MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Feature
  • IRCTC Ultimate Ooty Tour: బడ్జెట్‌లో హైదరాబాద్ నుంచి ఊటీ, కూనూర్ ట్రిప్.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్

IRCTC Ultimate Ooty Tour: బడ్జెట్‌లో హైదరాబాద్ నుంచి ఊటీ, కూనూర్ ట్రిప్.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్

IRCTC Ultimate Ooty Tour: హైదరాబాద్ పరిసర ప్రాంతాల పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ సూపర్ న్యూస్ చెప్పింది. క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్‌ ఊటీ, కూనూర్ అందాలను తక్కువ బడ్జెట్‌లో సందర్శించేందుకు వీలుగా 'అల్టిమేట్ ఊటీ' పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని తెచ్చింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 15 2026, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
IRCTC బంపర్ ఆఫర్: తక్కువ ధరలో ఊటీ, కూనూర్ టూర్
Image Credit : chatgpt

IRCTC బంపర్ ఆఫర్: తక్కువ ధరలో ఊటీ, కూనూర్ టూర్

ఐఆర్‌సీటీసీ (IRCTC) పర్యాటకుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ప్యాకేజీలను అందిస్తోంది. ఇందులో భాగంగా 'అల్టిమేట్ ఊటీ ఎక్స్-హైదరాబాద్' (Ultimate Ooty Ex-Hyderabad) పేరుతో ఒక సూపర్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ ద్వారా ఊటీతో పాటు కూనూర్ అందాలను కూడా కవర్ చేయవచ్చు. ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 రోజుల సమయం ఉంటుంది. ప్రతీ వారం మంగళవారం నాడు ఈ టూర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రయాణ వివరాలు, షెడ్యూల్ ఇదే
Image Credit : Gemini AI

ప్రయాణ వివరాలు, షెడ్యూల్ ఇదే

మొదటి రోజు (మంగళవారం): మధ్యాహ్నం 14:25 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైలు నెంబర్ 20629 'శబరి ఎక్స్‌ప్రెస్' ద్వారా ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.

రెండవ రోజు (బుధవారం): ఉదయం 09:10 గంటల ప్రాంతంలో కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీకి వాహనంలో తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్-ఇన్ అయిన తర్వాత, మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ సందర్శన ఉంటుంది. ఆ రాత్రి ఊటీలోనే బస చేస్తారు.

మూడవ రోజు (గురువారం): హోటల్‌లో టిఫిన్ చేసిన తర్వాత దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా జలపాతం చూడటానికి తీసుకెళ్తారు. రాత్రి బస ఊటీలోనే ఉంటుంది.

నాల్గవ రోజు (శుక్రవారం): ఉదయం అల్పాహారం ముగించుకుని కూనూర్ సైట్‌సీయింగ్‌కు వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి ఊటీ చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు.

ఐదవ రోజు (శనివారం): ఉదయం టిఫిన్ చేశాక, మధ్యాహ్నం 12:00 గంటలకు హోటల్ చెక్-ఔట్ ఉంటుంది. అక్కడి నుండి కోయంబత్తూర్ బయలుదేరుతారు. మధ్యాహ్నం 15:40 గంటలకు కోయంబత్తూర్ రైల్వే స్టేషన్‌లో రైలు నెంబర్ 20630 'శబరి ఎక్స్‌ప్రెస్' ఎక్కాలి.

ఆరవ రోజు (ఆదివారం): ఉదయం 11:00 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

35
సీట్లు, హోటల్ వివరాలు
Image Credit : Asianet News

సీట్లు, హోటల్ వివరాలు

ఈ టూర్ ప్యాకేజీ కోసం ప్రతీ వారం స్లీపర్ క్లాస్‌లో 12 సీట్లు, 3ACలో 6 సీట్లు కేటాయించారు. ఊటీలో 'సిల్వర్ ఓక్' లేదా దానికి సమానమైన హోటల్‌లో నాన్-ఏసీ గదుల్లో వసతి కల్పిస్తారు.

ఈ టూర్ ప్యాకేజీ ఛార్జీలు

ఈ టూర్ ప్యాకేజీ ధరలు ప్రయాణించే తేదీలను బట్టి మూడు కేటగిరీలుగా ఉంటాయి.

1. జూలై 30 నుండి సెప్టెంబర్ 22, 2026 వరకు:

• 3AC (కంఫర్ట్): సింగిల్ షేరింగ్ రూ. 28,730, ట్విన్ షేరింగ్ రూ. 16,460, ట్రిపుల్ షేరింగ్ రూ. 15,550. 5-11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ. 8,840, బెడ్ లేకుండా రూ. 6,490.

• స్లీపర్ (స్టాండర్డ్): సింగిల్ షేరింగ్ రూ. 26,190, ట్విన్ షేరింగ్ రూ. 13,920, ట్రిపుల్ షేరింగ్ రూ. 13,010. 5-11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ. 6,300, బెడ్ లేకుండా రూ. 3,950.

2. సెప్టెంబర్ 29 నుండి డిసెంబర్ 15, 2026 వరకు:

• 3AC (కంఫర్ట్): సింగిల్ షేరింగ్ రూ. 33,590, ట్విన్ షేరింగ్ రూ. 18,890, ట్రిపుల్ షేరింగ్ రూ. 17,170. 5-11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ. 8,840, బెడ్ లేకుండా రూ. 6,490.

• స్లీపర్ (స్టాండర్డ్): సింగిల్ షేరింగ్ రూ. 31,050, ట్విన్ షేరింగ్ రూ. 16,360, ట్రిపుల్ షేరింగ్ రూ. 14,630. 5-11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ. 6,300, బెడ్ లేకుండా రూ. 3,950.

3. డిసెంబర్ 22, డిసెంబర్ 29, 2026:

• 3AC (కంఫర్ట్): సింగిల్ షేరింగ్ రూ. 35,510, ట్విన్ షేరింగ్ రూ. 20,810, ట్రిపుల్ షేరింగ్ రూ. 19,090. 5-11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ. 10,760, బెడ్ లేకుండా రూ. 8,400.

• స్లీపర్ (స్టాండర్డ్): సింగిల్ షేరింగ్ రూ. 32,970, ట్విన్ షేరింగ్ రూ. 18,280, ట్రిపుల్ షేరింగ్ రూ. 16,550. 5-11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ. 8,220, బెడ్ లేకుండా రూ. 5,870.

45
ప్యాకేజీలో ఏముంటాయి.. ఏముండవు?
Image Credit : GEMINI

ప్యాకేజీలో ఏముంటాయి.. ఏముండవు?

ప్యాకేజీలో వుండేవి:

• రైలు ప్రయాణ టికెట్లు (స్లీపర్ లేదా 3AC).

• AC వాహనంలో ప్రయాణం.

• ఊటీలో 3 రాత్రుల నాన్-AC హోటల్ వసతితో పాటు అల్పాహారం.

• టోల్, పార్కింగ్, వర్తించే జీఎస్‌టీ.

ప్యాకేజీలో లేనివి:

• మధ్యాహ్న, రాత్రి భోజనాలు, ప్రయాణంలో ఆహారం.

• దర్శనీయ ప్రాంతాల ప్రవేశ టికెట్లు, టూర్ గైడ్ ఛార్జీలు.

• బోటింగ్, హార్స్ రైడింగ్ వంటి ఇతర వినోద కార్యక్రమాల ఖర్చులు.

55
టికెట్ రద్దు నిబంధనలు, సంప్రదించాల్సిన వివరాలు ఇవే
Image Credit : IRCTC

టికెట్ రద్దు నిబంధనలు, సంప్రదించాల్సిన వివరాలు ఇవే

టికెట్ రద్దు చేసుకోవాలనుకుంటే కేవలం www.irctctourism.com వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చేయాలి. PRS కౌంటర్లలో క్యాన్సిల్ చేయలేరు.

• ప్రయాణ తేదీకి 15 రోజుల కంటే ముందు క్యాన్సిల్ చేస్తే ఒక ప్రయాణికుడికి రూ. 250 మినహాయిస్తారు.

• 8 నుండి 14 రోజుల మధ్య క్యాన్సిల్ చేస్తే ప్యాకేజీ మొత్తంలో 25% కోత విధిస్తారు.

• 4 నుండి 7 రోజుల మధ్య క్యాన్సిల్ చేస్తే 50% కోత పడుతుంది.

• 4 రోజుల కంటే తక్కువ సమయంలో క్యాన్సిల్ చేస్తే రూపాయి కూడా తిరిగి రాదు.

మరిన్ని వివరాలకు లేదా బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్, సికింద్రాబాద్ కార్యాలయాన్ని లేదా 8287932229, 9701360701 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
River : వేల కిలోమీటర్లు ప్రయాణించి... సముద్రంలో కలవక ముందే కనుమరుగయ్యే నది ఏది?
Recommended image2
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image3
Car Engine: కార్లకు ఇంజన్ ముందే ఎందుకు పెడతారో తెలుసా? ఈ సీక్రెట్ లాజిక్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Related Stories
Recommended image1
Car Engine: కార్లకు ఇంజన్ ముందే ఎందుకు పెడతారో తెలుసా? ఈ సీక్రెట్ లాజిక్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Recommended image2
Heritage Trains: 170 ఏళ్లు వచ్చినా తగ్గని ఫేరీ క్వీన్ స్పీడ్.. ఇండియాలోని టాప్ 5 హెరిటేజ్ రైళ్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved