MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Blind Village: ఈ గ్రామంలో చెట్టును చూస్తే చూపు పోతుందా? ఈ గ్రామం వెనక ఉన్న కథేంటి?

Blind Village: ఈ గ్రామంలో చెట్టును చూస్తే చూపు పోతుందా? ఈ గ్రామం వెనక ఉన్న కథేంటి?

Blind Village: చెట్టును చూస్తే కంటి చూపు పోతుందా? నిజంగా, ఓ గ్రామంలో ఇలాంటి సంఘటన జరిగిందా? కంటి చూపు పోవడానికి, చెట్టుకు సంబంధం ఏంటి? ఈ వింత సంఘటన ఎక్కడ జరిగింది?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 29 2026, 06:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
ఈ గ్రామంలో అందరికీ చూపు ఎందుకు పోయింది?
Image Credit : gemini ai

ఈ గ్రామంలో అందరికీ చూపు ఎందుకు పోయింది?

ప్రపంచంలో కొన్ని వింతలు మన ఊహకు కూడా అందవు. కంటికి కనిపించని శక్తులు, దెయ్యాల శాపాలు అని మనం నమ్మే చాలా విషయాల వెనుక ఒక వైజ్ఞానిక సత్యం దాగుంటుంది. అలాంటి ఒక విస్మయకరమైన నిజం దాగున్న గ్రామమే.. దక్షిణ మెక్సికోలోని ఓక్సాకా (Oaxaca) రాష్ట్రంలో ఉన్న 'టిల్టెపెర్క్' (Tiltepec).

తరతరాలుగా ఇక్కడ నివసించే ప్రజలు ఒక భయంకరమైన నమ్మకంతో వణికిపోయారు. అదేంటంటే.. ఆ గ్రామంలో ఉన్న ఒక చెట్టు వైపు కన్నెత్తి చూస్తే చాలు, మనుషులు క్షణాల్లో అంధులైపోతారు అని. ఈ వింత భయం చుట్టూ అల్లిన కథే ఈ 'కురుడు గ్రామం' రహస్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
అసలు ఆ చెట్టు కథేంటి?
Image Credit : gemini ai

అసలు ఆ చెట్టు కథేంటి?

టిల్టెపెర్క్ గ్రామస్థులు జోపోటెక్ (Zapotec) తెగకు చెందినవారు. వీరి నమ్మకం ప్రకారం అక్కడ 'బావిని' లేదా 'లవాజెలా' అని పిలువబడే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు చాలా ప్రమాదకరమైనదని, దానిని ఎవరైనా చూస్తే వారి చూపు శాశ్వతంగా మాయమవుతుందని వీరు ప్రగాఢంగా నమ్మారు. కాలక్రమేణా గ్రామంలో వరుసగా జనులు చూపు కోల్పోవడం ప్రారంభం కావడంతో, దీన్ని ఏదో అదృశ్య శక్తీ లేదా దెయ్యం శాపంగా భావించి బిక్కుబిక్కుమంటూ బతికారు.

శాస్త్రవేత్తల ఎంట్రీ.. బయటపడిన షాకింగ్ నిజం!

ఈ విచిత్ర ఘటనపై కాలక్రమేణా వైద్యులు, శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. గ్రామస్థులు నమ్ముతున్నట్టు ఆ చెట్టు వల్ల లేదా దెయ్యాల వల్ల ఎవరూ కురుడు కావడం లేదని, అసలు కారణం వేరే ఉందని పరిశోధనలో తేలింది.

అక్కడ ప్రజలు అంధత్వం బారిన పడటానికి అసలు కారణం ఒక ప్రమాదకరమైన పరాన్నజీవి వ్యాధి. దీనిని వైద్య పరిభాషలో 'ఆంకోసెర్సియాసిస్' (Onchocerciasis) లేదా 'నది అంధత్వం' (River Blindness) అంటారు. 'ఆంకోసెర్కా వోల్వుಲస్' (Onchocerca volvulus) అనే పరాన్నజీవి పురుగుల వల్ల ఈ ముప్పు వస్తుంది.

ప్రాణాలు తీస్తున్న సూక్ష్మమైన 'నల్ల ఈగలు'!

ఈ వ్యాధి వెనుక అసలు విలన్లు చిన్నపాటి నల్ల ఈగలు. ఇవి సాధారణంగా వేగంగా ప్రవహించే నదులు, నీటి వనరుల వద్ద ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఈ ఈగ మనిషిని కుట్టినప్పుడు, ఆ పరాన్నజీవి శరీరంలోకి ప్రవేశించి.. క్రమంగా కళ్లపై తీవ్ర ప్రభావం చూపి చూపును హరిస్తుంది.

పిల్లల పుట్టుక వెనుక ఉన్న నిజం ఈ గ్రామంలో పుట్టే ప్రతి బిడ్డ పుట్టుకతోనే గుడ్డివాడు అవుతాడనే మరో పెద్ద అపోహ కూడా ప్రచారంలో ఉంది. అయితే ఇది పూర్తిగా అబద్ధమని శాస్త్రీయంగా నిరూపితమైంది. పిల్లలందరూ పూర్తి చూపుతోనే జన్మిస్తారు. కానీ ఆ ప్రాంతంలో తిరుగాడే సోకిన నల్ల ఈగలు పదే పదే కుట్టడం వల్లే వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

కేవలం మనుషులకే కాకుండా ఈ సమస్య జంతువులకూ సోకగలదు. కానీ ఈ చిన్న శాస్త్రీయ నిజం తెలియక, తరతరాలుగా అక్కడి ప్రజలు దీనిని ఒక దుష్ట శక్తి మహిమ అనుకుని భయపడుతూ వచ్చారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rice Storage: బియ్యానికి పురుగులు ప‌డుతున్నాయా? ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టొచ్చు
Recommended image2
Viral News: బిర్యానీ కోసం 15 ఏళ్ల కెరియర్ త్యాగం.. ఉద్యోగమే వదిలేసి దేశాలు తిరుగుతున్న చెఫ్
Recommended image3
French Fries: నూనె లేకుండా ఫ్రెంచ్ ఫ్రైస్‌.. ఇలా చేస్తే క్రిస్పీతో పాటు టేస్ట్ ఖాయం
Related Stories
Recommended image1
Mutton: చలికాలంలోనే మటన్ ఎందుకు ఎక్కువ రుచిగా ఉంటుంది..? అసలు కారణం ఇదే..!
Recommended image2
Suitcase: విమాన ప్రయాణికులు... సూట్ కేస్ వీల్స్ కి టేపు ఎందుకు చుడతారు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved