MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Feature
  • India's Wettest Village: 365 రోజులూ వర్షం పడే ఇండియన్ విలేజ్.. అక్కడ గొడుగులు ఎందుకు వాడరో తెలిస్తే షాక్ అవుతారు !

India's Wettest Village: 365 రోజులూ వర్షం పడే ఇండియన్ విలేజ్.. అక్కడ గొడుగులు ఎందుకు వాడరో తెలిస్తే షాక్ అవుతారు !

India's Wettest Village : ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే గ్రామం మన ఇండియాలోనే ఉంది. అదే మేఘాలయలోని 'మావ్సిన్‌రామ్. అయితే, 365 రోజులు వర్షం పడినా అక్కడ గొడుగులు మాత్రం ఉపయోగించరు. ఈ గ్రామం ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 08 2026, 09:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
365 రోజులు వానలే వానలు.. అసలు ఏమిటీ మావ్సిన్‌రామ్ మ్యాజిక్?
Image Credit : Gemini

365 రోజులు వానలే వానలు.. అసలు ఏమిటీ మావ్సిన్‌రామ్ మ్యాజిక్?

మన ఊర్లో రెండు రోజులు గ్యాప్ లేకుండా వర్షం పడితేనే చాలు.. అబ్బా ! ఏంట్రా ఈ వాన అంటూ విసిగిపోతాం. కానీ, సంవత్సరంలో 365 రోజులూ ఏదో ఒక రూపంలో వర్షం పడుతూనే ఉండే ఊరు ఒకటి మన ఇండియాలోనే ఉందంటే నమ్ముతారా? అవును, మేఘాలయ రాష్ట్రంలోని మావ్సిన్‌రామ్ (Mawsynram) అనే చిన్న గ్రామంలో ప్రకృతి చేసే వింతలు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే.

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా మనకు చిరపుంజి మాత్రమే తెలుసు. కానీ, ఇప్పుడు ఆ రికార్డును మావ్సిన్‌రామ్ బ్రేక్ చేసింది. చిరపుంజికి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామం, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత తేమతో కూడిన ప్రాంతంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకెక్కింది. కానీ, ఇక్కడ గొడుగులు ఉపయోగించరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గిన్నిస్ రికార్డుల కెక్కిన వాన.. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోత వర్షం
Image Credit : Gemini

గిన్నిస్ రికార్డుల కెక్కిన వాన.. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోత వర్షం

భౌగోళికంగా చూస్తే మావ్సిన్‌రామ్ గ్రామం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 1,491 మీటర్ల ఎత్తులో తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఏడాదికి సగటున 11,871 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. సాధారణ ప్రాంతాల్లో ఒక ఏడాది మొత్తం కురిసే వర్షం, ఈ విలేజ్‌లో జస్ట్ ఒక్క వారంలోనే కురిసేస్తుంది. ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు వచ్చే మాన్సూన్ సీజన్‌లో ఇక్కడ వానలు దంచికొడతాయి. బంగాళాఖాతం నుండి వచ్చే తేమతో కూడిన రుతుపవన గాలులు ఇక్కడి ఖాసీ కొండలను ఢీకొట్టడం వల్లే ఇక్కడ ఇంత భారీగా వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

35
ఈ ఊర్లో గొడుగులు ఎందుకు పని చేయవు?
Image Credit : Gemini

ఈ ఊర్లో గొడుగులు ఎందుకు పని చేయవు?

ఇంత భారీ వర్షాలు పడే చోట ప్రతి ఒక్కరి చేతిలో గొడుగు ఉండాలి కదా? కానీ ఈ గ్రామంలో ఎవ్వరూ గొడుగులు వాడరు. ఎందుకంటే మావ్సిన్‌రామ్‌లో కేవలం వర్షమే కాదు, కొండల మధ్య నుండి విపరీతమైన వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. అలాంటి గాలుల్లో మనం మామూలుగా వాడే గొడుగులు పట్టుకుంటే, అవి కాసేపు కూడా తట్టుకోలేవు. క్షణాల్లో రివర్స్ అయిపోయి, విరిగిపోయి గాల్లో ఎగిరిపోతాయి.

పైగా ఇక్కడి స్థానిక ఖాసీ తెగ ప్రజలు ఎక్కువగా వ్యవసాయం, తోటల పెంపకం పనులపైనే ఆధారపడి జీవిస్తారు. పొలాల్లో బురదలో పని చేసేటప్పుడు ఒక చేత్తో గొడుగు పట్టుకుని, ఇంకో చేత్తో పని చేయడం సాధ్యం కాదు కదా. అందుకే వీరు గొడుగులకు గుడ్ బై చెప్పేసి, ఒక అద్భుతమైన దేశీ ఐడియాతో తమను తాము కాపాడుకుంటున్నారు.

45
క్నుప్స్ కథే వేరు.. తాబేలు వీపు లాంటి క్రేజీ వాన కవచం ఇది
Image Credit : Gemini

క్నుప్స్ కథే వేరు.. తాబేలు వీపు లాంటి క్రేజీ వాన కవచం ఇది

గొడుగులు ఫెయిల్ అయిన చోట స్థానికులు కనిపెట్టిన పర్యావరణ అనుకూల ఆయుధమే క్నుప్స్. చూడటానికి ఇది అచ్చం ఒక పెద్ద తాబేలు వీపు పెంకు లాగా కనిపిస్తుంది. స్థానికంగా దొరికే వెదురు బద్దలు, అడవిలో లభించే దట్టమైన ఆకులను ఉపయోగించి చేతితో దీనిని అల్లుతారు.

దీనిని రెయిన్‌కోట్‌లాగా ఒంటికి తగిలించుకుంటే తల నుండి మోకాళ్ల వరకు శరీరం మొత్తం కవర్ అయిపోతుంది. చేతులతో పట్టుకోవాల్సిన అవసరం వుండదు. రైతులు హ్యాపీగా పొలం పనులు చేసుకోవచ్చు. తాబేలు చిప్ప ఆకారంలో ఉండటం వల్ల ఎంత పెద్ద గాలి వీచినా ఇది అస్సలు పాడవదు, గాలికి కొట్టుకుపోదు.

55
ప్రకృతితో దోస్తీ.. వాన పడినా ఆగని లైఫ్ స్టైల్
Image Credit : Gemini

ప్రకృతితో దోస్తీ.. వాన పడినా ఆగని లైఫ్ స్టైల్

నిత్యం వర్షం పరిస్థితులకు అలవాటుపడిన ప్రజలు ప్రకృతితో దోస్తీ చేస్తూ తమ లైఫ్ స్టైల్ ను కొనసాగిస్తున్నారు. వాన పడుతున్నా క్నుప్స్ తగిలించుకుని తమ పనులు పూర్తి చేసుకుంటారు. ఇక్కడి ఇళ్లకు పెంకులు గానీ, గడ్డి గానీ వాడితే ఆ వర్షానికి కొట్టుకుపోతాయని, అందరూ మందపాటి రేకుల షీట్లను మాత్రమే పైకప్పులుగా వాడుతుంటారు. ఇక్కడ నేల చాలా సారవంతంగా ఉండటం వల్ల తేయాకు, నారింజ వంటి తోటలను స్థానిక రైతులు సాగు చేస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
భారత దేశం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Foil: సిల్వర్ ఫాయిల్ వెజిటేరియనేనా? FSSAI ఏం చెబుతోంది?
Recommended image2
KBC : అధ్యక్షులు, ప్రధాని, స్పీకర్ ముగ్గురూ మహిళలే గల దేశమేది? ఆన్సర్ చెబితే కోటి రూపాయలు..!
Recommended image3
Snakes : రాగి పాత్రలు కనిపిస్తే చాలు పాములు పరిగెత్తుకొస్తాయా? ఎందుకో చెప్పిన సద్గురు
Related Stories
Recommended image1
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Recommended image2
Google Messages New Feature: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. గూగుల్ తీసుకొచ్చిన ట్యాప్ టు డ్రాఫ్ట్ ఫీచర్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved