MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Snake : విషం లేని పాములు కూడా ప్రాణాలు తీయగలవు.. ఎలాగో తెలుసా?

Snake : విషం లేని పాములు కూడా ప్రాణాలు తీయగలవు.. ఎలాగో తెలుసా?

Snake : విషపూరిత పాాములు కరిస్తే ప్రాణాలు పోతాయి… ఇది అందరికీ తెలిసిందే. విషం లేని పాములు కరిసినా ప్రాణాలు పోతాయా..! ఇది చాలామందికి తెలియదు. విషం లేకున్నా పాములు ప్రాణాలు ఎలా తీస్తాయో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 23 2026, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విషంలేని పాములు ప్రాణాలు తీస్తాయా?
Image Credit : Gemini AI

విషంలేని పాములు ప్రాణాలు తీస్తాయా?

Snake : అన్ని పామలు విషపూరితమైనవి కావు... విషం లేని పాములు కూడా ఉంటాయి. అందుకే విషపూరిత పాములు కరిస్తే ప్రాణాపాయం ఉంటుంది కాబట్టి తొందరగా వైద్యం అందించాలి. విషం లేని పాములు (Non-venomous snakes) కాటువేస్తే ఏం కాదులే అని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో విషపూరిత సర్పాలే కాదు విషరహిత పాములు కూడా ప్రాణాలు తీయగలవు. పాము కాటు వేయడంవల్ల వెంటనే ప్రాణాలు పోకున్నా భవిష్యత్ లో మరణం సంభవించవచ్చు.

విషం లేని పాములు మనిషి ప్రాణాలు తీయడమేంటి? అని అనుకుంటున్నారా. అయితే విషరహిత సర్పాలు కరవడంవల్ల శరీరంలోకి విషం చేరదు... కాబట్టి నేరుగా వాటి వల్ల మరణం సంభవించదు... ఇది నిజమే. కానీ కొన్నిసార్లు విషం లేని పాముల వల్ల కూడా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. తీవ్రమైన భయంతో గుండెపోటు
Image Credit : Gemini AI

1. తీవ్రమైన భయంతో గుండెపోటు

పాము అంటే చాలామందికి భయం... అది విషం ఉన్నదైనా, లేనిదైనా. అందుకే పామును చూడగానే చాలామంది వణికిపోతుంటారు... ఇక కాటు వేసిందంటే అంతే సంగతి. ఈ భయాందోళన పాము విషం కంటే ప్రమాదకరం... అందుకే విషం లేని పాములు కరిచినా కొందరు ప్రాణాలు కోల్పోతుంటారు.

పాము కాటు వేయగానే విపరీతమైన భయం కలుగుతుంది... దీంతో శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ ఒకేసారి భారీగా విడుదలవుతుంది. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకుని కార్డియాక్ అరెస్ట్ (Cardiac Arrest) లేదా గుండెపోటు వచ్చి చనిపోయే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో పాము విషం కంటే ఈ భయమే ఎక్కువ ప్రమాదకరంగా మారుతుంది.

Related Articles

Related image1
Snake : కళ్లతో చూడక్కర్లేదు, ఈ వాసన వస్తే చాలు మీ ఇంట్లో పాము ఉన్నట్టే
Related image2
Snake : నీటిలో ఉండగా పాములు కాటు వేయలేవని అంటారు.. ఇందులో నిజమెంత?
36
2. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్
Image Credit : Gemini

2. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్

పాముల నోటిలో, పళ్ళపై రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. కాబట్టి విషంలేని పాము కరిచినప్పుడు కూడా ఆ గాయాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే బ్యాక్టీరియా రక్తంలోకి చేరుతుంది. దీనివల్ల తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ లేదా ధనుర్వాతం వంటివి వచ్చి ప్రాణాంతకంగా మారవచ్చు. కాబట్టి అది విష సర్పమైనా, విషం లేని సర్పమైనా కాటువేయగానే వైద్యం చేయించుకోవాలి.

46
3. పామును తప్పుగా గుర్తించినా ప్రాంణాంతకమే
Image Credit : Gemini AI

3. పామును తప్పుగా గుర్తించినా ప్రాంణాంతకమే

కరిచింది విషమున్న పామే అయినప్పటికీ, రూపంలో పోలికల వల్ల అది విషం లేని పాము అని పొరబడటం జరుగుతుంది. దీనివల్ల ఆసుపత్రికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తే సరైన సమయంలో యాంటీ వెనమ్ (Anti-venom) అందదు... దీంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

56
4. తీవ్రమైన అలెర్జీ (Anaphylaxis)
Image Credit : Gemini AI

4. తీవ్రమైన అలెర్జీ (Anaphylaxis)

చాలా అరుదుగా, పాము లాలాజలంలో ఉండే కొన్ని రకాల ప్రోటీన్ల వల్ల కొందరి శరీరంలో తీవ్రమైన అలెర్జిక్ రియాక్షన్ (Anaphylactic shock) రావచ్చు. ఇలా విషపూరితం కాని పాము కాటు వేసినప్పటికీ శరీరంలో తీవ్ర ప్రతిచర్యలు జరిగి ప్రాణాపాయం కలగవచ్చు.

66
5. ఉక్కిరిబిక్కిరి చేసి చంపే పాములు
Image Credit : AI Generated

5. ఉక్కిరిబిక్కిరి చేసి చంపే పాములు

అనకొండలు, పైథాన్ వంటి పాముల్లో విషం ఉండదు. కానీ అవి తమ పెద్ద ఆకారమే మనుషులను లేదా జంతువులను చంపడానికి ఉపయోగిస్తారు. ఇవి మనుషులు, జంతువులను చుట్టుముట్టి కండరాల బలం ద్వారా ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తాయి. కొన్నిసార్లు జంతువులను అమాంతం మింగేసి ప్రాణాలు తీస్తాయి.

ముఖ్య గమనిక

పాము కరిచినప్పుడు అది విషమున్నదా లేదా విషం లేనిదా అని సమయం వృధా చేయకుండా, ప్రశాంతంగా ఉంటూ వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్య సహాయం పొందడం అత్యంత సురక్షితం. గాయాన్ని శుభ్రమైన నీటితో కడిగి టిటానస్ (Tetanus) ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Telugu Saying: నమ్మినాను రామన్నా అంటే, నట్టేట ముంచుతానన్నాడట! ఈ సామెత ఏం చెప్తుందో తెలుసా?
Recommended image2
UK: యూకేలో కూరగాయలు, బియ్యం మరీ ఇంత ఖరీదా? కిలో ఎంతో తెలుసా? పాపం అక్కడ ఇండియన్స్ పరిస్థితి ఏంటి?
Recommended image3
Snakes: బ్రతికున్న పాము ఎంత ప్రమాదమో.. చనిపోయిన పాము కూడా అంతే ప్రమాదం.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Snake : కళ్లతో చూడక్కర్లేదు, ఈ వాసన వస్తే చాలు మీ ఇంట్లో పాము ఉన్నట్టే
Recommended image2
Snake : నీటిలో ఉండగా పాములు కాటు వేయలేవని అంటారు.. ఇందులో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved