MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Motivational story: మీరు కూడా కోపంతో ఊగిపోతారా? ఈ మేకుల క‌థ చ‌దివితే మారాల్సిందే

Motivational story: మీరు కూడా కోపంతో ఊగిపోతారా? ఈ మేకుల క‌థ చ‌దివితే మారాల్సిందే

కోపం స‌ర్వ‌సాధార‌ణ‌మైన ఎమోష‌న్‌. అయితే కోపం ఎక్కువైతే మ‌న‌ల్నే ద‌హిస్తుంద‌ని చెబుతుంటారు. అలాంటి కోపాన్ని ఎలా త‌గ్గించుకోవాలి.? ఒక నీతి క‌థ‌తో ఇప్పుడు తెలుసుకుందాం.. 

2 Min read
Author : Narender Vaitla
| Updated : May 22 2025, 08:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కోపిష్టి పిల్లాడు:
Image Credit : Asianet News

కోపిష్టి పిల్లాడు:

అన‌గ‌న‌గా ఒక ఊరిలో రామ‌య్య అనే రైతుకు రమేశ్ అనే కొడుకు ఉండేవాడు. రమేశ్ మంచివాడు, కానీ అతడికి ఓ చిన్న లోపం ఉంది. అతడు చాలా కోపిష్టి. చిన్నచిన్న విషయాలకు కూడా చిర్రెత్తిపోయేవాడు. కానీ కోపం చల్లారిన తర్వాత వెంటనే క్షమాపణ అడిగే మంచి మనసున్న వాడు.

రోజూ స్కూల్లో, ఇంట్లో ఎవరో ఒకరితో గొడవ పడుతూ ఉండడంతో, అతని తండ్రి రంగయ్య ఒకరోజు గట్టిగా మందలించాడు. త‌న కొడుకు కోపాన్ని త‌గ్గించ‌డానికి అత‌ను ఒక ప్లాన్ మంచి ప్లాన్ వేశాడు.

24
కోపాన్ని త‌గ్గించే చిట్కా.
Image Credit : Freepik

కోపాన్ని త‌గ్గించే చిట్కా.

కోపంతో ఊగిపోయే కొడుకు కోపాన్ని త‌గ్గించేందుకు తండ్రి ఒక ఉపాయం చేశాడు. "రమేశ్! నీవు కోపపడిన ప్రతిసారీ, పెరటి తలుపుకి ఓ మేకు కొట్టు," అని సూచించాడు. రమేశ్ తన నాన్న మాట విని, ఆ మరుసటి రోజు నుంచే అలా చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లో తలుపంతా మేకులతో నిండిపోయింది. అవి చూసి తలుపు చూడటానికి అసహ్యంగా మారిపోయింది.

Related Articles

Related image1
Emirates draw: ల‌క్కీ డ్రాలో రూ. 231 కోట్లు.. ఒక్క రోజులో జీవితాన్ని మార్చేసిన ఎమిరేట్స్ డ్రా
Related image2
RRR: హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డులో మార్పులు.. కేంద్రం ఏం చెప్పిందంటే?
34
మారిన ర‌మేశ్ ఆలోచ‌న‌:
Image Credit : Freepik

మారిన ర‌మేశ్ ఆలోచ‌న‌:

ఒక రోజు రామ‌య్య‌ రమేశ్‌ను పిలిచి తలుపు చూపించాడు. "ఇవి చూడూ! మేకులతో తలుపు ఎంత అంద విహీనంగా మారిందో. నువ్వు కోప్పడినప్పుడు, ఎదుటివాళ్ల మనసులో కూడా ఇలాగే ఓ మచ్చ పడుతుంది," అని అన్నాడు. అప్పుడు రమేశ్ సిగ్గుపడి, "నాన్నా, ఇక నేను మారిపోతాను. ఎవ‌రితో కోప్ప‌డ‌ను అని చెప్తాడు.

రామ‌య్య‌ చిరునవ్వుతో, "ఇది చాలా మంచిది! నువ్వు కోపాన్ని అదుపులో పెట్టుకున్న ప్రతిసారీ ఒక మేకును తీసేస్తూ ఉండు," అని చెప్పాడు. రోజులు గడిచాయి… రమేశ్ ఓర్పుగా ఉండటం ప్రారంభించాడు. ఒక్కో మేకును తీయడం ప్రారంభించాడు. కానీ, ప్రతి మేకు తీసిన చోటా ఓ చిన్నచిన్న చిల్లు మిగిలిపోయింది.

44
గొప్ప నీతి:
Image Credit : Freepik

గొప్ప నీతి:

ఇలా ప్ర‌తీ రోజూ మేకును తొల‌గించిన త‌ర్వాత త‌లుపుపై మ‌చ్చ మాత్రం అలాగే ఉండి పోతుంది. దీనిని చూపిస్తూ "నీవు కోపంగా మాట్లాడినప్పుడు, ఎదుటివాళ్ల మనసులో మేకు కొట్టినట్టే. ఆ తర్వాత క్షమాపణ చెప్పినా, మేకు తీసినట్టు అవుతుంది. కానీ ఆ మచ్చ మాత్రం మిగిలిపోతుంది. అందుకే ఎప్పుడూ మాట్లాడే ముందు ఆలోచించు. ఎవరినీ అనవసరంగా బాధపెట్టకూడదు. అని చెప్తాడు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Train: ప్రపంచంలోనే అతి చిన్న రైల్వే లైన్.. ప్ర‌యాణం కేవ‌లం ఒక్క నిమిషం మాత్ర‌మే
Recommended image2
Cigarette: ప్రపంచంలో మొదట సిగరెట్ ఎక్కడ తయారైంది.? చ‌రిత్ర ఏం చెబుతోంది
Recommended image3
Kids Before marriage: పెళ్లికి ముందే పిల్లల్ని కనాల్సిందే, ఆ తర్వాతే పెళ్లి.. ఎక్కడో కాదు మనదేశంలోనే
Related Stories
Recommended image1
Emirates draw: ల‌క్కీ డ్రాలో రూ. 231 కోట్లు.. ఒక్క రోజులో జీవితాన్ని మార్చేసిన ఎమిరేట్స్ డ్రా
Recommended image2
RRR: హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డులో మార్పులు.. కేంద్రం ఏం చెప్పిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved