MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Feature
  • South Kashmir of Andhra: దక్షిణ కాశ్మీరం.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే.. పాపికొండలు ఎందుకు అంత స్పెషల్?

South Kashmir of Andhra: దక్షిణ కాశ్మీరం.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే.. పాపికొండలు ఎందుకు అంత స్పెషల్?

South Kashmir of Andhra : దక్షిణ కాశ్మీరంగా పిలిచే పాపికొండలను జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే. మహిళ తలపాపిడిలా ఉండే ఆ కొండల రహస్యం ఏంటి? పాపికొండల పర్యాటక విశేషాలు, బోట్ ప్రయాణం, నేషనల్ పార్క్ సహా పూర్తి ప్రయాణ వివరాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 15 2026, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దట్టమైన అడవులు, జలపాతాలు.. మన సౌత్ కాశ్మీర్ పాపికొండలు టూర్ ప్లాన్
Image Credit : Gemini

దట్టమైన అడవులు, జలపాతాలు.. మన సౌత్ కాశ్మీర్ పాపికొండలు టూర్ ప్లాన్

మన దేశంలో ప్రకృతి ప్రసాదించిన కొన్ని అద్భుతమైన ప్రదేశాలలో పాపికొండలు ఒకటి. ఇక్కడ ప్రకృతి ఎంతో ప్రశాంతంగా, అందంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో, గంభీరంగా ప్రవహించే గోదావరి నది వెంబడి విస్తరించి ఉన్న ఈ కొండల శ్రేణిని పర్యాటకులు దక్షిణ కాశ్మీరం లేదా మినీ కాశ్మీర్ అని పిలుచుకుంటారు.

నగర జీవితంలోని సందడి, కాలుష్యం నుండి దూరంగా ప్రశాంతంగా గడపడానికి ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్. ఈ అందమైన కొండలకు ఆ పేరు ఎలా వచ్చింది? అక్కడ చూడదగిన ప్రదేశాలు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అసలు పాపికొండలు అనే పేరు ఎలా వచ్చింది?
Image Credit : X/AndhraCommunity

అసలు పాపికొండలు అనే పేరు ఎలా వచ్చింది?

ఈ కొండల శ్రేణికి మొదట పాపిడి కొండలు అని పేరు ఉండేది. తెలుగులో పాపిడి అంటే మహిళలు తమ తల మధ్యలో తీసుకునే పాపిడి అని అర్థం. ఎత్తైన ప్రదేశం నుండి చూసినప్పుడు లేదా కొండల మధ్య నుండి చూసినప్పుడు, దట్టమైన ఆకుపచ్చని కొండల గుండా గోదావరి నది ప్రవహించే తీరు ఒక మహిళ తలపాపిడి లాగా కనిపిస్తుంది. అందుకే వీటికి 'పాపిడి కొండలు' అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఇది వాడుక భాషలో పాపికొండలుగా మారిపోయింది. ఇంగ్లీషులో వీటిని పాపి హిల్స్ (Papi Hills) అంటారు.

మరో స్థానిక పురాణ కథనం ప్రకారం.. ఈ కొండలు ఎంత పవిత్రమైనవంటే, ఇక్కడికి వచ్చే వారి పాపాలు అన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.

36
థ్రిల్లింగ్ గోదావరి బోట్ ప్రయాణం.. ఎలా ఉంటుంది?
Image Credit : X/AndhraCommunity

థ్రిల్లింగ్ గోదావరి బోట్ ప్రయాణం.. ఎలా ఉంటుంది?

పాపికొండల పర్యటనలో అత్యంత ఆకర్షణీయమైనది గోదావరి నదిపై సాగే బోట్ ప్రయాణం. రాజమహేంద్రవరం లేదా భద్రాచలం నుండి ఈ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. ప్రయాణం సాగుతున్న కొద్దీ, విశాలంగా ఉండే గోదావరి నది ఒక్కసారిగా ఇరుకైన కొండల మధ్య గుండా సాగుతుంది. చల్లని గాలి, చుట్టూ దట్టమైన అడవులు, చాలా చోట్ల మొబైల్ సిగ్నల్స్ కూడా లేకపోవడం వల్ల పర్యాటకులకు పూర్తి మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ఇక్కడ చిన్న మోటార్ బోట్లు అంటే ఐదుగురు ప్రయాణించేవి లేదా 50 నుండి 60 మంది ప్రయాణించగల రివర్ స్ట్రీమర్లు అందుబాటులో ఉంటాయి. ఈ జర్నీ దాదాపు 8 గంటల పాటు సాగుతుంది. బోట్ ప్రయాణం కోసం పెద్దలకు రూ. 500, పిల్లలకు రూ. 400 చొప్పున ఛార్జ్ చేస్తారు.

46
తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే
Image Credit : X/AndhraCommunity

తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే

పాపికొండల పరిసరాల్లో ప్రకృతి అందాలతో పాటు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా ఉన్నాయి.

• పాపికొండ జాతీయ ఉద్యానవనం: దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కును 2008 లో నేషనల్ పార్క్‌గా ప్రకటించారు. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్, ఇండియన్ లెపార్డ్, రస్టీ స్పాటెడ్ క్యాట్ వంటి అంతరించిపోతున్న వన్యప్రాణులు, రకరకాల పక్షులు ఉంటాయి.

• పేరంటాలపల్లి గ్రామం: గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ చిన్న గ్రామంలో రామకృష్ణ ముని ఆశ్రమం, వీరేశ్వర స్వామి దేవాలయం ఉన్నాయి. ఇక్కడ లభించే వెదురుతో చేసిన హ్యాండ్‌క్రాఫ్ట్స్, బొమ్మలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.

• పట్టిసీమ: నది మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపం. పరమశివుడి ఆయుధం పేరు మీద దీనికి ఈ పేరు వచ్చింది. ఇక్కడి వీరభద్రస్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.

• గండి పోచమ్మ ఆలయం: గోదావరి నది ఒడ్డున గల గోండూరు గ్రామంలో ఈ దేవాలయం ఉంది.

• జమాలాపురం ఆలయం: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం సమీపంలోని జమాలాపురం గ్రామంలో కొలువైన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా చూడవచ్చు.

56
పాపికొండలకు ఎలా చేరుకోవాలి?
Image Credit : X/AndhraNexus

పాపికొండలకు ఎలా చేరుకోవాలి?

పాపికొండల ప్రాంతానికి చేరుకోవడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

• విమాన మార్గం: రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ (మధురపూడి) దీనికి అత్యంత సమీప ఎయిర్‌పోర్ట్. ఇక్కడి నుండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడలకు క్రమం తప్పకుండా విమాన సర్వీసులు ఉంటాయి. ఎయిర్‌పోర్ట్ నుండి క్యాబ్‌ల ద్వారా పాపికొండలకు చేరుకోవచ్చు.

• రైలు మార్గం: పాపికొండలకు నేరుగా రైల్వే స్టేషన్ లేదు. రాజమండ్రి రైల్వే స్టేషన్ దీనికి అత్యంత సమీపంలో ఉంది. ఇది విజయవాడ నుండి 150 కి.మీ, విశాఖపట్నం నుండి 220 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.

• రోడ్డు మార్గం: ఖమ్మం నుండి వచ్చే వారు భద్రాచలం కు బస్సు లేదా ట్యాక్సీ ద్వారా చేరుకోవచ్చు. తూర్పు గోదావరి జిల్లా నుండి రాజమండ్రికి క్యాబ్ ద్వారా చేరుకోవచ్చు. తూర్పు గోదావరి నుండి పాపికొండల శ్రేణికి 35 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు మార్గం ఉంది.

66
ఎప్పుడు వెళ్లడం బెస్ట్?
Image Credit : X/AndhraNexus

ఎప్పుడు వెళ్లడం బెస్ట్?

అక్టోబర్ నుండి మార్చి మధ్య కాలం పాపికొండలు సందర్శించడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉండే వేసవి కాలాన్ని అస్సలు రికమండ్ చేయరు. ఇక జూలై నుండి సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలో నది ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి బోట్ ప్రయాణం కొంచెం త్రిల్లింగ్‌గా, కొన్నిసార్లు సాహసోపేతంగా ఉంటుంది.

పర్యాటకులు వెళ్ళేటప్పుడు కొన్ని స్నాక్స్, డ్రింకింగ్ వాటర్ వెంట తీసుకెళ్లడం మంచిది. బోట్ ఆపరేటర్లు సాధారణంగా భోజన వసతి కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) రాజమండ్రి నుండి ఒకటి లేదా రెండు రోజుల ప్యాకేజీ టూర్లను నిర్వహిస్తుంది. సాహస ప్రియులైతే నది ఒడ్డున క్యాంపింగ్ చేయవచ్చు లేదా కొల్లూరులో ఉండే వెదురు రిసార్ట్స్ లో రాత్రి బస చేయవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
అమరావతి
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
ప్రయాణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snake Venom Medicines: ప్రాణాలు తీసే పాముల విషమే ఇప్పుడు సంజీవని !
Recommended image2
Rainbow : ఇంద్రధనుస్సు ఎప్పుడూ వంగే ఎందుకు కనిపిస్తుంది? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!
Recommended image3
Psychology: ఒక వ్యక్తిని మర్చిపోవడం ఎందుకు అంత కష్టం? సైకాలజీ ఏం చెబుతోంది?
Related Stories
Recommended image1
USA: అమెరికాలో భారతీయులు ఎక్కువగా ఉండే టాప్ 5 నగరాలు ఇవే.. ఈ ప్రాంతాలే ఎందుకు? వాటి ప్రత్యేకత ఏంటి?
Recommended image2
Andhra Kashmir: బాబోయ్ ఏపీలో మంచు కురిసే ప్లేస్ ఉందా? ఆంధ్రా కాశ్మీర్ పూర్తి వివరాలు మీకోసం !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved