MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Snake : నీటిలో ఉండగా పాములు కాటు వేయలేవని అంటారు.. ఇందులో నిజమెంత?

Snake : నీటిలో ఉండగా పాములు కాటు వేయలేవని అంటారు.. ఇందులో నిజమెంత?

మనం నీటిలో మునిగినప్పుడు వేగంగా కదలలేం.. నోరు తెరిస్తే కడుపులోకి నీళ్ళు చేరి ప్రాణాలుపోయే ప్రమాదం ఉంటుంది. సేమ్ ఇలాగే నీటిలోని పాముల పరిస్థితి ఉంటుందని.. అందుకే అవి నీటిలో ఉండగా కాటు వేయలేవని చాలామంది భావిస్తారు. నిజంగానే పాములు నీటిలో కాటు వేయలేవా?

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 21 2026, 03:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నీటిలో పాములు కాటు వేయగలవా?
Image Credit : Gemini AI

నీటిలో పాములు కాటు వేయగలవా?

నీటిలో పాములు కాటు వేయలేవనేది ఒక పెద్ద అపోహ మాత్రమే. వాస్తవానికి పాములు నేలపై ఎలాగైతే మనుషులను కాటేస్తాయో అలాగే నీటిలో కూడా కాటు వేయగలవు. సాధారణంగా పాములు తమను తాము రక్షించుకోవడానికి లేదా ఆహారాన్ని పట్టుకోవడానికి నీటిలోనూ కాటు వేస్తాయి. గత ఏడాది హైదరాబాద్‌లోని ఒక్క ఉస్మానియా హాస్పిటల్ లోనే నీటిలో పాము కాటుకు గురైన 10కి పైగా కేసులు నమోదయ్యాయి. దీన్నిబట్టి నీటిలో కూడా పాములు యాక్టివ్ గా ఉంటాయని అర్థమవుతోంది.

పాము నీటిలో కూడా నమ్మశక్యం కాని వేగంతో దాడి చేస్తుంది… దాని పదునైన దంతాలతో విషాన్ని ఎక్కించగలదు. కాబట్టి నీటిలో పాము  కాటు వేయదు అనే అపోహను నమ్మడం ప్రమాదకరం.. అది కనిపిస్తే చాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నీటి పాములు ఎన్ని రకాలు?
Image Credit : channelnewsasia/Instagram

నీటి పాములు ఎన్ని రకాలు?

సాధారణంగా రెండు రకాల నీటి పాములు ఉంటాయి.

  • మంచినీటి పాములు (freshwater snakes)
  •  సముద్ర పాములు (sea snakes).    

మంచినీటి పాములు సాధారణంగా విషపూరితమైనవి కావు, కానీ కొన్ని విషపూరితమైన పాములు కూడా నీటిలో నివసిస్తాయి. ఉదాహరణకు కోబ్రా, రస్సెల్స్ వైపర్ వంటి పాములు కూడా ఆహారం కోసం లేదా ప్రమాదం నుండి తప్పించుకోవడానికి నీటిలోకి వస్తాయి. సముద్ర పాములు దాదాపు అన్నీ విషపూరితమైనవి, వాటి విషం చాలా శక్తివంతమైనది.

35
నీటిలో పాములు కాటు వేయడానికి కారణమిదే?
Image Credit : Gemini

నీటిలో పాములు కాటు వేయడానికి కారణమిదే?

పాములు నీటిలో కాటు వేయడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి... ఒకటి రక్షణ, రెండోది ఆహారం. పాములకు ముప్పు వాటిల్లినప్పుడు అవి తమను తాము రక్షించుకోవడానికి కాటు వేస్తాయి. మనం అనుకోకుండా వాటిని తొక్కడం లేదా వాటికి దగ్గరగా వెళ్లడం వంటివి వాటిని రెచ్చగొట్టవచ్చు.

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు సముద్ర పాము కాటుకు తరచుగా గురవుతుంటారు, ఎందుకంటే అవి చేపల వలల్లో చిక్కుకుపోతాయి. అలాగే పాములు నీటిలో చేపలు, కప్పలు వంటి వాటిని వేటాడటానికి కూడా కాటు వేస్తాయి. అవి వేగంగా కదిలి తమ ఆహారాన్ని పట్టుకుంటాయి. ఈ ప్రవర్తన చాలా సహజం.

45
ప్రమాదకరమైన నీటి పాములను గుర్తించడం ఎలా?
Image Credit : Getty

ప్రమాదకరమైన నీటి పాములను గుర్తించడం ఎలా?

కనిపించే ప్రతి నీటి పాము ప్రమాదకరం కాదు. విషపూరితమైన పాములను సాధారణంగా వాటి తల ఆకారం, రంగు, ప్రవర్తన ద్వారా గుర్తించవచ్చు. ఉదాహరణకు సముద్ర పాములకు చదునైన, తెడ్డు ఆకారపు తోక ఉంటుంది, ఇది ఈత కొట్టడానికి అనుకూలంగా ఉంటుంది. నల్లటి మచ్చలు లేదా చారలు ఉన్న పాములు మరింత జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా విషపూరిత పాముల తల త్రిభుజాకారంలో ఉంటుంది. అయితే పాములను గుర్తించడానికి ప్రయత్నించడం కంటే వాటి నుండి దూరంగా ఉండటమే ఉత్తమం.

55
పాము కాటుకు ప్రథమ చికిత్స
Image Credit : Gemini AI

పాము కాటుకు ప్రథమ చికిత్స

పాము కాటు నీటిలో సంభవిస్తే, వెంటనే ప్రాథమిక చికిత్స అందించాలి. గాయాన్ని సబ్బు, నీటితో శుభ్రం చేయాలి. కాటు వేసిన శరీర భాగాన్ని కదలకుండా ఉంచి, వీలైనంత త్వరగా సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలి ప్రభుత్వ హాస్పిటల్స్ లో పాముకాటుకు విరుగుడు మందు ఉంటుంది... దీన్ని వెంటనే ఇవ్వడంద్వారా ప్రాణాలు కాపాడవచ్చు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో పాము కాటుకు ప్రత్యేక చికిత్సా విభాగం ఉంది... మరీ సీరియస్ అయితే ఇక్కడికి తరలించవచ్చు.

పాము కాటుకు గురైన వ్యక్తికి ధైర్యం చెప్పాలి, భయాన్ని తగ్గించాలి. కట్టు కట్టడం లేదా కోయడం వంటి పనులు చేయకూడదు. నీటిలో వెళ్ళేటప్పుడు, జాగ్రత్తగా ఉండాలి, నీటిలో అపరిచితులైన వస్తువులను తాకవద్దు. అవసరం లేకపోతే లోతైన నీటిలోకి వెళ్ళకపోవడం సురక్షితం. అప్రమత్తత చాలా అవసరం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేని దేశం.. మరి వాహనాలను ఎలా నియంత్రిస్తారో తెలుసా?
Recommended image2
Girls vs Boys: అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరు అందంగా ఉంటారు? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Recommended image3
చూడ్డానికి ఒకేలా ఉన్నా.. ఎస్కలేటర్, ట్రావెలేటర్ మధ్య తేడా ఏంటి.?
Related Stories
Recommended image1
Snakes : ఓ పాము ఇంకో పామును కరిస్తే ఏమవుతుంది?
Recommended image2
Snakes In Cars : వానాకాలంలో కార్లలోకి పాములు ఎందుకు వస్తాయి? రాకూడదంటే ఏం చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved