MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Indian e passport: ఇండియాలో ఈ-పాస్‌పోర్ట్ సేవలు.. హైద‌రాబాద్ లో కూడా తీసుకోవ‌చ్చు.. దీని ప్ర‌త్యేక‌త ఏమిటి?

Indian e passport: ఇండియాలో ఈ-పాస్‌పోర్ట్ సేవలు.. హైద‌రాబాద్ లో కూడా తీసుకోవ‌చ్చు.. దీని ప్ర‌త్యేక‌త ఏమిటి?

India launches chip based e passports: భారత్ చిప్ ఆధారిత ఈ-పాస్‌పోర్ట్ సేవ‌ల‌ను ప్రారంభించింది. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-పాస్‌పోర్ట్‌లు మరింత భద్రతతో కూడిన వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 15 2025, 08:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

India launches chip based e passports: భారత్ మ‌రో ముంద‌డుగు వేసింది. ఈ పాస్ పోర్ట్ సేవ‌ల‌ను ప్రారంభించింది.  2024 ఏప్రిల్ లో ప్రారంభమైన చిప్ ఆధారిత ఈ-పాస్‌పోర్ట్‌లు ఇప్పుడు పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రాం 2.0 కింద మరిన్ని నగరాలలో అందుబాటులోకి వచ్చాయి. 2025 మధ్య నాటికి ఈ-పాస్‌పోర్ట్‌లు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ కొత్త ఈ-పాస్‌పోర్ట్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్, అన్‌టెనా ఉంటుంది. ఇది కార్డ్ హోల్డ‌ర్ల బయోమెట్రిక్ డేటా (ముఖచిత్రం, వేలిముద్రలు), వ్యక్తిగత వివరాలు వంటి సమాచారాన్ని భద్రతగా నిల్వ చేస్తుంది. ఈ డేటాను BAC (Basic Access Control), EAC (Extended Access Control) వంటి ప్రోటోకాల్స్ ద్వారా బ‌ల‌మైన సెక్యూరిటీని క‌లిగి ఉంటుంది. 

ఇది ప్రపంచవ్యాప్తంగా ICAO ప్రమాణాలు పాటిస్తూ రూపొందించారు.  e-గేట్ల ద్వారా మీ కార్డుతో మ‌రింత సౌక‌ర్య‌వంతంగా మీరు ముందుకు సాగ‌వ‌చ్చు. ఇది ప్రామాణికంగా ఉన్న 120 కంటే ఎక్కువ దేశాల్లో ఇప్పటికే అమలులో ఉంది. జపాన్, కెనడా, ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఈ విధానాన్ని ప్రారంభించాయి.

35

ఈ పాస్‌పోర్ట్ ఉపయోగించేవారికి ప్రయోజనాలు ఏమిటి?

1. ఇమ్మిగ్రేషన్ వేగవంతంగా పూర్తి అవుతుంది 

2. గుర్తింపు కోసం లైన్ లో ఎక్కువ స‌మ‌యం ఉండాల్సిన ప‌ని లేకుండా పూర్తవుతుంది

3. ఐడెంటిటీ థెఫ్ట్, పాస్‌పోర్ట్ ఫోర్జరీలు అయ్యే అవ‌కాశాలు త‌క్కువ‌. అధిక రక్షణ ఉంటుంది 

4. మ‌రింత‌గా వీసా-ఫ్రీ లేదా వీసా-ఆన్-అరైవల్ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి

ప్రస్తుతం ఈ-పాస్‌పోర్ట్‌ సేవలు అందుబాటులో ఉన్న నగరాలు ఏవి? 

నాగ్‌పూర్, భువనేశ్వర్, జమ్మూ, గోవా, శిమ్లా, రాయ్‌పూర్, అమృత్‌సర్, జైపూర్, చెన్నై, హైదరాబాద్, సూరత్, రాంచీ, ఢిల్లీ.

45

పాత పాస్‌పోర్ట్‌లను మార్చాల్సిన అవసరం ఉందా?

పాత పాస్‌పోర్ట్‌లను మార్చాల్సిన అవసరం లేద‌ని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాత పాస్‌పోర్ట్‌లు వాటి గడువు ముగిసే వరకూ చెల్లుబాటులో ఉంటాయి. కొత్తగా లేదా పునఃనవీకరణ కోసం దరఖాస్తు చేసిన వారు, వారి ప్రాంతీయ కార్యాలయం సిద్ధంగా ఉంటే ఈ-పాస్‌పోర్ట్ పొందుతారు.

55

ఈ కొత్త మార్పులు Make in India కార్యక్రమానికి తోడ్పాటు అందించడంతోపాటు, నాషిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్ లోనే అన్ని ఈ-పాస్‌పోర్ట్‌లు ముద్రించబడుతున్నాయి. దీని వల్ల డేటా భద్రత, జాతీయ నియంత్రణ బలోపేతం అవుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
హైదరాబాద్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Delhi Protest : సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి మార్చ్.. రాహుల్, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత
Recommended image2
Rahul Gandhi: సీఈసీకి మోదీ రక్షణ.. ఢిల్లీని జైలుగా మార్చేశారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Recommended image3
INDIA Bloc Protest: సీజేఐ నో చెప్పినా ఆగని ఇండియా కూటమి నిరసనలు.. ఢిల్లీలో ఏం జరుగుతోంది?
Related Stories
Recommended image1
Trump: ఇండియా-పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై ట్రంప్ యూటర్న్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved