరుగుతోనే కమ్మటి నెయ్యి ఇలా చేసేయండి
Related image2
Castor Oil: ఆముదాన్ని ఇలా వాడారంటే జుట్టు పట్టు కుచ్చులా మారిపోతుంది
33
కేవలం 13 స్టేషన్లలోనే...
Image Credit : South Western Railways - SWR

కేవలం 13 స్టేషన్లలోనే...

దేశంలోని వివిధ రాష్ట్ర రాజధానులను ఢిల్లీతో వేగంగా అనుసంధానించేందుకు భారతీయ రైల్వే సంపర్క్ క్రాంతి అనే సిరీస్‌ను ప్రారంభించింది. అందుకే కేవలం ప్రధాన జంక్షన్లు, సాంకేతికంగా అవసరమైన చోట్ల మాత్రమే రైలు ఆగేలా టైమ్‌టేబుల్ రూపొందించారు. దీనివల్ల చాలా దూర ప్రయాణాలు కూడా తక్కువ సమయంలో చేరుకోవచ్చు.

ఒక రైలు తక్కువ స్టాపులతో నడిస్తే అది గమ్య స్థానాన్ని త్వరగా చేరుకుంటుంది. తరచుగా ఆగకపోవడం వల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాదు.. ఆలస్యం కూడా జరగదు. ఒడిశా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలోని ప్రత్యేకమైన సూపర్‌ఫాస్ట్ రైళ్లలో ఒకటి. ఈ రైలు చాలా మంది ప్రయాణికులకు ఇష్టమైన సర్వీస్‌గా కొనసాగుతోంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Shiva Purana Rules: మహిళలు రుద్రాక్ష ధరించవచ్చా? శివాభిషేకం చేసేటప్పుడు ఏ వైపు నిలబడాలి? శివపురాణం ఏం చెప్తోంది?
Recommended image2
అన్నీ ఉన్నాయన్న పొగరు పనికి రాదు.. జీవితం ఎప్పుడెలా పరీక్ష పెడుతుందో తెలియ‌దు
Recommended image3
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Related Stories
Recommended image1
Homemade Ghee: మీగడ, వెన్న లేకపోయినా పెరుగుతోనే కమ్మటి నెయ్యి ఇలా చేసేయండి
Recommended image2
Castor Oil: ఆముదాన్ని ఇలా వాడారంటే జుట్టు పట్టు కుచ్చులా మారిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved