MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • UK: యూకేలో కూరగాయలు, బియ్యం మరీ ఇంత ఖరీదా? కిలో ఎంతో తెలుసా? పాపం అక్కడ ఇండియన్స్ పరిస్థితి ఏంటి?

UK: యూకేలో కూరగాయలు, బియ్యం మరీ ఇంత ఖరీదా? కిలో ఎంతో తెలుసా? పాపం అక్కడ ఇండియన్స్ పరిస్థితి ఏంటి?

UK: ఇండియాలో కూరగాయలు రేంటు ఎంతుంటుంది. కిలో 50 కొన్ని 80 వరకూ ఉందొచ్చు.. కానీ కిలో బెండకాయ ఎప్పుడైనా 1000 రూపాయలు పెట్టి కొన్నారా? యూకేలో కూరగాయల రేట్లు అలాగే ఉన్నాయి మరి. బెండకాయలే అలా ఉంటే.. మిగిలిన వాటి రేటు ఎంతో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 23 2026, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
యూకేలో జీవితం అంతా ఈజీ కాదు..
Image Credit : Gemini AI

యూకేలో జీవితం అంతా ఈజీ కాదు..

ఇండియా నుంచి యూకే (బ్రిటన్) కు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు నెలకు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు సంపాదిస్తారని, అక్కడ విలాసవంతమైన జీవితం గడుపుతుంటారని చాలామంది భావిస్తుంటారు. కానీ, గ్రౌండ్ లెవల్ లో ఉన్న వాస్తవ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రీసెంట్ గా ఓ యూట్యూబర్ ఛానెల్ (Praveen’s Planet) షార్ట్ వీడియో అందించిన సమాచారం ప్రకారం.. యూకేలో నివసిస్తున్న భారతీయులు ఎదుర్కొంటున్న రోజువారీ నిత్యావసరాల ధరల భారం అంతా ఇంతా కాదు. యూకేలో కిలో కూరగాయలు, కిలో బియ్యం ఎంత రేటో తెలిస్తే కళ్లు తిరగాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
యూకేలో ఇండియన్ కూరగాయలు అంత రేటా..?
Image Credit : Gemini AI

యూకేలో ఇండియన్ కూరగాయలు అంత రేటా..?

యూకేలోని ఒక ఇండియన్ సూపర్ మార్కెట్‌లో కూరగాయల రేట్లను చూపిస్తూ, మనదేశంలో సాధారణంగా లభించే కూరగాయల ధరలు అక్కడి కరెన్సీలో (పౌండ్లలో) ఎంత దారుణంగా ఉన్నాయో యూట్యూబర్ ప్రవీణ్ వివరించారు. మన భారతీయ రూపాయిల్లోకి మారిస్తే ఇక్కడ 50 నుంచి 80 రూపాయల వరకూ దొరికే కూరగాయలు అక్కడ వందలు వేలలో ఉండటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

36
యూకేలోని సూపర్ మార్కెట్ లలో కూరగాయల రేట్లు ..
Image Credit : Gemini AI

యూకేలోని సూపర్ మార్కెట్ లలో కూరగాయల రేట్లు ..

పచ్చిమిర్చి, బీరకాయలు: కిలో సుమారు 850 రూపాయలు

కాకరకాయలు, దొండకాయలు, బెండకాయలు: కిలో 1,000 రూపాయలు

నిమ్మకాయలు: కిలో 800, మునగకాడలు ఒక చిన్న కట్ట దాదాపు 1,000 రూపాయల వరకూ ఉంటుంది.

ఇక రైస్ విషయానికి వస్తే.. సోనా మసూరి బియ్యం మంచివి అయితే (10 కేజీల బ్యాగ్): 15 పౌండ్లు (దాదాపు 1,600 – ₹1,700)

ఇండియాలో సాధారణంగా దొరికే వరిపిండి పావుకిలో (250 గ్రాములు): 250 రూపాయల వరకూ ఉంటుంది.

46
మిడిల్ క్లాస్ వారికి ఇబ్బంది..
Image Credit : Gemini AI

మిడిల్ క్లాస్ వారికి ఇబ్బంది..

మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన తెలుగువారు, భారతీయులు కిలో బెండకాయలకు రూ. 1,000 పెట్టి కొనాలంటే అది సాధ్యం కావడంలేదు.లక్షల రూపాయలు సంపాదిస్తున్నాం కానీ, ఒక కిలో కూరగాయలకు అంత మొత్తాన్ని వెచ్చించాలంటే మనస్సు అంగీకరించదు. ఇక్కడ బ్రతికే మధ్య తరగతి ఇండియన్స్ తిని తినలేక, బతికి బతకలేక అక్కడ సర్వైవల్ కోసం పోరాడుతున్నాం" అని య్యూట్యూబర్ తన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

56
కూరగాయల రేట్లు ఎందుకు అంత ఎక్కువ?
Image Credit : Gemini AI

కూరగాయల రేట్లు ఎందుకు అంత ఎక్కువ?

అంతర్జాతీయ వాణిజ్య  రిపోర్ట్స్ , లాజిస్టిక్స్ విశ్లేషణల ప్రకారం యూకేలో ఇండియన్ కూరగాయల ధరలు విపరీతంగా ఉండటానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. యూకే వాతావరణంలో బెండకాయ, కాకరకాయ, దొండకాయ వంటి ఉష్ణమండల కూరగాయలు పండవు. వీటిని ఇండియా నుంచి విమానాల ద్వారా (Air Freight) మాత్రమే వేగంగా దిగుమతి చేసుకోవాలి. విమాన ఇంధన ధరలు, కోల్డ్ స్టోరేజ్ కాస్ట్ లు పెరగడం వల్ల రవాణా ఖర్చే అత్యధికంగా ఉంటుంది.

కఠినమైన నిబంధనలు ఉంటాయి..

ఇవన్నీ కాకుండా యూకే ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీలు దిగుమతి అయ్యే ఆహార పదార్థాలపై కఠినమైన శానిటరీ అండ్ ఫైటోశానిటరీ (SPS) నిబంధనలు అమలు చేస్తాయి. ప్రయోగశాల తనిఖీలు, క్వారంటైన్ ఫీజులతో పాటు సర్టిఫికేషన్ ప్రక్రియల వల్ల వ్యాపారులకు దిగుమతి వ్యయం పెరుగుతుంది. బ్రెగ్జిట్ (Brexit) తర్వాత యూకేలో డ్రైవర్ల కొరత ఏర్పడింది. అంతే కాుద స్థానిక ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు, షాపుల విద్యుత్ బిల్లులు, లేబర్ కాస్ట్ విపరీతంగా పెరిగాయి.

66
అన్ని మార్కెట్లలో లభించవు..
Image Credit : Gemini AI

అన్ని మార్కెట్లలో లభించవు..

స్థానిక బ్రిటిష్ సూపర్ మార్కెట్లతో పోలిస్తే భారతీయ కూరగాయలు కేవలం ప్రత్యేక ఆసియా స్టోర్లలోనే లభిస్తాయి. ఇవి తక్కువ పరిమాణంలో దిగుమతి కావడం వల్ల రిటైల్ మార్జిన్లు ఎక్కువగా ఉంటాయి.యూకేలో సంపాదన పౌండ్లలో ఉన్నప్పటికీ, స్థానిక ఖర్చులు, భారతీయ నిత్యావసరాల దిగుమతి ధరల వల్ల సాధారణ ప్రవాస భారతీయులు తీవ్ర వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. మన దేశంలో సాధారణ ఖర్చులుగా భావించేవి అక్కడ అంత కాస్ట్లీ అవ్వడంతో.. ఇండియన్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Telugu Saying: కాలం కలిసి రాకపోతే కర్రే పామై కాటేస్తుంది! పెద్దలు ఈ సామెత ఎందుకు చెప్పారో తెలుసా?
Recommended image2
ప్రపంచంలో అత్యధిక ముస్లింలు ఉన్న దేశమేదో తెలుసా? ఇండియా స్థానమెంత?
Recommended image3
US Apartment Rules: అమెరికాలో రోడ్డుపై ఈ పని చేస్తే చిక్కుల్లో పడ్డట్లే
Related Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్, చిరంజీవి ఇద్దరికి ఫేవరెట్ హీరోయిన్, మామ,అల్లుడు డ్యాన్స్ చేయాలని మనసుపడ్డ బ్యూటీ ఎవరో తెలుసా?
Recommended image2
UK: యూకేలో ఇండియన్స్ బ్రతకాలంటే నెలకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఫ్యూజులు ఎగిరిపోయే నిజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved