Demon Pavan: రీతూని నేను వాడుకోలేదు... బ్రేకప్ చెప్పి షాకిచ్చిన డెమాన్ పవన్..!
Demon Pavan: బిగ్ బాస్ సీజన్ 9 తో ఫేమస్ అయిన డీమాన్, పవన్ రీతూ చౌదరి... సడెన్ గా షాకిచ్చారు. నేనెప్పుడూ రీతూని వాడుకోలేదని.. తమ మధ్య ఏమీ లేదు అని చెబుతూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.

Demon Pavan- Rithu Chowdary
బుల్లితెర నటి రీతూ చౌదరికి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. టీవీ సీరియల్స్, కామెడీ షోల ద్వారా క్రేజ్ తెచ్చుకున్న రీతూ.. గతేడాది బిగ్ బాస్ సీజన్ 9 లో పార్టిసిపేట్ చేసింది. ఈ సీజన్ లో మొదట రీతూ ఆటపై నెగిటివిటీ వచ్చినా.. తర్వాతర్వాత మంచి పాజిటివిటీ పెంచుకుంది. అయితే.. ఈ సీజన్ లో రీతూకి... అగ్నిపరీక్ష ద్వారా కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన డెమాన్ పవన్ తో మంచి స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు కూడా వచ్చాయి.
బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, స్నేహం క్రమంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హౌస్ బయటకు వచ్చాక కూడా ఈ జోడీ తమ క్రేజ్‌ను కొనసాగించింది. అభిమానులు వీరిద్దరి పేర్లను కలిపి 'రివాన్' (Rivan) అనే హ్యాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. బిగ్ బాస్ తర్వాత ప్రముఖ డ్యాన్స్ షో అయిన 'బీబీ జోడి'లో కూడా పాల్గొని అదరగొట్టారు. అంతేకాకుండా, ప్రత్యేకంగా 'బంగారం' అనే పేరుతో ఓ అద్భుతమైన డ్యాన్స్ వీడియోను చేసి యూట్యూబ్‌లో తమ అభిమానులను అలరించారు.
సోషల్ మీడియాలో నెగెటివిటీపై పవన్ ఆవేదన
అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఏమైందో ఏమో కానీ సడన్‌గా దూరంగా ఉంటున్నారనే ప్రచారం జోరుగా సాగింది. దీనిపై వస్తున్న తప్పుడు వార్తలు, వదంతులు, నిరాధారమైన నెగెటివిటీతో తీవ్రంగా విసిగిపోయిన డీమాన్ పవన్ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
రీతూ తో బ్రేకప్..
"ఎవరూ ఎవరినీ వాడుకోలేదు, ఇది పూర్తిగా పరస్పర అంగీకారంతో ఏర్పడిన స్నేహం మాత్రమే. మా ఇద్దరికీ వ్యక్తిగతంగా కొన్ని బలాలు, బలహీనతలు ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ లోపల ప్రజలు చూసేది వేరు, నిజ జీవితంలో జరిగే పరిస్థితులు పూర్తిగా వేరుగా ఉంటాయి. మేము గతంలో కలిసి పనిచేశాము నిజమే, కానీ ఇకపై 'రివాన్' అనే జోడీ ఉండదు. మా స్నేహం పూర్తిగా ముగిసింది.ఏ స్నేహంలోనైనా ఉన్నట్లుగానే మాకు కూడా గత కొన్ని నెలలుగా వ్యక్తిగత సమస్యలు, వాదనలు తలెత్తాయి. వాటిని సర్దుబాటు చేయడానికి నేను ఎంతో ప్రయత్నించాను, కానీ పరిస్థితి చేజారిపోయింది. గొడవలు పెద్దవి కావడంతో ప్రశాంతత కోసం విడివిడిగా ప్రాజెక్ట్‌లు చేయాలని అనుకున్నాము. ఆమె నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసి, స్నాప్‌చాట్‌లో తొలగించింది. అది నాకు నచ్చక నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను తొలగించాను. దాంతో ఆమె నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బ్లాక్ చేసింది. అయితే నేను ఎలాంటి పాత పోస్టులను డిలీట్ చేయలేదు" అని పవన్ వివరించారు.
రీతూతో విడిపోయానంటూ డీమాన్ పవన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అసలు, వీరిద్దరి మధ్య ఏం జరిగిందంటూ.. ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

