MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • River : కృష్ణా నది 64 కి.మీ దూరముండే అరేబియాలో కాకుండా.. 1400 కి.మీ దూరమున్న బంగాళాఖాతంలో ఎందుకు కలుస్తుంది?

River : కృష్ణా నది 64 కి.మీ దూరముండే అరేబియాలో కాకుండా.. 1400 కి.మీ దూరమున్న బంగాళాఖాతంలో ఎందుకు కలుస్తుంది?

కృష్ణా నది అరేబియా సముద్రానికి అత్యంత సమీపంలో పశ్చిమ కనుమల్లో పుడుతుంది. కానీ ఇది అరేబియావైపు ఎందుకు ప్రవహించదు.... వేల కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో ఎందుకు కలుస్తుందో తెలుసా?

3 Min read
Author : Arun Kumar P
| Updated : Oct 07 2026, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కృష్ణా నది చాలా ప్రత్యేకం గురూ..!
Image Credit : Gemini AI

కృష్ణా నది చాలా ప్రత్యేకం గురూ..!

ఒక నది పుట్టిన ప్రాంతానికి సమీపంలోనే సముద్రం ఉంటే.. సాధారణంగా అది ఆ సముద్రం వైపే ప్రవహిస్తుందని అనుకుంటాం. కానీ కృష్ణా నది విషయంలో మాత్రం ప్రకృతి పూర్తిగా భిన్నమైన కథ రాసింది. అరేబియా సముద్రం కేవలం 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో జన్మించిన కృష్ణా నది, ఆ సముద్రం వైపు వెళ్లకుండా ఏకంగా 1,400 కిలోమీటర్లకు పైగా తూర్పువైపు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇంత దూరం ఎందుకు ప్రయాణిస్తుంది? నది తనకు దగ్గరగా ఉన్న సముద్రాన్ని ఎందుకు చేరదు? దీని వెనుక ఉన్న కారణం మన దేశ భౌగోళిక నిర్మాణంలో దాగి ఉంది.

కృష్ణమ్మ జన్మస్థలం ఏది?

కృష్ణా నది మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మహాబలేశ్వరంకు ఉత్తరంగా ఉన్న పశ్చిమ కనుమల్లో జన్మిస్తుంది. సుమారు 1,337 మీటర్ల ఎత్తులో ఈ నది ప్రవాహం ప్రారంభం అవుతుంది. ఆసక్తికరంగా కృష్ణా నది జన్మస్థలం అరేబియా సముద్రానికి కేవలం 64 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే అరేబియా సముద్రం వైపు పశ్చిమంగా ప్రవహించకుండా కృష్ణా నీరు తూర్పు దిశగా ప్రయాణిస్తాయి.

మహారాష్ట్రలో మొదలైన ఈ నది కర్ణాటక, తెలంగాణ మీదుగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లోకి చేరుతుంది. విజయవాడ దిగువ ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. మొత్తం ప్రయాణంలో కృష్ణా నది సుమారు 1,400 కిలోమీటర్లు ప్రవహిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కృష్ణా నది అరేబియా సముద్రంలో ఎందుకు కలవదు?
Image Credit : Getty

కృష్ణా నది అరేబియా సముద్రంలో ఎందుకు కలవదు?

ఇదే కృష్ణా నది కథలో అత్యంత ఆసక్తికరమైన విషయం. నదులు సాధారణంగా ఎత్తైన ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తున్న ప్రాంతాల వైపు ప్రవహిస్తాయి. నీరు తనంతట తాను ఎత్తు నుంచి పల్లం వైపు కదులుతుంది. అందువల్ల నది ఏ సముద్రానికి దగ్గరగా ఉందనే విషయం ఒక్కటే దాని ప్రవాహ దిశను నిర్ణయించదు.

కృష్ణా పుట్టే ప్రాంతం పశ్చిమ కనుమల్లో ఉంది. ఈ పర్వత శ్రేణి పశ్చిమ తీరానికి సమీపంలో ఉన్నప్పటికీ, దాని తూర్పు వైపున విస్తరించిన దక్కన్ పీఠభూమి భౌగోళిక నిర్మాణం కారణంగా కృష్ణా నది పరివాహక ప్రాంతం ప్రధానంగా తూర్పు దిశగా వాలుతుంది. అంటే కృష్ణా నదికి నీరు చేరే విస్తారమైన భూభాగం తూర్పు వైపు దిగువకు వాలుతూ ఉంటుంది. అందుకే వర్షపు నీరు, చిన్న వాగులు, ఉపనదులు క్రమంగా కృష్ణా వైపు చేరి.. చివరకు తూర్పు దిశగా ప్రవహించే ప్రధాన నది వ్యవస్థగా మారుతుంది.

ఇక్కడ ‘వాటర్ డివైడ్’ లేదా జలవిభజన రేఖ అనే భౌగోళిక అంశాన్ని అర్థం చేసుకోవాలి. పశ్చిమ కనుమలు భారత ద్వీపకల్పంలో అనేక నదుల ప్రవాహ దిశలను ప్రభావితం చేసే కీలక పర్వత శ్రేణి. ఈ పర్వత ప్రాంతంలో ఒక వైపు పడే వర్షపు నీరు పశ్చిమంగా అరేబియా సముద్రం వైపు వెళ్లే నదులకు చేరుతుంది. మరో వైపు పడే నీరు తూర్పు దిశగా ప్రవహించే నదీ వ్యవస్థల్లోకి చేరుతుంది. కృష్ణా తూర్పువైపు ప్రవహించే ప్రధాన ద్వీపకల్ప నదుల్లో ఒకటి… అందుకే అరేబియా సముద్రంలో కలవదు.

34
నాలుగు రాష్ట్రాల మీదుగా కృష్ణా ప్రయాణం
Image Credit : AI image - Gemini

నాలుగు రాష్ట్రాల మీదుగా కృష్ణా ప్రయాణం

కృష్ణా నది తన సుదీర్ఘ ప్రయాణంలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తాకుతుంది. ఈ నది పరివాహక ప్రాంతం కూడా చాలా విస్తారంగా ఉంది. కేంద్ర జల సంఘం గణాంకాల ప్రకారం.. కృష్ణా బేసిన్ విస్తీర్ణం సుమారు 2.59 లక్షల చదరపు కిలోమీటర్లు. ఈ పరివాహక ప్రాంతంలో వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు వంటి అనేక అవసరాలకు నది నీరు కీలకంగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన నదీ వ్యవస్థల్లో కృష్ణా బేసిన్ ఒకటి.

కృష్ణాకు ఇన్ని ఉపనదులు ఉన్నాయా?

కృష్ణా నది ఒక్కటే అంత పెద్ద జలవ్యవస్థను ఏర్పాటు చేయలేదు. మార్గంలో అనేక ఉపనదులు దీనిలో కలుస్తాయి. వాటిలో భీమా, తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ, మూసీ, మున్నేరు వంటి నదులు ముఖ్యమైనవి. వాటిలో భీమా, తుంగభద్ర నదులు కృష్ణా జలవ్యవస్థలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. తుంగ, భద్ర నదులు కలిసి తుంగభద్రగా ఏర్పడి అనంతరం కృష్ణాలో కలుస్తాయి. భీమా కూడా పశ్చిమ కనుమల్లో పుట్టి దక్షిణ భారతదేశంలోని విస్తారమైన ప్రాంతాన్ని దాటి కృష్ణాలో చేరుతుంది.

44
కృష్ణా బేసిన్‌లో వర్షపాతం కూడా కీలకం
Image Credit : Gemini AI

కృష్ణా బేసిన్‌లో వర్షపాతం కూడా కీలకం

కృష్ణా నది పరివాహక ప్రాంతానికి ప్రధానంగా నైరుతి రుతుపవనాలే వర్షాలను అందిస్తాయి. కేంద్ర జల సంఘం వివరాల ప్రకారం బేసిన్‌లో వార్షిక వర్షపాతంలో పెద్ద భాగం జూన్ నుంచి అక్టోబర్ నెలల్లో కురుస్తుంది. ముఖ్యంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గణనీయమైన వర్షపాతం నమోదవుతుంది. అందువల్ల కృష్ణా నది ప్రవాహంలో రుతుపవనాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. భారీ వర్షాలు కురిసే సంవత్సరాల్లో బేసిన్‌లో వరద పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.

కృష్ణా నదిపై ఎన్నో భారీ ప్రాజెక్టులు

కృష్ణా నది కేవలం ప్రకృతి అద్భుతం మాత్రమే కాదు.. దక్షిణ భారతదేశ ఆర్థిక, వ్యవసాయ వ్యవస్థలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. కృష్ణా బేసిన్‌లో కోయినా, ఆల్మట్టి, నారాయణపూర్, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ వంటి అనేక ముఖ్యమైన నీటిపారుదల, జలవిద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి అవసరాలను తీర్చేందుకు కృష్ణా జలాలను వినియోగిస్తున్నారు.

దగ్గర్లో సముద్రం ఉన్నా.. వేల మలుపులతో సుదీర్ఘ ప్రయాణం

కృష్ణా నది కథ మనకు ఒక ఆసక్తికరమైన భౌగోళిక విషయాన్ని చెబుతుంది. నది ప్రయాణాన్ని నిర్ణయించేది సముద్రానికి ఉన్న దూరం మాత్రమే కాదు.. భూమి వాలు, పర్వతాలు, భౌగోళిక నిర్మాణం, పరివాహక ప్రాంతం కూడా. అరేబియా సముద్రం కేవలం 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో పుట్టిన కృష్ణా.. ఆ సముద్రాన్ని చేరకుండా దక్కన్ పీఠభూమి మీదుగా తూర్పు దిశగా సాగింది. మార్గంలో ఎన్నో ఉపనదులను కలుపుకుంటూ, వేలాది గ్రామాలు, పట్టణాలు, వ్యవసాయ భూములకు నీరందిస్తూ చివరికి బంగాళాఖాతంలో తన ప్రయాణాన్ని ముగిస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
అత్యంత అందమైన ఊరు.. కానీ ఏడాదిలో 4 నెలలు చిమ్మచీకటే
Recommended image2
Unique Village : ఇళ్ల పైకప్పులే రోడ్లుగా మారిన వింత గ్రామం... ఎక్కడుందో తెలుసా?
Recommended image3
Interesting Facts: ప్ర‌పంచంలో చెట్లు లేని దేశం ఏదో తెలుసా.? అస‌లు కార‌ణం ఏంటంటే.?
Related Stories
Recommended image1
River : ఇంద్రధనస్సులా రంగురంగుల నీటితో ప్రవహించే నది ఏది?
Recommended image2
River : కలుషిత నీటిని తనంతట తానే శుభ్రం చేసుకునే ఇండియన్ నది ఏది? ఇది ఎలా సాధ్యం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved