MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • USA Coconut Price: అమెరికాలో కొబ్బరి బొండం కొనాలంటే జేబుకు చెల్లే...రేటు తెలిస్తే షాక్ అవుతారు

USA Coconut Price: అమెరికాలో కొబ్బరి బొండం కొనాలంటే జేబుకు చెల్లే...రేటు తెలిస్తే షాక్ అవుతారు

USA Coconut Price: మన దగ్గర కొబ్బరి బొండం రేటు ఎంతుంటుంది? ఏ రూ.40, రూ.50 ఉంటుంది. దానికే బేరమాడి మరీ కొంటాం. కానీ అమెరికాలో ఒక కొబ్బరి బొండం ధర ఎంతుంటుందో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు. అందుకే అంటారు ఎంత చెట్టుకు అంతే గాలి అని.

2 Min read
Author : Nandini Arava
Published : Aug 12 2026, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అమ్మో ఇంత రేటా?
Image Credit : chatgpt

అమ్మో ఇంత రేటా?

ఇండియాలో రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు అమ్ముతుంటారు. రూ.40, రూ.50, రూ.60 కి సేల్ చేస్తుంటారు. అదే కేరళ కొబ్బరి అయింతే ఇంకొంచెం ధర ఉంటుంది. అయినా రూ.100 దాటదు. కానీ అమెరికాలో మాత్రం కొబ్బరి బొండం ఒక లగ్జరీ డ్రింక్ అంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే అక్కడ ఒక బొండం ధర 10 డాలర్లు. అంటే మన కరెన్సీలో చూసుకుంటే సుమారు రూ.950 నుంచి రూ.960.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అమెరికాలో కొబ్బరి సాగు ఎందుకు తక్కువ?
Image Credit : Getty

అమెరికాలో కొబ్బరి సాగు ఎందుకు తక్కువ?

కొబ్బరి చెట్లు పెరగాలంటే వేడి, తేమతో కూడిన వాతావరణం కావాలి. కానీ అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఎప్పుడూ చలిగానే ఉంటుంది. ఫ్లోరిడా, హవాయి వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొబ్బరి చెట్లు పెరుగుతాయి. ఇది దేశీయ అవసరాలకు సరిపోదు. అందుకే అమెరికా 90% కొబ్బరికాయలను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది.

36
ఇంపోర్ట్ ఖర్చులు
Image Credit : Gemini AI

ఇంపోర్ట్ ఖర్చులు

అమెరికాకు అవసరమైన కొబ్బరి బొండాలను ఎక్కువగా థాయ్‌లాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్, భారత్ నుంచి ఎగుమతి చేస్తారు. ఇవి వేల కిలోమీటర్లు సముద్ర మార్గంలో ప్రయాణిస్తాయి. షిప్పింగ్ ఛార్జీలు, కంటైనర్ ఖర్చులు, ప్యాకింగ్, ముఖ్యంగా బొండాలు పాడవకుండా ఉండేందుకు అవసరమైన 'కోల్డ్ స్టోరేజ్' ఖర్చులు. దీనివల్ల అమెరికాలో కొబ్బరి బొండాల ధర ఎక్కువ.

46
కూలీ, ట్యాక్స్ ఎక్కువ
Image Credit : Getty

కూలీ, ట్యాక్స్ ఎక్కువ

భారత్‌తో పోలిస్తే అమెరికాలో కార్మికుల కూలీ (లేబర్ కాస్ట్) చాలా ఎక్కువ. ఓడల నుంచి బొండాలను దించడం, ట్రక్కుల్లో ఎక్కించడం, సూపర్ మార్కెట్లలో సర్దడం వరకు ప్రతి దశలోనూ ఎక్కువ జీతాలు చెల్లించాలి. వీటికి ఇంపోర్ట్ డ్యూటీ, షాపుల అద్దె, కరెంట్ బిల్లులు కూడా తోడవడంతో రూ.1000 దాటిపోతుంది.

56
మన దగ్గర ఎందుకు ధర తక్కువ?
Image Credit : Getty

మన దగ్గర ఎందుకు ధర తక్కువ?

ప్రపంచంలోనే కొబ్బరికాయలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ఒకటి. మన దేశంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కొబ్బరి పంట విరివిగా పండుతుంది. దేశీయంగానే ఉత్పత్తి అవుతుండటంతో రవాణా ఖర్చు చాలా తక్కువ. ఎలాంటి ఇంపోర్ట్ ట్యాక్స్ ఉండవు. అందుకే మనకు తాజాగా ఉండే కొబ్బరి బొండాలు చౌకగా దొరుకుతాయి.

66
నెటిజన్ల కామెంట్లు
Image Credit : Getty

నెటిజన్ల కామెంట్లు

అమెరికాలో 10 డాలర్లకు కొబ్బరి బొండం అమ్ముతున్న వీడియో వైరల్ అయ్యాక, సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "ఆ డబ్బుతో ఇండియాలో ఓ కుటుంబం మొత్తం చాలాసార్లు బొండాలు తాగొచ్చు" అని ఒకరు కామెంట్ చేశారు. విదేశాలకు వెళ్తేనే మన దగ్గర దొరికే వస్తువుల విలువ తెలుస్తుంది" అని మరొకరు కామెంట్ చేశారు.

భారత్‌లో కొబ్బరి సాగు సులభం కాబట్టి ధర తక్కువ. కానీ అమెరికాలో సాగు చాలా తక్కువ కాబట్టి, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. దిగుమతి ఖర్చులు, పన్నులు, ఇతర ఖర్చుల వల్ల అక్కడ ఒక్కో బొండం ధర 10 డాలర్లకు (సుమారు రూ.950) చేరుకుంది. అందుకే అంటారు ఎంత చెట్టుకు అంతే గాలి, పిండి కొద్దీ రొట్టె అని. అమెరికాలో లక్షల్లో ఆదాయం వచ్చినా ఆచితూచి ఖర్చులు పెట్టాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ప్రపంచం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : బాత్రూమ్, టాయిలెట్లలోకి పాములు ఎందుకు వస్తాయి? రాకుండా ఎలా ఆపాలి?
Recommended image2
Birds Facts : పక్షులు చెట్టు చిటారుకొమ్మలపై నిద్రించినా ఎందుకు కిందపడిపోవు? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!
Recommended image3
River : నదులే ఈ రాష్ట్రానికి పేరు పెట్టాయా..! ఇంతకీ ఈ రాష్ట్రమేది, ఆ నదులేవి?
Related Stories
Recommended image1
Now Playing
Gold Price Today : వరుసగా రెండో రోజు బంగారం బాదుడు.. సామాన్యులకు షాక్!
Recommended image2
Amazon Freedom Sale: ఆగస్ట్ 15 సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్...స్మార్ట్ ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved