MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Salary: అమెరికాలో నెలకు 5 లక్షల పైన సంపాదిస్తే ఎంత మిగులుతుంది? ఖర్చులు ఎలా ఉంటాయో తెలుసా?

Salary: అమెరికాలో నెలకు 5 లక్షల పైన సంపాదిస్తే ఎంత మిగులుతుంది? ఖర్చులు ఎలా ఉంటాయో తెలుసా?

Salary: సంపాదన కోసం ఎగిరి గంతేస్తూ.. అమెరికా ప్లైట్ ఎక్కేస్తుంటారు చాలామంది ఇండియన్స్. మన వాళ్లే కాదు చాలా దేశాల నుంచి అమెరికా వెళ్లేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే అక్కడ జీతం, ఖర్చులు ఎంత ఉంటాయి. ఎంత సంపాదిస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 28 2026, 08:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సంపాదన కోసం అమెరికాకు యువత..
Image Credit : Gemini AI

సంపాదన కోసం అమెరికాకు యువత..

ఇండియాతో పాటు చాలా దేశాల్లో యువత అమెరికాకు వెళ్లి సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. అక్కడ పార్టైమ్ జాబ్ చేసుకుని బ్రతికేవారు కూడా చాలా ఎక్కువమంది ఉన్నారు. యూఎస్ వెళ్తే చేతినిండా సంపాదించుకోవచ్చు అని ఆశపడుతుంటారు. కానీ అక్కడ ఖర్చుల గురించి చాలామంది ఆలోచించరు. అమెరికాలో నెలకు 5 లక్షల రూపాయలు ($6,000 డాలర్లు) సంపాదిస్తున్నారంటే మనదేశంలో అది చాలా పెద్ద మొత్తంగా కనిపిస్తుంది. కానీ, డాలర్లలో సంపాదిస్తూ డాలర్లలోనే ఖర్చు చేసేటప్పుడు అమెరికా లైఫ్‌స్టైల్ ఎంత ఖరీదైనదో అర్థమవుతుంది. నెలకు $6,000 గ్రాస్ శాలరీ (పన్నులకు ముందు) వచ్చే ఒక భారతీయుడి నెలవారీ ఖర్చులు ఎలా ఉంటాయో తెలుసా? NRI యూట్యూబర్స్ చెప్పిన సమాచారంతో పాటు. ఇతర సమాచారాల ప్రకారం చూసుకుంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పన్నులు (Income Taxes): ఖర్చుల్లో మొదటి కోత
Image Credit : Gemini AI

పన్నులు (Income Taxes): ఖర్చుల్లో మొదటి కోత

అమెరికాలో బ్రతకడానికి వెళ్తే.. సాఫ్ట్ వేర్ అయినా.. డాక్టరైనా, కూలిపని చేసినా.. పన్నులు కట్టాల్సిందే. వారి వారి సంపాదన బట్టి పన్నులు ఎక్కువ, తక్కువ ఉంటాయి. ముఖ్యంగా జీతం రాగానే ఫెడరల్, స్టేట్ తో పాటు సోషల్ సెక్యూరిటీ టాక్సులు కలిపి సుమారు 20% నుండి 25% వరకు కట్ అవుతాయి. ఇదే జీతం తీసుకునేవారి మొదటి కోత. ఉదాహరణకి జీతం మొత్తం 6,000 డాలర్లు సుమారుగా అనుకుంటే పన్నులు పోగా చేతికి సుమారు 4,500 నుండి 4,800 డాలర్లు అంటే 4 లక్షల 60 వేలు మాత్రమే చేతికి వస్తాయి.

Related Articles

Related image1
America Food: అమెరికాలో ఆడవారు ప్రతిరోజూ వంట చేయరా? అమెరికన్ లైఫ్‌స్టైల్ తో పాటు ఇండియన్స్ ఏం తింటారో తెలుసా?
Related image2
UK: యూకేలో కూరగాయలు, బియ్యం మరీ ఇంత ఖరీదా? కిలో ఎంతో తెలుసా? పాపం అక్కడ ఇండియన్స్ పరిస్థితి ఏంటి?
36
ఇంటి రెంటు & యుటిలిటీస్ (Housing & Utilities)
Image Credit : Gemini AI

ఇంటి రెంటు & యుటిలిటీస్ (Housing & Utilities)

ఖర్చుల్లో అతిపెద్ద భాగం ఇంటి అద్దెకే పోతుంది. కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి ప్రదేశాల్లో ఒంటరిగా ఉంటే 1BHK అద్దె 1,800 నుంచి 2,500 డాలర్ల వరకు ఉంటుంది. అంటే దాదాపు 2 లక్షల పైనే అద్దె ఉంటుంది. అయితే ఇంటి అద్దె అనేది ఏరియాను బట్టి మారుతుంది. సిటీలకు దూరంగా తీసుకుంటే 50 వేలలో ఇల్లు దొరుకుతుంది. ఇక యుటిలిటీస్ విషయానికి వస్తే.. కరెంట్, గ్యాస్, వాటర్, వైఫై బిల్లులు కలిపి నెలకు 300 డాలర్ల వరకూ ఖర్చు అవ్వచ్చు. అంటే దాదాపు 28 వేల వరకూ ఖర్చు ఉంటుంది.

46
ఫుడ్డు, గ్రాసరీస్ సంగతేంటి?
Image Credit : Gemini AI

ఫుడ్డు, గ్రాసరీస్ సంగతేంటి?

ఇక అమెరికాలో తిండి సంగతికి వస్తే.. అక్కడ బయట తింటే కాస్ట్ అదిరిపోతుంది. ఇంట్లో వండుకుని తిన్నా ఎక్కువ అవుతుంది. కానీ ఇంటి పుడ్ కు కాస్త తక్కువ కాస్ట్ అవుతుంది. కానీ మన ఇండియాన్స్ అయితే కిరాణా, కూరగాయలకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అక్కడ కూరగాయలు, బియ్యం లాంటి వాటి రేటు మండిపోతుంటుంది. ఇక ఇంట్లో వండుకుని తింటే దాదాపు 500 డాలర్లు అంటే కొంచెం అటు ఇటుగా 50 వేల వరకూ ఖర్చు వస్తుంది. ఇక వారానికి ఒకసారి బయట ఇండియన్ రెస్టారెంట్‌లో తిన్నా లేదా గ్రాసరీ డెలివరీస్ వాడినా మరో 20 వేల వరకూ ఖర్చు అదనంగా అవుతుంది.

56
కార్ ఈఎమ్‌ఐ & ఇన్సూరెన్స్ (Transport & Insurance)
Image Credit : Gemini AI

కార్ ఈఎమ్‌ఐ & ఇన్సూరెన్స్ (Transport & Insurance)

ఇక అమెరికాలో కాస్త ఎక్కువ సపాదించేవారు, లేదా దూరంగా ఆఫీస్ లు ఉన్నవారికి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అంతే కాదు అమెరికాలో చాలా నగరాల్లో కారు తప్పనిసరి. కారు EMI, గ్యాస్ తో పాటు ఆ కారు ఇన్సూరెన్స్ కలిపి ప్రతినెల 700 డాలర్లు అంటే 65 నుంచి 70 వేల వరకూ ఖర్చు అవుతుంది. ఇది కారు ఉన్నవారికి మాత్రమే. అది కూడా వారు కొన్న కారును బట్టి మారుతుంది. ఇక అమెరికా లాంటి దేశాల్లో వైద్యం ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ ప్రతీ ఒక్కరు తిన్నా తినకపోయినా.. పక్కాగా ఇన్సురెంట్ చేయించుకుంటారు. కంపెనీ ఇన్సూరెన్స్ ఇచ్చినా అవుట్-ఆఫ్-పాకెట్ పేమెంట్స్, ఫోన్ బిల్లులు, షాపింగ్, వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 60 వేల వరకు పక్కన పెట్టాల్సిందే.

66
వచ్చే జీతంలో సేవింగ్స్ మాట ఏంటి?
Image Credit : Gemini AI

వచ్చే జీతంలో సేవింగ్స్ మాట ఏంటి?

అమెరికాలో నెలకు 5 లక్షలు పైన సంపాదించినా.. ఖర్చులు ఎక్కువగా ఉండటంతో సేవింగ్స్ తక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ లెక్కలన్నీ ఆ వ్యక్తి అలవాట్లు, ఖర్చులను బట్టి మారుతుంటాయి. ఎక్కువ సేవింగ్స్ చేయవచ్చు. లేదా ఖర్చు కూడా ఎక్కువ అవ్వచ్చు.  వ్యక్తి సింగిల్‌గా ఉంటే నెలకు 500 - 1,000 డాలర్లు.. అంటే 40,000 నుంచి 80,000 మాత్రమే పొదుపు చేయగలడు. అదే కుటుంబంతో కలిసి ఉంటే లేదా ఖరీదైన నగరాల్లో ఉంటే పైసలు మిగలడం కష్టమే. అమెరికాలో జీతం ఎంత ఎక్కువో, జీవన వ్యయం (Cost of Living) కూడా అంతే సమానంగా ఉంటుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Facts : హైవేలపై సైన్‌బోర్డులు ఆకుపచ్చ రంగులోనే ఎందుకుంటాయో తెలుసా?
Recommended image2
Telugu Saying: పొట్టివాడిని పొడుగువాడు కొడితే, పొడుగువాడిని పోచమ్మ కొట్టిందట! సామెత అసలు కథ ఇదే!
Recommended image3
Pani Puri: పానీపూరీ కనిపెట్టింది.. మహా భారతంలో ద్రౌపది..? ఈ కథ మీకు తెలుసా?
Related Stories
Recommended image1
America Food: అమెరికాలో ఆడవారు ప్రతిరోజూ వంట చేయరా? అమెరికన్ లైఫ్‌స్టైల్ తో పాటు ఇండియన్స్ ఏం తింటారో తెలుసా?
Recommended image2
UK: యూకేలో కూరగాయలు, బియ్యం మరీ ఇంత ఖరీదా? కిలో ఎంతో తెలుసా? పాపం అక్కడ ఇండియన్స్ పరిస్థితి ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved