MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Bank Account: అకౌంట్ హోల్డర్ చనిపోతే వారి ఖాతాలోని డబ్బులు ఏమవుతాయి? వాటిని ఎలా తీసుకోవచ్చు?

Bank Account: అకౌంట్ హోల్డర్ చనిపోతే వారి ఖాతాలోని డబ్బులు ఏమవుతాయి? వాటిని ఎలా తీసుకోవచ్చు?

Bank Account: మనం బ్యాంకులో డబ్బులు దాచుకోవడం, తీసుకోవడం సహజం. అయితే అకౌంట్ హోల్డర్ చనిపోతే ఖాతాలోని డబ్బులు ఏమవుతాయి? నామినీ లేదా చట్టబద్ధమైన వారసులు ఆ డబ్బులు ఎలా తీసుకోవాలి? అందుకు కావాల్సిన డాక్యుమెంట్లు, ఆర్బీఐ రూల్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Sep 30 2026, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అకౌంట్ హోల్డర్ చనిపోతే ఖాతాలోని డబ్బులు ఏమవుతాయి?
Image Credit : Pinterest

అకౌంట్ హోల్డర్ చనిపోతే ఖాతాలోని డబ్బులు ఏమవుతాయి?

బ్యాంకులో డబ్బులు దాచుకున్న వ్యక్తి చనిపోతే, ఆ డబ్బు బ్యాంకు సొంతం అయిపోదు. RBI గైడ్‌లైన్స్ ప్రకారం.. నామినీ, జాయింట్ అకౌంట్ హోల్డర్ లేదా చట్టబద్ధమైన వారసులు సరైన పద్ధతిలో ఆ డబ్బును తీసుకోవచ్చు. అకౌంట్ హోల్డర్ చనిపోయిన వెంటనే, ఆ విషయాన్ని హోమ్ బ్రాంచ్‌కు రాతపూర్వకంగా తెలియజేయాలి. సమాచారం అందిన వెంటనే, అకౌంట్ నుంచి ఎలాంటి మోసపూరిత లావాదేవీలు జరగకుండా బ్యాంకు ఆ.. అకౌంట్‌ను ఫ్రీజ్ చేస్తుంది. ఆ తర్వాత, ఆ అకౌంట్‌కు నామినీ ఉన్నారా? లేదా జాయింట్ అకౌంటా? అనేది చెక్ చేసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నామినీ ద్వారా డబ్బులు తీసుకునే ప్రాసెస్
Image Credit : Pinterest

నామినీ ద్వారా డబ్బులు తీసుకునే ప్రాసెస్

  • బ్యాంక్ అకౌంట్‌కు నామినీ ఉంటే డబ్బులు తీసుకోవడం చాలా ఈజీ.
  • బ్యాంకుకు వెళ్లి “Claim Form for Nominee” ఫారం తీసుకుని, వివరాలు నింపి ఇవ్వాలి.
  • నింపిన క్లెయిమ్ ఫారంతో పాటు డెత్ సర్టిఫికెట్, నామినీ కేవైసీ (ఆధార్, పాన్ కార్డ్) డాక్యుమెంట్లను జత చేయాలి.
  • మీరు ఇచ్చిన డాక్యుమెంట్లు, నామినీ వివరాలను బ్యాంకు అధికారులు వెరిఫై చేస్తారు.
  • వెరిఫికేషన్ పూర్తయ్యాక, బ్యాంకు రూల్స్ ప్రకారం అకౌంట్‌లోని డబ్బును నామినీ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. లేదా చెక్/డీడీ రూపంలో ఇస్తారు.
35
నామినీ లేకపోతే ఏం చేయాలి?
Image Credit : Pinterest

నామినీ లేకపోతే ఏం చేయాలి?

  • నామినీ లేని అకౌంట్ అయితే, చట్టబద్ధమైన వారసులు బ్యాంకును సంప్రదించి డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు.
  • అకౌంట్‌లో ఉన్న డబ్బు, బ్యాంకు రూల్స్‌ను బట్టి డాక్యుమెంట్లు అడుగుతారు.
  • తహసీల్దార్ జారీ చేసిన లీగల్ హెయిర్ (వారసత్వ) సర్టిఫికెట్ ఇవ్వాలి.
  • భవిష్యత్తులో వేరే ఎవరైనా వచ్చి డబ్బులు అడిగితే దానికి మేమే బాధ్యులం అని రాసి ఉన్న ఫారంపై వారసులంతా సంతకాలు చేయాలి.
  • ముఖ్యమైన వారసుడు డబ్బులు తీసుకునేందుకు, మిగతా వారసులంతా అభ్యంతరం లేదని చెప్తూ NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) ఇవ్వాలి.
  • డబ్బు మొత్తాన్ని బట్టి బ్యాంకు అడిగే డాక్యుమెంట్లు మారొచ్చు.
45
జాయింట్ అకౌంట్ అయితే ఎలా?
Image Credit : Pinterest

జాయింట్ అకౌంట్ అయితే ఎలా?

”Either or Survivor” పద్ధతిలో అకౌంట్ ఉంటే, ఒకరు చనిపోయినప్పుడు బతికి ఉన్న రెండో వ్యక్తి (Survivor) డెత్ సర్టిఫికెట్ ఇచ్చి అకౌంట్‌ను కంటిన్యూ చేయొచ్చు లేదా డబ్బులు తీసుకోవచ్చు. అదే ”Jointly” పద్ధతిలో అకౌంట్ ఉంటే, ఒకరు చనిపోయాక బతికి ఉన్న వ్యక్తి ఒక్కరే ఆ డబ్బును తీసుకోలేరు. చనిపోయిన వ్యక్తి చట్టబద్ధమైన వారసుల అనుమతి ఉంటేనే బతికి ఉన్న వ్యక్తికి డబ్బులు ఇస్తారు.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

  • వ్యక్తి చనిపోయాక అతని ఏటీఎం కార్డు వాడి డబ్బులు తీయడం నేరం.
  • చనిపోయిన వ్యక్తికి ఏవైనా అప్పులు ఉంటే, అకౌంట్‌లోని డబ్బు నుంచి ఆ బకాయిలను కట్ చేసుకునే హక్కు బ్యాంకుకు ఉంటుంది.

10 ఏళ్ల పాటు అకౌంట్‌లోని డబ్బును ఎవరూ క్లెయిమ్ చేయకపోతే, ఆ డబ్బును RBIకి చెందిన DEAF Fund (Depositor Education and Awareness Fund)కు పంపుతారు.

కావాల్సిన డాక్యుమెంట్లు:

  • డెత్ సర్టిఫికెట్: ఒరిజినల్, జిరాక్స్.
  • బ్యాంకు డాక్యుమెంట్లు: చనిపోయిన వ్యక్తి పాస్‌బుక్, చెక్ బుక్, ఏటీఎం/డెబిట్ కార్డ్ ఉంటే వాటిని ఇవ్వాలి.
  • క్లెయిమ్ చేసేవారి డాక్యుమెంట్లు: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి ఐడీ, అడ్రస్ ప్రూఫ్‌లు.
  • నామినీ ఉంటే: నామినీ ఐడీ, బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు.
55
15 రోజుల రూల్ ఏంటి?
Image Credit : Gemini Ai

15 రోజుల రూల్ ఏంటి?

  • అకౌంట్ హోల్డర్ చనిపోయాక, నామినీ లేదా వారసులు డబ్బు కోసం బ్యాంకులో క్లెయిమ్ ఫారం ఇవ్వాలి.
  • డెత్ సర్టిఫికెట్, ఇతర డాక్యుమెంట్లు అన్నీ కరెక్ట్‌గా ఇస్తే, క్లెయిమ్ అందుకున్న 15 రోజుల్లోగా బ్యాంకు ఆ డబ్బును సెటిల్ చేయాలి.

బ్యాంకుకు డాక్యుమెంట్లు ఇచ్చిన రోజు నుంచి ఈ 15 రోజుల గడువును లెక్కిస్తారు.

చనిపోయిన వ్యక్తి పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఉంటే?

చనిపోయిన వ్యక్తి పేరు మీద ఎఫ్‌డీ ఉన్నా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎఫ్‌డీ గడువు తీరకపోయినా, బ్యాంకు రూల్స్ ప్రకారం దాన్ని మధ్యలోనే క్యాన్సిల్ చేసి డబ్బులు తీసుకునే సదుపాయం కల్పించాలని ఆర్బీఐ చెబుతోంది.

నామినీని యాడ్ చేసుకోవడం ఎందుకు ముఖ్యం?

  • బ్యాంక్ అకౌంట్‌లో నామినీ పేరును యాడ్ చేసుకోవడం చాలా ముఖ్యం.
  • అకౌంట్ హోల్డర్ అనుకోకుండా చనిపోతే, డబ్బును ఈజీగా క్లెయిమ్ చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
  • అందుకే బ్యాంక్ అకౌంట్లు, ఇతర ఆర్థిక పెట్టుబడులకు నామినీని కచ్చితంగా పెట్టుకోవాలని ఆర్బీఐ సూచిస్తోంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌ముద్రాలు ఒక్క‌సారిగా మంచినీటిగా మారితే ఏమ‌వుతుందో తెలుసా.? విప‌త్తు ఖాయం
Recommended image2
Psychology: సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి ఎక్కువగా ఏడ్చే 5 సందర్భాలు ఇవే!
Recommended image3
Holidays: ప్రపంచంలో అత్యధిక సెలవులు కలిగిన దేశం ఏదో తెలుసా? షాక్ అయిపోతారు
Related Stories
Recommended image1
Psychology: సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి ఎక్కువగా ఏడ్చే 5 సందర్భాలు ఇవే!
Recommended image2
Parenting: మీ పిల్లలు ఎప్పుడూ గొడవ పడుతున్నారా? ఈ 5 చేస్తే వారి మధ్య ప్రేమ పెరగడం పక్కా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved