MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Significance of Temple Bells: గుడిలో గంట ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?

Significance of Temple Bells: గుడిలో గంట ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?

Significance of Temple Bells: హిందూ దేవాలయాల్లో గంట కొట్టడం తప్పకుండా ఉంటుంది. అయితే, ఎందుకు ఇలా చేస్తారు? గంట కొట్టడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యాలు, రామాయణ కాలం నాటి చారిత్రక ఆధారాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 10 2026, 02:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గుడిలో గంట కొడితే ఆ దుష్టశక్తులు పారిపోతాయా? గూస్ బంప్స్ తెప్పించే చరిత్ర
Image Credit : Gemini

గుడిలో గంట కొడితే ఆ దుష్టశక్తులు పారిపోతాయా? గూస్ బంప్స్ తెప్పించే చరిత్ర

సనాతన హిందూ ధర్మానికి వేల ఏళ్ల హిస్టరీ ఉంది. ఈ రోజు మనం చూస్తున్న పెద్ద పెద్ద టెంపుల్స్, అందులో విగ్రహాలు, పూజలు, గంటల నాదాలు అప్పట్లో ఎలా ఉండేవో అని చాలామందికి డౌట్ రావచ్చు. ప్రాచీన కాలం నుండి టెంపుల్స్ డిజైన్స్, అక్కడ జరిగే పూజల వెనుక బోలెడంత సైన్స్ దాగి ఉంది. 2019 నాటి లెక్కల ప్రకారం ఇండియాలో దాదాపు 5 లక్షలకు పైగా దేవాలయాలు ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఈ ఆధ్యాత్మిక వైభవాన్ని చూడటానికి వస్తుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గుడి గంటల వెనుక ఉన్న అసలైన సైన్స్ ఇదే
Image Credit : our own

గుడి గంటల వెనుక ఉన్న అసలైన సైన్స్ ఇదే

మనం గుడిలోకి వెళ్లగానే ఫస్ట్ చేసే పని గంట కొట్టడం. సంస్కృతంలో దీనిని ఘంటా అంటారు. కాంస్యఘంట, తాళ, ఘటిక, జయఘంటిక, క్షుద్రఘంట, క్రమ అని వీటిలో చాలా రకాలు ఉన్నాయని సంస్కృత సాహిత్యం చెబుతోంది. గంట కొట్టడం అంటే కేవలం దేవుడిని నిద్ర లేపడం కాదు, మనల్ని మనం అలర్ట్ చేసుకోవడం.

టెంపుల్ బెల్స్ మామూలు మెటల్స్‌తో చేయరు. వీటిని లెడ్, కాడ్మియం, కాపర్, జింక్, నికెల్, క్రోమియం, మాంగనీస్ వంటి లోహాలను సరైన నిష్పత్తిలో కలిపి తయారు చేస్తారు. దీనివల్ల వచ్చే సౌండ్ మన లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. ఈ నాదం విశ్వం పుట్టినప్పుడు వచ్చిన ఓం శబ్దంతో సమానంగా ఉంటుంది. ఇది చుట్టుపక్కల ఉండే నెగెటివ్ ఎనర్జీని పూర్తిగా దూరం చేస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

Related Articles

Related image1
India's Wettest Village: 365 రోజులూ వర్షం పడే ఇండియన్ విలేజ్.. అక్కడ గొడుగులు ఎందుకు వాడరో తెలిస్తే షాక్ అవుతారు !
Related image2
Most Expensive Coffee: ప్రపంచంలోనే కాస్ట్లీ కాఫీ.. తాగాలంటే కిడ్నీ అమ్మాల్సిందే! ధనవంతులు ఎందుకు లైన్ కడుతున్నారు?
35
రామాయణ కాలం నాటి ప్రూఫ్స్
Image Credit : Unsplash

రామాయణ కాలం నాటి ప్రూఫ్స్

హిందూ సంస్కృతిలో దేవాలయాలు, గంటల నాదాలకు రామాయణ కాలం నాటి ఆధారాలు ఉన్నాయి. దాదాపు 7 వేల సంవత్సరాల క్రితం, లంకపై దండయాత్రకు వెళ్లే ముందు శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్టించి గంటలు మోగిస్తూ పూజించినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే సీతాదేవి పెళ్ళికి ముందు గౌరీ దేవిని పూజించినట్లు ఆధారాలు ఉన్నాయి. అంటే అప్పట్లోనే ప్రత్యేక పూజా స్థలాలు ఉండేవని అర్థం అవుతోంది.

కంబోడియాలోని ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయమైన 'అంగ్ కోర్ వాట్' గోడలపై రామాయణ, మహాభారత ఘట్టాలు చెక్కి ఉన్నాయి. అలాగే శ్రీలంకలోని 'రామ్ సేతు' (ఆడమ్స్ బ్రిడ్జ్) రామాయణ కాలానికి అతిపెద్ద శాస్త్రీయ ఆధారం. అశోక వాటిక, సంజీవని పర్వతం కూడా దీనికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. త్రేతాయుగంలో ఇప్పటిలాంటి రాతి కట్టడాలు లేకపోయినా, అడవుల్లో ఋషుల ఆశ్రమాలు, యజ్ఞశాలలు ఉండేవి. అక్కడ నిరంతరం మంత్రోచ్ఛారణలు, గంటల నాదాలు మోగేవి.

45
ఆగమ శాస్త్రం.. సైకలాజికల్ సీక్రెట్స్
Image Credit : Unsplash

ఆగమ శాస్త్రం.. సైకలాజికల్ సీక్రెట్స్

ఆగమ శాస్త్రం ప్రకారం.. గుడిలో గంట కొట్టడం వల్ల యక్ష, పిశాచ, రాక్షస, బ్రహ్మరాక్షస వంటి దుష్టశక్తులు గుడిలోకి రాకుండా పారిపోతాయి."ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసామ్, కుర్వే ఘంటారవం తత్ర దేవతాహ్వాహ్న లక్షణమ్" అంటే దైవిక శక్తులను ఆహ్వానించడానికి, దుష్టశక్తులను తరిమికొట్టడానికి నేను గంట వాయిస్తున్నాను అని అర్థం.

సైకలాజికల్ పరంగా చూస్తే, గంట కొట్టినప్పుడు వచ్చే వైబ్రేషన్స్ మన మైండ్ లోని నెగెటివ్ ఆలోచనలను క్లియర్ చేస్తాయి. గర్భగుడిలోకి వెళ్లేటప్పుడు మన పూర్తి కాన్సంట్రేషన్ దేవుడిపైనే ఉండేలా చేస్తాయి. పక్కన వాళ్ళు మాట్లాడే అనవసర మాటలు మనకు వినపడకుండా ప్రశాంతతను ఇస్తాయి. దేవుడు ఎప్పుడూ మనల్ని ఆహ్వానిస్తూనే ఉంటాడు, గంట కొట్టడం అంటే దేవుడి పర్మిషన్ అడిగినట్లు అని భక్తుల నమ్మకం.

55
ఆరోగ్యానికి గుడి గంట ఎంతో మేలు
Image Credit : Twitter

ఆరోగ్యానికి గుడి గంట ఎంతో మేలు

టెంపుల్ బెల్ సౌండ్ వల్ల బాడీకి, మైండ్‌కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. గంట కొట్టగానే వచ్చే షార్ప్ సౌండ్ కనీసం 7 సెకన్ల పాటు ఎకో అవుతుంది. ఇది మన బాడీలోని 7 హీలింగ్ సెంటర్స్ లేదా చక్రాలను యాక్టివేట్ చేస్తుంది. బ్రెయిన్ లోకి ఈ సౌండ్ వెళ్లగానే మైండ్ అంతా ఖాళీ అయిపోయి రిలాక్స్డ్ గా మారుతుంది.

  • చక్రాల యాక్టివేషన్: శరీరంలోని ప్రధాన చక్రాలను స్టిమ్యులేట్ చేస్తుంది.
  • బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్‌మెంట్: ఎడమ, కుడి బ్రెయిన్ భాగాలను సమన్వయం చేస్తుంది.
  • మెంటల్ అలర్ట్‌నెస్: ఆలోచనల్లో క్లారిటీ తెచ్చి, కాన్సంట్రేషన్ పెంచుతుంది.
  • నెగెటివిటీ దూరం: ఒత్తిడి, ఆందోళనను తగ్గించి పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది.
  • వాతావరణ శుద్ధి: గంట శబ్దం వల్ల వచ్చే వైబ్రేషన్స్ చుట్టుపక్కల వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ లను నాశనం చేసి ఎన్విరాన్మెంట్‌ను ప్యూర్ గా మారుస్తాయి.
  • అందుకే రోజూ గుడికి వెళ్లడం, గంట కొట్టడం వల్ల మన మనసుకు, ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని చాలా మంది నమ్మకం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
10 Largest Hindu Temples: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుంది? టాప్ 10 భారీ ఆలయాలు ఇవే
Recommended image2
Railways Luggage Rules : ఏ క్లాస్ ప్రయాణికులు ఎంత లగేజ్ తీసుకెళ్లవచ్చు..? రైల్వే రూల్స్ ఇవే
Recommended image3
Train Horn Meaning: ట్రైన్ హారన్ వెనుక ఇంత అర్థముందా? ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Related Stories
Recommended image1
India's Wettest Village: 365 రోజులూ వర్షం పడే ఇండియన్ విలేజ్.. అక్కడ గొడుగులు ఎందుకు వాడరో తెలిస్తే షాక్ అవుతారు !
Recommended image2
Most Expensive Coffee: ప్రపంచంలోనే కాస్ట్లీ కాఫీ.. తాగాలంటే కిడ్నీ అమ్మాల్సిందే! ధనవంతులు ఎందుకు లైన్ కడుతున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved