MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Feature
  • Tatkal Passport : కేవలం మూడు రోజుల్లోనే మీ చేతికి పాస్ పోర్ట్... ఎలాగో తెలుసా?

Tatkal Passport : కేవలం మూడు రోజుల్లోనే మీ చేతికి పాస్ పోర్ట్... ఎలాగో తెలుసా?

మీరు అర్జెంట్‌గా విదేశాలకు వెళ్లాల్సి ఉందా? కానీ మీ దగ్గర పాస్ పోర్ట్ లేదా?  ఏం కంగారుపడకండి. కేవలం 3 రోజుల్లోనే పాస్‌పోర్ట్ మీ చేతికి వచ్చే అద్భుతమైన ప్లాన్ ఒకటి ఉంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 27 2026, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏమిటీ తత్కాల్ పాస్ పోర్ట్?
Image Credit : X

ఏమిటీ తత్కాల్ పాస్ పోర్ట్?

పాస్ పోర్ట్... విదేశాలకు వెళ్లాలంటే ఇది తప్పనిసరి. కానీ ఈ పాస్ పోర్ట్ పొందేందుకు లాంగ్ ప్రాసెస్ ఉంటుంది... అందుకే చాలామంది విదేశీ ప్రయాణాలు లేకున్నా ముందుజాగ్రత్తగా దీన్ని తీసిపెట్టుకుంటారు. ఉన్నత చదువులు, ఉద్యోగ పనులు లేదా మరేదైనా కారణంతో అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు... ఇలాంటప్పుడు చేతిలో పాస్ పోర్ట్ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పాస్ పోర్ట్ లేకుంటే పరిస్ధితి ఏంటి? అయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అత్యవసర సమయాల్లో జెట్ స్పీడ్ లో పాస్ పోర్ట్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది... అదే తత్కాల్ పాస్ పోర్ట్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తత్కాల్ పాస్ పోర్ట్ ఎన్నిరోజులకు జారీ చేస్తారు?
Image Credit : stockPhoto

తత్కాల్ పాస్ పోర్ట్ ఎన్నిరోజులకు జారీ చేస్తారు?

విదేశాల్లో ఉద్యోగం, చదువు, వైద్యం, వ్యాపారం లేదా మరేదైనా అత్యవసర పని మీద వెళ్లాల్సి వస్తే తత్కాల్ పాస్‌పోర్ట్ పొందవచ్చు. సాధారణంగా అయితే పాస్ట్ పోర్ట్ జారీకి 30 నుండి 45 రోజులు పడుతుంది... కానీ ఈ తత్కాల్ పాస్ పోర్ట్ ను కేవలం మూడు రోజుల్లోనే పొందవచ్చు. ఒకేరోజులో తత్కాల్ పాస్ పోర్ట్ జారీచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ తత్కాల్ పాస్ పోర్ట్ పొందాలంటే అవసరమైన డాక్యుమెంట్లు, ప్రాసెస్, నియమాల గురించి కచ్చితంగా తెలిసి ఉండాలి... లేదంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది.

Related Articles

Related image1
Indian e passport: ఇండియాలో ఈ-పాస్‌పోర్ట్ సేవలు.. హైద‌రాబాద్ లో కూడా తీసుకోవ‌చ్చు.. దీని ప్ర‌త్యేక‌త ఏమిటి?
Related image2
Passport : వీసా లేకుండా 192 దేశాలకు వెళ్లొచ్చు.. ఈ ఒక్క పాస్‌పోర్ట్ మీ దగ్గర ఉంటే చాలు!
35
తత్కాల్ పాస్ పోర్ట్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
Image Credit : Freepik

తత్కాల్ పాస్ పోర్ట్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఈ ఫాస్ట్ ట్రాక్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తుదారులు అన్ని డాక్యుమెంట్లను సరైన సమాచారంతో సబ్మిట్ చేయాలి. పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఆమోదం పొందాక కేవలం 3 పనిదినాల్లోనే పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. ఇలా అత్యవసర సమయాల్లో ఈ తత్కాల్ పాస్ పోర్ట్ స్కీమ్ ఆదుకుంటుంది.

తత్కాల్ పాస్ పోర్ట్ కోసం అప్లై చేసేవారికి, సాధారణ పద్ధతిలో అప్లై చేసేవారికంటే అపాయింట్‌మెంట్ త్వరగా దొరుకుతుంది. ఈ స్కీమ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి, పనులు వేగంగా జరుగుతాయి. చాలా సందర్భాల్లో ముందుగా ఈ తత్కాల్ పాస్‌పోర్ట్ జారీ చేసి, ఆ తర్వాతే పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు. ఇది దరఖాస్తుదారుల సమయాన్ని బాగా ఆదా చేస్తుంది.

45
ఈ విషయాలు మర్చిపోవద్దు
Image Credit : Getty

ఈ విషయాలు మర్చిపోవద్దు

తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసేముందు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. తప్పుడు సమాచారం, అసంపూర్ణ డాక్యుమెంట్లు లేదా అప్లికేషన్‌లోని తప్పుల వల్ల మీ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు అన్ని నియమ నిబంధనలను జాగ్రత్తగా పాటించడం ముఖ్యం. ఒకటికి రెండుసార్లు వివరాలన్ని సరిచూసుకున్నాకే ఈ తత్కాల్ పాస్ పోర్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి… అర్జెంటుగా పాస్ పోర్ట్ కావాలంటే ఈమాత్రం జాగ్రత్తగా ఉండటం అవసరం.

55
పాస్ పోర్ట్ ఛార్జీలు పెంపు
Image Credit : Getty

పాస్ పోర్ట్ ఛార్జీలు పెంపు

భారత ప్రభుత్వం ఇటీవల పాస్ పోర్ట్ ఛార్జీలను పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఇలా సాధారణ పాస్ పోర్ట్ తో పాటు తత్కాల పాస్ పోర్ట్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి. జూలై 1 నుండి ఈ పెరిగిన ఛార్జీలు అమలులోకి రానున్నాయి... ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటివరకు 36 పేజీల సాధారణ పాస్ పోర్ట్ కోసం కేవలం రూ.1500 చెల్లిస్తే సరిపోయేది. కానీ జూలై 1 నుండి మరో వెయ్యి ఎక్స్ట్రాగా చెల్లించాలి... అంటే రూ.2,500 వసూలు చేస్తారన్నమాట. అదే 60 పేజీల సాధారణ పోర్ట్ కు గతంలో రూ.2000 చెల్లించాల్సి ఉండేది... దీన్ని రూ.3500 కు పెంచారు. అంటే ఈ పాస్ట్ పోర్ట్ పై రూ.1500 పెంచారన్నమాట.

ఇక తత్కాల్ పాస్ పోర్ట్ ఛార్జీల విషయానికి వస్తే 36 పేజీల పాస్ పోర్ట్ కు రూ.5000 చెల్లించాలి. ఇప్పటివరకు ఈ ఛార్జీలు కేవలం రూ.3500 మాత్రమే. 60 పేజీల తత్కాల్ పాస్ట్ పోర్ట్ ఛార్జీలు రూ.4000 నుండి రూ.6000 పెంచారు. ఇలా సాధారణ, తత్కాల్ పాస్ పోర్ట్ ఛార్జీలు రూ.1000 నుండి 2000 పెరిగాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
యుటిలిటీ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
అంత్య‌క్రియల‌ స‌మ‌యంలో.. మ‌ర‌ణించిన వ్య‌క్తి నోట్లో బంగారం ఎందుకు పెడతారో తెలుసా?
Recommended image2
Passport : ఈ ప్రపంచంలో పాస్ పోర్ట్ అంటూ ఉండనిది ఈ ముగ్గురికే.. ఎవరో తెలుసా?
Recommended image3
Tips and Tricks : క్యాలిక్యులేటర్‌లో GT, CE, MU బటన్లను ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో తెలుసా?
Related Stories
Recommended image1
Indian e passport: ఇండియాలో ఈ-పాస్‌పోర్ట్ సేవలు.. హైద‌రాబాద్ లో కూడా తీసుకోవ‌చ్చు.. దీని ప్ర‌త్యేక‌త ఏమిటి?
Recommended image2
Passport : వీసా లేకుండా 192 దేశాలకు వెళ్లొచ్చు.. ఈ ఒక్క పాస్‌పోర్ట్ మీ దగ్గర ఉంటే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved