MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Feature
  • America Food: అమెరికాలో ఆడవారు ప్రతిరోజూ వంట చేయరా? అమెరికన్ లైఫ్‌స్టైల్ తో పాటు ఇండియన్స్ ఏం తింటారో తెలుసా?

America Food: అమెరికాలో ఆడవారు ప్రతిరోజూ వంట చేయరా? అమెరికన్ లైఫ్‌స్టైల్ తో పాటు ఇండియన్స్ ఏం తింటారో తెలుసా?

America Food: అమెరికాలో రోజు వంట చేసుకోరా? బిజీ బిజీ లైఫ్ స్టైల్ లో డైలీ ఏం తింటారు? వేడీ వేడీ అన్నం కూరలు ఎలాగు ఉండవు, వంట చేసుకోకుండా ఏం తిని బ్రతుకుతారు. అక్కడ దొరికే రెడీ మెడ్ ఫుడ్స్ గురించి మీకు తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 22 2026, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అమెరికాలో ఆడవారు ప్రతిరోజూ వంట చేయరా?
Image Credit : Gemini AI

అమెరికాలో ఆడవారు ప్రతిరోజూ వంట చేయరా?

అమెరికా జీవితం అనగానే మనదేశంలో చాలామందికి వచ్చే సందేహం "అక్కడ ప్రతిరోజూ వంట చేయరా? ఏం తిని బ్రతుకుతారు. చాలా సినిమాల్లో మాటికి ఫ్రిజ్‌ ఓపెన్ చేస్తుంటారు. అలా ఫ్రీజ్ లలో పెట్టి వారాల తరబడి తింటారా?" ఈ వియంలో చాలామంది NRI యూట్యూబర్లు తమ అనుభవాలను పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. అంతే కాదు అమెరికన్స్ అధికారిక జీవనశైలి కి కారణాలు ఏంటి? వాళ్లు ఏం తింటారు ఎలా ఉంటారు అనే విషయాలను చాలామంది యూట్యూబ్ వీడియోస్ ద్వారా చెప్పుకొచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అమెరికన్స్ రోజువారీ వంట చేసుకోకపోవడానికి కారణాలు
Image Credit : Gemini AI

అమెరికన్స్ రోజువారీ వంట చేసుకోకపోవడానికి కారణాలు

అమెరికాలో ప్రతిరోజూ తాజా వంట చేయడం చాలా అరుదు. వేడి వేడిగా ఫుడ్ చేసుకుని తినే టైమ్ కానీ..అలవాటు కానీ వారికి ఉండదు. అమెరికాలో ఉదయం 8 నుండి సాయంత్రం 5 లేదా 6 వరకు నిరంతర పని ఉంటుంది. ఇంటి పని, వంట పనికి సహాయకులు (Maids/Cooks) దొరకడం అక్కడ అత్యంత ఖరీదైన విషయం. ఇందుకు ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఇద్దరు ఉద్యోగాలు చేయడం.. ఆఫీస్ నుంచి ఇంటి మధ్య దూరం చాలా ఎక్కువగా ఉండటం, గ్రోసరీ షాపింగ్‌కే గంటల సమయం పడుతుంది. ఆఫీస్ కు వెళ్లి వచ్చిన తరువాత కూడా ఇంటిని శుభ్రం చేయడం నుండి బట్టలు ఉతకడం, గిన్నెలు తోముకోవడం వరకు ప్రతీదీ స్వయంగా చేసుకోవాలి. దాంతో రోజువారీ వంటకు ఇంపార్టెన్స్ తగ్గుతుంది.

Related Articles

Related image1
Trash On Roads: అమెరికా రోడ్లపై చెత్త వేస్తే ఎంత పెద్ద నేరమో తెలుసా? శిక్షలు ఏ రేంజ్ లో ఉంటాయంటే?
Related image2
Facts: అమెరికా రోడ్లపై కరెంటు తీగలు కనిపించవు ఎందుకో తెలుసా? ఇండియాలో ఇది సాధ్యమేనా?
36
అమెరికాలో రెడీ మేడ్ - ప్రిజర్వ్‌డ్ ఫుడ్ సిస్టమ్ ఎలా ఉంటుంది?
Image Credit : Gemini AI

అమెరికాలో రెడీ మేడ్ - ప్రిజర్వ్‌డ్ ఫుడ్ సిస్టమ్ ఎలా ఉంటుంది?

అమెరికాలో విద్యుత్ సరఫరా, కోల్డ్ చైన్ నెట్‌వర్క్ (Cold Chain Logistics) చాలా బలంగా ఉంటాయి. వారానికి సరిపడా కూరగాయలు కోయడం లేదా ఆదివారం ఒక్కరోజే 3-4 రకాల ఆహారాన్ని వండి ప్యాక్ చేయడం అక్కడ సర్వసాధారణం. అంతే కాదు సూపర్ మార్కెట్లలో 'రెడీ టు ఈట్' (Ready-to-Eat), 'ప్రీ-కట్' కూరగాయలు, మెరినేట్ చేసిన మాంసంతో పాటు డిజైన్డ్ 'ఫ్రోజెన్ మీల్స్' (Frozen Meals) విస్తారంగా అందుబాటులో ఉంటాయి.

46
ఫ్రీజింగ్ టెక్నాలజీ
Image Credit : Gemini AI

ఫ్రీజింగ్ టెక్నాలజీ

మైనస్ డిగ్రీల ఫ్రీజర్లలో ఆహారాన్ని ఉంచడం వల్ల మైక్రోబయల్ పెరుగుదల ఆగిపోయి ఆహారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మైక్రోవేవ్ లేదా ఓవెన్‌లో 2 నిమిషాలు వేడి చేసుకుని తినే వెసులుబాటు ఉంటుంది. అందుకే అమెరికన్లు ఎక్కువగా వంట కోసం టైమ్ కేటాయించరు. అక్కడ సెటిల్ అయిన ఇండియన్స్, ఇతర దేశాల వారిలో కొంత మంది మాత్రం డైలా వారి రొటీన్ ఫుడ్ ను వండుకుని తింటుంటారు. ఇద్దరు జాబ్ చేసేవారు అయితే.. వారానికి సరిపడా వంట చేసుకుని ఫ్రిడ్జ్ లో నిలవుంచుకుంటారు. ఇప్పుడిప్పుడే ఇండియన్స్ కూడా రెడీ టు ఈట్ కు అలవాటు పడుతున్నట్టు తెలుస్తోంది.

56
అమెరికన్ల ఫుడ్ అలవాట్లు
Image Credit : Gemini AI

అమెరికన్ల ఫుడ్ అలవాట్లు

అమెరికన్లు గంటల గంటలు తినడానికి, వండటానికి ఇష్టపడరు. చాలా సింపుల్ గా పని అయిపోయేట్టు ప్లాన్ చేసుకుంటుంటారు. అందుకే ముందు ప్రిపేర్ చేసిన ఫుడ్ ను తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అమెరికల్ల జీవన శైలిలో ఉదయం బ్రెడ్, సెరియల్స్, లేదా స్మూతీస్‌తో సరిపెడతారు. మధ్యాహ్నం శాండ్‌విచ్, సలాడ్ లేదా బర్గర్ వంటి కోల్డ్ మీల్స్ తింటారు. కేవలం రాత్రి పూట మాత్రమే ఓవెన్‌లో చేసిన డిన్నర్ లేదా బయటి ఫుడ్ తీసుకుంటారు.

66
అమెరికాలో ఇండియన్స్ ఏం తింటారు?
Image Credit : Gemini AI

అమెరికాలో ఇండియన్స్ ఏం తింటారు?

భారతీయులు తమ సంప్రదాయ ఆహారాన్ని పూర్తిగా వదులుకోలేరు. అందుకే ఓ NRI యూట్యూబర్ చెప్పినట్లుగా చాలామంది NRIలు 'వీకెండ్ మీల్ ప్రెప్' పాటిస్తారు. వారంలో ఒక్కరోజు పప్పు, గ్రేవీలు, చపాతీ పిండి కలపడం వంటివి చేసి ఫ్రిజ్‌లో ఉంచుకుంటారు. ప్రతిరోజూ కేవలం అన్నం వేడిగా వండుకుని, ముందుగా చేసుకున్న కూరలను మైక్రోవేవ్‌లో వేడి చేసుకుని తింటారు.

ఇండియన్ గ్రోసరీ స్టోర్స్‌లో దొరికే రెడీమేడ్ దోస పిండి, ఫ్రోజెన్ పరోటాలు చాలామందికి సమయం ఆదా చేస్తాయి. మొత్తానికి, అమెరికాలో 'ఫ్రెష్ ఫుడ్' కాకుండా నిల్వ ఆహారం తినడం అనేది సోమరితనం కాదు... అది అక్కడి శ్రమతో కూడిన జీవనశైలికి ,సాంకేతిక ఆధారిత వసతులకు అనుగుణంగా చేసుకున్న ఒక అనుకూలమైన సర్దుబాటు

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Onion Tears : ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయి? దీని వెనక ఇంత కెమిస్ట్రీ దాగుందా?
Recommended image2
Beer Facts: బీర్‌లో నురగ ఎందుకు వస్తుంది? 6 వేల ఏళ్ల చరిత్ర వెనుక ఆసక్తికర విషయాలివే
Recommended image3
సచిన్, ధోని, రోహిత్, కోహ్లీ లకు ఆడపిల్లలే పుట్టడానికి కారణమేంటో తెలుసా?
Related Stories
Recommended image1
Trash On Roads: అమెరికా రోడ్లపై చెత్త వేస్తే ఎంత పెద్ద నేరమో తెలుసా? శిక్షలు ఏ రేంజ్ లో ఉంటాయంటే?
Recommended image2
Facts: అమెరికా రోడ్లపై కరెంటు తీగలు కనిపించవు ఎందుకో తెలుసా? ఇండియాలో ఇది సాధ్యమేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved