MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Feature
  • UPI Charges : యూపీఐ పేమెంట్స్ పై ఇక ఛార్జీలా? లోక్ సభలో బిల్లు ఇందుకేనా? రూ.2000 దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

UPI Charges : యూపీఐ పేమెంట్స్ పై ఇక ఛార్జీలా? లోక్ సభలో బిల్లు ఇందుకేనా? రూ.2000 దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించవచ్చనే వార్తలు వస్తున్నాయి. దీనివల్ల సామాన్యులపై ప్రభావం ఉంటుందా? లోక్ సభలో ప్రవేశపెట్టిన బిల్లు యూపీఐ చార్జీల కోసమేనా? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 06 2026, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యూపీఐ లావాదేవీలపై ఇక ఛార్జీలా?
Image Credit : Gemini AI

యూపీఐ లావాదేవీలపై ఇక ఛార్జీలా?

UPI Payments : భారతదేశంలో జరిగే డిజిటల్ చెల్లింపులకు యూపీఐ ఇప్పుడు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కోట్లాది మంది ప్రతిరోజూ దీన్ని వాడుతున్నారు… వందలు వేలు కాదు లక్షలకోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. రోడ్డుపక్కన కూరగాయలు అమ్మేవారి నుండి అంబానీ, అదానీ వంటివారు కూడా ఆర్థిక లావాదేవీలకు యూపిఐ వాడుతున్నారు.

అయితే ఇప్పటివరకు సామాన్యులు యూపిఐ ద్వారా జరిపే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు…. కానీ ఇకపై ఇలాగే ఉంటుందా? యూపీఐ ద్వారా డబ్బు పంపితే ఛార్జీలు పడతాయా? అనే ప్రశ్న చాలామందిలొ మొదలైంది. దీనికి కారణం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'చెల్లింపులు, పరిష్కార వ్యవస్థల చట్ట సవరణ బిల్లు (Taxation and Other Laws (Amendment) Bill, 2026)'. ఈ బిల్లులోని కొన్ని ప్రతిపాదనలు యూపీఐ వాడకంలో కొత్త మార్పులు తీసుకురావచ్చని వార్తలు వస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యూపిఐ పేమెంట్స్ పై సర్వీస్ చార్జీలుంటాయా?
Image Credit : Asianet News

యూపిఐ పేమెంట్స్ పై సర్వీస్ చార్జీలుంటాయా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సవరణ బిల్లుపు లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే యూపీఐ, రూపే ద్వారా జరిగే వ్యాపార (Merchant) లావాదేవీలపై 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (MDR) విధించేలా చట్టంలో మార్పును ప్రతిపాదించారు. 

ఏమిటీ MDR?

యూపిఐ ద్వారా సామాన్య ప్రజలు చేపట్టే పేమెంట్స్ కి ఎలాంటి ఛార్జీలు ఉండవు... కానీ కొందరు వ్యాపారులకు యూపిఐ సర్వీస్ అందించినందుకు బ్యాంకులు లేదా పేమెంట్స్ యాప్స్ కొంత ఛార్జ్ వసూలు చేస్తాయి. దీనిపై ఎండిఆర్ (మర్చంట్ డిస్కంట్ రేట్) అంటారు. ఇది యూపిఐ ద్వారా జరిగే పేమెంట్ ను బట్టి ఉంటుంది.

అయితే ప్రస్తుతం చాలా వరకు యూపీఐ లావాదేవీలు ఉచితంగానే జరుగుతున్నాయి. కానీ భవిష్యత్తులో కొన్ని రకాల వ్యాపార లావాదేవీలపై సర్వీస్ ఛార్జీలు వసూలు చేయడానికి చట్టపరమైన ఆధారాన్ని కల్పించడానికి కేంద్రం సవరణ బిల్లు తీసుకువస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Related Articles

Related image1
UPI: యూపీఐ పేమెంట్స్‌ ఇక ఫ్రీ కాదా? మోదీ సర్కార్ కీలక నిర్ణయం
Related image2
UPI Offline Payment: ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐతో మనీ ఎలా సెండ్ చేయాలో తెలుసా?
35
సాధారణ యూపిఐ పేమెంట్స్ పై నో ఛార్జెస్
Image Credit : Gemini AI

సాధారణ యూపిఐ పేమెంట్స్ పై నో ఛార్జెస్

అయితే సామాన్య ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి (P2P) యూపీఐ ద్వారా పంపే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. స్నేహితులు, బంధువులు లేదా కుటుంబ సభ్యులకు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా డబ్బు పంపడం ఎప్పటిలాగే ఉచితంగానే కొనసాగుతుంది. రోజువారీ చిన్న చిన్న ఖర్చులకు యూపీఐ వాడే సాధారణ కస్టమర్లపై ఈ మార్పు వల్ల ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం ఉండదు.

45
వ్యాపారులపై ప్రభావం..
Image Credit : Getty

వ్యాపారులపై ప్రభావం..

ఈ ప్రతిపాదన ప్రభావం ప్రధానంగా పెద్ద వ్యాపార సంస్థలపైనే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏడాదికి రూ.15 కోట్ల కంటే ఎక్కువ వ్యాపార ఆదాయం ఉన్న కంపెనీలు లేదా నిర్దిష్ట పరిమితికి మించిన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై మాత్రమే MDR ఛార్జీ విధించవచ్చని సమాచారం. అంతేకాకుండా రూ.2,000 దాటిన వ్యాపార యూపీఐ లావాదేవీలపై 0.2% నుంచి 0.3% వరకు MDR వసూలు చేయవచ్చనే వార్త కూడా ప్రచారంలో ఉంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక, తుది ప్రకటన వెలువడలేదు.

55
ఆందోళన వద్దు..
Image Credit : Gemini AI

ఆందోళన వద్దు..

అన్నింటికన్నా ముఖ్యంగా ఈ మార్పు ఇంకా అమల్లోకి రాలేదని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఇది లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లులోని ఒక ప్రతిపాదన మాత్రమే. పార్లమెంట్ ఆమోదం, ప్రభుత్వం తుది నిర్ణయం, ఎన్‌పీసీఐ జారీ చేసే అధికారిక మార్గదర్శకాల తర్వాతే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. అప్పటివరకు ప్రజలు వాడే సాధారణ యూపీఐ లావాదేవీల్లో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి అనవసరంగా గందరగోళ పడాల్సిన, భయపడాల్సిన అవసరం లేదు.

 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇష్ట‌మైన ఆహారం చూడ‌గానే, నోటిలో లాలాజ‌లం ఎందుకు వ‌స్తుంది.. దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే
Recommended image2
పశ్చిమ బెంగాల్‌లోని ఈ ప్రాంతాల్లో ఆగస్టు 18న స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు చేసుకుంటారు?
Recommended image3
Rare Trees: ప్రపంచంలో అత్యంత విచిత్రమైన 5 చెట్లు! ఎక్కడ ఉన్నాయో తెలుసా?
Related Stories
Recommended image1
UPI: యూపీఐ పేమెంట్స్‌ ఇక ఫ్రీ కాదా? మోదీ సర్కార్ కీలక నిర్ణయం
Recommended image2
UPI Offline Payment: ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐతో మనీ ఎలా సెండ్ చేయాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved