MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • అత్యంత అందమైన ఊరు.. కానీ ఏడాదిలో 4 నెలలు చిమ్మచీకటే

అత్యంత అందమైన ఊరు.. కానీ ఏడాదిలో 4 నెలలు చిమ్మచీకటే

ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఈ ఊరు కూడా ఒకటి. చుట్టూ అగ్నిపర్వతాలు.. మధ్యలో మంచుతో నిండిన ఊరు. దాని పేరు స్వాల్ బోర్డ్. ఇక్కడికి వీసా లేకుండా ఎవరైనా వెళ్లి బతకొచ్చు. కానీ జీవించడం అలవాటు చేసుకుంటేనే ఉండగలరు.

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 07 2026, 04:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నాలుగు నెలలు చిమ్మచీకటే
Image Credit : Gemini AI

నాలుగు నెలలు చిమ్మచీకటే

ఈ భూమ్మీద ఉన్న అందమైన ప్రాంతాల్లో ఆ ఊరు కూడా ఒకటి. తెల్లటి మంచుపై రంగురంగుల ఇళ్లు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. భూమికి ఉత్తరపు అంచున, మంచు దుప్పటి కప్పుకున్న నిశ్శబ్ద సామ్రాజ్యం అది. పేరు ‘స్వాల్ బార్డ్ దీవులు’. నార్వే దేశ పరిధిలో ఉంటుంది. ఈ మంచు లోకంలో అడుగుపెట్టడానికి ఏ దేశ పౌరుడికీ వీసా అవసరం లేదు. నచ్చినంత కాలం ఉండొచ్చు, నచ్చిన పని చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రకృతి చాలా విచిత్రంగా ఉంటుంది. ఏడాదిలో ఏకధాటిగా నాలుగు నెలల పాటు సూర్యుడు కనుమరుగై చిమ్మచీకటి అలుముకుంటుంది. ఆ తర్వాత వచ్చే మరో నాలుగు నెలలు రాత్రి కూడా సూర్యుడు నడినెత్తిన వెలుగులు జిమ్ముతూనే ఉంటాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అక్కడ మరణం నిషేధం
Image Credit : stockPhoto

అక్కడ మరణం నిషేధం

ఈ మంచు సీమలో చట్టాలు కూడా అంతే విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ ఎవరైనా చనిపోవడం నిబంధనలకు విరుద్ధం. తీవ్రమైన చలి కారణంగా నేల పూర్తిగా గడ్డకట్టుకుపోవడంతో, మృతదేహాలు భూమిలో కలిసిపోవు. అందుకే ఇక్కడ ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైనా, ప్రసవ సమయం దగ్గరపడ్డా వెంటనే విమానాల్లో నార్వే ప్రధాన నగరాలకు తరలిస్తారు. మరో విశేషం ఏమిటంటే, స్థానిక అరుదైన పక్షుల భద్రత కోసం ఇక్కడ పిల్లులను పెంచడంపై పూర్తి నిషేధం ఉంది.

33
చలి తట్టుకుంటేనే వెళ్లండి
Image Credit : stockPhoto

చలి తట్టుకుంటేనే వెళ్లండి

అన్నింటికంటే గగుర్పొడిచే విషయం మరొకటి ఉంది. ఈ దీవుల్లో మనుషుల కంటే తెల్లటి ధ్రువపు ఎలుగుబంట్ల సంఖ్యే ఎక్కువ. పట్టణ సరిహద్దు దాటి కాస్త మంచు కొండల వైపు అడుగు వేయాలన్నా చేతిలో రైఫిల్ ఉండాల్సిందే. వీసా లేకపోయినా బతకడానికి సరిపడా ఆదాయం, గడ్డకట్టే మైనస్ డిగ్రీల చలిని తట్టుకునే ధైర్యం ఉంటేనే ఈ మంచు స్వర్గం మనల్ని స్వాగతిస్తుంది. భూమ్మీద విపత్తులు ఎదురైతే పంట జాతులను కాపాడే ప్రపంచపు అతిపెద్ద విత్తన నిధి ‘గ్లోబల్ సీడ్ వాల్ట్’ కూడా ఈ రహస్యాల దీవిలోనే దాగి ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Unique Village : ఇళ్ల పైకప్పులే రోడ్లుగా మారిన వింత గ్రామం... ఎక్కడుందో తెలుసా?
Recommended image2
Interesting Facts: ప్ర‌పంచంలో చెట్లు లేని దేశం ఏదో తెలుసా.? అస‌లు కార‌ణం ఏంటంటే.?
Recommended image3
Telugu Saying: జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే.. ఈ కాలానికి తగ్గ సామెత!
Related Stories
Recommended image1
Mini Africa: హైదరాబాద్‌లో ‘మినీ ఆఫ్రికా’.. ఆ వీధిలో అడుగుపెడితే అంతా ఆఫ్రికన్లే కనిపిస్తారు
Recommended image2
Mushrooms: అత్యంత ప్రమాదకరమైన పుట్టగొడుగులు.. చిన్న ముక్క తిన్నా చాలు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved