MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • World's Largest Milk Producer: పాల ఉత్పత్తిలో ప్రపంచ నంబర్ 1 స్థాయికి.. ఎలా ఎదిగింది?

World's Largest Milk Producer: పాల ఉత్పత్తిలో ప్రపంచ నంబర్ 1 స్థాయికి.. ఎలా ఎదిగింది?

Milk: ఒకప్పుడు పాల కొరతతో ఇబ్బంది పడిన భారత్.. నేడు ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే దేశంగా ఎలా మారింది? విదేశీ పాల పొడిపై ఆధారపడిన స్థాయి నుంచి ప్రపంచ నంబర్ వన్‌గా ఎలా ఎదిగింది?. ఆ కథేంటో తెలుసుకుందాం.

3 Min read
Author : Nandini Arava
Published : Nov 26 2026, 06:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాల ఉత్పత్తిలో ప్రపంచ నంబర్ 1 స్థాయికి..
Image Credit : chatgptతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

పాల ఉత్పత్తిలో ప్రపంచ నంబర్ 1 స్థాయికి..

ఒకప్పుడు దేశంలో ప్రజలకు సరిపడా పాలు కూడా అందుబాటులో లేని పరిస్థితి. పాల పొడి కోసం విదేశాల నుంచి వచ్చే విరాళాలపై ఆధారపడాల్సిన దుస్థితి. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారత్ నిలిచింది. ప్రపంచ పాల ఉత్పత్తిలో దాదాపు నాలుగో వంతు మన దేశం నుంచే వస్తోంది. ఇది ఒక్కరోజులో సాధ్యపడలేదు. లక్షలాది మంది పాడి రైతుల కష్టం, సహకార సంఘాల ఏర్పాటు, ప్రభుత్వ ప్రణాళికలు, డాక్టర్ వర్గీస్ కురియన్ దూరదృష్టి కలిసి భారతదేశంలో శ్వేత విప్లవానికి బాటలు వేశాయి. అసలు పాల కొరత ఉన్న దేశం ప్రపంచంలోనే అగ్రస్థానానికి ఎలా చేరుకుంది? ఈ ప్రయాణంలో అమూల్, ఆపరేషన్ ఫ్లడ్ పాత్ర ఏమిటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాల కొరత నుంచి ప్రపంచ అగ్రస్థానం వరకు
Image Credit : chatgptతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

పాల కొరత నుంచి ప్రపంచ అగ్రస్థానం వరకు

మన ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం టీ నుంచి రాత్రి భోజనంలో పెరుగు వరకు ఎన్నో రూపాల్లో పాలను వాడుతుంటాం. పన్నీర్, నెయ్యి, వెన్న, స్వీట్లలో పాలదే కీలక పాత్ర. అయితే ఒకప్పుడు దేశంలో ఇంతటి ఉత్పత్తి లేదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1998లో అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా భారత్ అవతరించింది. ఈ మార్పు వెనుక ప్రధానంగా నిలిచిన వ్యక్తి డాక్టర్ వర్గీస్ కురియన్. భారతదేశ శ్వేత విప్లవ పితామహుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన జయంతి సందర్భంగా నవంబర్ 26ను జాతీయ పాల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

గుజరాత్‌లోని ఓ చిన్న పట్టణం నుంచి మొదలైన మార్పు భారత పాల విప్లవానికి పునాది గుజరాత్‌లోని ఆనంద్ పట్టణంలో పడింది. అమూల్ బ్రాండ్ వెనుక ఉన్న అసలు బలం రైతుల సహకార వ్యవస్థ. అప్పట్లో పాల ఉత్పత్తి చేసే రైతులు తమకు గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. మధ్యవర్తుల వల్ల వచ్చిన ఆదాయంలో రైతులకు తక్కువ వాటా దక్కేది. ఈ పరిస్థితిని మార్చేందుకు రైతులంతా కలిసి సహకార సంఘంగా ఏర్పడి పాలు సేకరించడం, ప్రాసెస్ చేయడం, మార్కెటింగ్ చేయడం ప్రారంభించారు. దీంతో రైతులకు నేరుగా మార్కెట్‌తో అనుసంధానం ఏర్పడింది. పాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలోనూ వారికి మెరుగైన వాటా దక్కే అవకాశం కలిగింది.

అమూల్ అభివృద్ధిలో డాక్టర్ వర్గీస్ కురియన్‌తో పాటు హరిచంద్ మేఘా దలాయా కీలక పాత్ర పోషించారు. గేదె పాల నుంచి స్కిమ్డ్ మిల్క్ పౌడర్ తయారు చేసే విధానాన్ని అభివృద్ధి చేశారు. అప్పటివరకు పెద్ద కంపెనీలు ప్రధానంగా ఆవు పాలనే ఉపయోగించేవి. గేదె పాలతోనూ పాల పొడి తయారు చేయడం అమూల్‌కు ప్రత్యేక ప్రయోజనాన్ని అందించింది.

35
భారత్‌లో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే రాష్ట్రాలివే
Image Credit : chatgptతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

భారత్‌లో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే రాష్ట్రాలివే

ప్రస్తుతం దేశంలోని పాల సహకార సంఘాల నెట్‌వర్క్ సుమారు 2.45 లక్షల గ్రామాలకు విస్తరించింది. పాల ఉత్పత్తిలో యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర. ఈ ఐదు రాష్ట్రాల నుంచే దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం పాలలో సగానికి పైగా వస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 248 మిలియన్ టన్నుల పాలను ఉత్పత్తి చేసింది. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇది దాదాపు 70 శాతం ఎక్కువ. దేశంలో పాల ఉత్పత్తి ఎంత వేగంగా పెరిగిందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

భారత పాల విప్లవంలో మహిళల పాత్ర ఎంతో కీలకం

భారత డెయిరీ రంగం విజయానికి గ్రామీణ మహిళల కృషి కూడా ప్రధాన కారణం. దేశంలోని డెయిరీ రంగ కార్మికుల్లో దాదాపు 70 శాతం మంది మహిళలే ఉన్నారు. ఇప్పుడు మహిళలు కేవలం పాడి పనులకే పరిమితం కాకుండా వ్యాపార నిర్వహణలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. NDDB డెయిరీ సర్వీసెస్ సహకారంతో ఏర్పాటైన 25 మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లలో 18 పూర్తిగా మహిళలతోనే ఏర్పాటయ్యాయి. వాటి బోర్డుల్లోనూ మహిళా ప్రతినిధులే కొనసాగుతున్నారు. దీనివల్ల గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబనతో పాటు నాయకత్వ అవకాశాలు కూడా లభిస్తున్నాయి.

45
విదేశీ పాల పొడితో మొదలై.. స్వయం సమృద్ధి దిశగా ప్రయాణం
Image Credit : gemini ai తో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

విదేశీ పాల పొడితో మొదలై.. స్వయం సమృద్ధి దిశగా ప్రయాణం

1970 జనవరిలో నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (NDDB) ఆధ్వర్యంలో ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమం ప్రారంభమైంది. దీనికి డాక్టర్ వర్గీస్ కురియన్ నాయకత్వం వహించారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారత్ పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు చేపట్టిన ఈ ప్రయాణం విదేశాల నుంచి వచ్చిన పాల ఉత్పత్తుల విరాళాలతో మొదలైంది. యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ (EEC) ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) ద్వారా స్కిమ్డ్ మిల్క్ పౌడర్, బటర్ ఆయిల్‌ను భారత్‌కు విరాళంగా అందించింది.

వాటిని దేశంలో విక్రయించి వచ్చిన డబ్బును పాల పరిశ్రమ అభివృద్ధికి వినియోగించారు. గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం, శీతలీకరణ సదుపాయాలు కల్పించడం, ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మించడం వంటి పనులు చేపట్టారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ప్రతిరోజూ పాలు విక్రయించేందుకు ఒక స్థిరమైన మార్కెట్ ఏర్పడింది. ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమం 1996 వరకు కొనసాగింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తి, సేకరణ, పంపిణీ వ్యవస్థలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. దాని ఫలితంగానే రెండేళ్ల తర్వాత అంటే 1998లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించింది.

55
రెండో శ్వేత విప్లవం దిశగా భారత్
Image Credit : AI Image

రెండో శ్వేత విప్లవం దిశగా భారత్

ఆపరేషన్ ఫ్లడ్ ప్రారంభమై ఐదు దశాబ్దాలు దాటినా భారత డెయిరీ రంగంలో అభివృద్ధి కొనసాగుతూనే ఉంది. ఇంకా దేశంలోని కొన్ని గ్రామాల్లో రైతులకు పాల సహకార సంఘాల సదుపాయాలు అందుబాటులో లేవు. అలాంటి ప్రాంతాల్లోనూ పాల సేకరణ వ్యవస్థను విస్తరించి రైతులను వ్యవస్థీకృత మార్కెట్‌తో అనుసంధానించాలనే లక్ష్యంతో 2024 డిసెంబర్‌లో వైట్ రివల్యూషన్ 2.0 (White Revolution 2.0) కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరోవైపు భారత పాల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఆదరణ పెరుగుతోంది. యూఏఈ, సౌదీ అరేబియా, అమెరికా, భూటాన్ వంటి దేశాలకు భారతీయ డెయిరీ ఉత్పత్తులు చేరుతున్నాయి. ఒకప్పుడు దేశంలో పాల కొరతను అధిగమించేందుకు విదేశీ విరాళాలపై ఆధారపడిన భారత్.. నేడు ప్రపంచ పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
భారత దేశం
 
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
12 నెలలు కాదు, ఈ దేశంలో ఏడాదికి 13 నెలలు.. అస‌లు కార‌ణం ఏంటంటే?
Recommended image2
Pakistani Products : భారతీయులు వాడే ఈ వస్తువులు పాక్ నుండి వస్తాయా..!
Recommended image3
Budget Trip : విమానాలు, బస్సుల్లో కాదు.. రైలులో తక్కువ బడ్జెట్లోనే వెళ్లగలిగే హిల్ స్టేషన్స్ ఇవే
Related Stories
Recommended image1
Madhya Pradesh: ఇక ఎంత తాగినా బెంగ లేదు
Recommended image2
Hair Growth: జుట్టు బారుగా, ఒత్తుగా పెరగాలంటే..మీరు తినే ఫుడ్ లో ఇదొక్కటి పెడితే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved