Frogs: ఈ దేశంలో పాలల్లో బతికి ఉన్న కప్పలు వేస్తారు.. ఎందుకో తెలుసా?
Frogs: ఒక దేశంలో ప్రజలు.. పాలల్లో కప్పల వేస్తారని మీకు తెలుసా? వాళ్లకు అవసరం అయినప్పుడు.. ఆ కప్పలను తీసేసి.. ఆ పాలను వాడుకుంటారు. ఇలాంటి వింత ఆచారాన్ని ఏ దేశం పాటిస్తుందో తెలుసా?

వింత ఆచారం..
మనం తినే ఆహారంలో ఏదైనా చిన్న పురుగు పడినా కూడా ఆ ఫుడ్ తినకుండా పడేసేవాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటిది.. మనం తాగే పాలల్లో కప్ప పడితే ఆ పాలను మనమైతే పారబోస్తాం. కానీ, ఓ దేశంలోని ప్రజలు మాత్రం.. స్వయంగా వారే కప్పలను పట్టుకొని.. తాము తాగే పాలల్లో వేసుకుంటారు. ఆ తర్వాత.. ఆ పాలను తిరిగి వాడుకుంటారు. ఆ దేశం మరేదో కాదు ఫిన్లాండ్. అయితే.. ఇప్పటికీ... ఇదే నియమాన్ని వీరు ఫాలో అవ్వడం లేదు. కానీ, ఒకప్పుడు మాత్రం ఇదే రూల్ ఫాలో అయ్యేవారు. దీని వెనక కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం...
పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరూ పాలను తమ ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటారు. అయితే, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఇప్పుడంటే.. అందరి ఇళ్ల ల్లో ఫ్రిజ్ లు ఉన్నాయి కాబట్టి.. ఫ్రిజ్ లో నిల్వ చేసుకుంటున్నాం. కానీ, ఫ్రిజ్ లు లేకముందు పాలు పాడవ్వకుండా నిల్వ చేయడానికి ఫిన్లాండ్ ప్రజలు కప్పలను వాడేవారట. బతికి ఉన్న కప్పలను పట్టుకొని వచ్చి మరీ.. పాలల్లో వేసేవారట. వినడానికి వింతగా, అసహ్యంగా అనిపించినా ఇదే రూల్ ఫాలో అయ్యేవారట.
కప్పలను పాలల్లో వేస్తే ఏం జరుగుతుంది?
కప్పల చర్మం నుంచి కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు, పెప్టైడ్స్ విడుదలౌతాయి. కప్పలు తమను శత్రువుల నుంచి , బ్యాక్టీరియా నుంచి రక్షించుకోవడానికి ఈ సహజమైన రక్షణ కవచాన్ని ఉపయోగిస్తాయి.
యాంటీ బ్యాక్టీరియా గుణాలు: కప్పల చర్మంపై ఉండే ఈ స్రావాలు (Secretions) పాలలో బ్యాక్టీరియా , హానికరమైన సూక్ష్మజీవుల అభివృద్ధిని అడ్డుకుంటాయి. దీనివల్ల పాలు త్వరగా పులవకుండా (Sour కాకుండా), ఎక్కువ సేపు తాజాగా ఉండేలా చూసుకుంటాయి.
ఆమ్ల గుణం: కప్పల చర్మం నుంచి విడుదలయ్యే కొన్ని రకాల ఆమ్లాలు పాలు గడ్డకట్టకుండా లేదా పాడవకుండా సహజమైన ప్రిజర్వేటివ్లా పనిచేసేవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
అయితే, సైంటిఫిక్ పరంగా ఇది కొంతవరకు నిజమే అయినప్పటికీ... పాలలో జీవ ఉన్న కప్పలను వేయడం వల్ల ఆరోగ్యపరంగా ఇతర ఇబ్బందులు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. ఏదేమైనా, ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రాకముందు పూర్వీకులు తమ ఆహారాన్ని నిల్వ చేయడానికి ప్రకృతిలోని జీవులను కూడా తమదైన శైలిలో ఉపయోగించుకున్నారు అనడానికి ఇదొక నిదర్శనం.

