MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • భారతదేశంలోనే అత్యంత ధనిక గ్రామం ఇదే.. చిన్న గ్రామంలో 17 బ్యాంకులు

భారతదేశంలోనే అత్యంత ధనిక గ్రామం ఇదే.. చిన్న గ్రామంలో 17 బ్యాంకులు

Richest Village: సాధారణంగా గ్రామం అనగానే పచ్చని పొలాలు, చిన్న ఇళ్లు, ప్రశాంతమైన వాతావరణం గుర్తుకొస్తాయి. కానీ భారతదేశంలో ఒక గ్రామం మాత్రం ఈ అంచనాలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దేశంలో అత్యంత ధ‌నిక గ్రామానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం.

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 17 2026, 06:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గుజరాత్‌లోని ఆ గ్రామం ప్రత్యేకత ఏంటి.?
Image Credit : Counting Unique/Youtube

గుజరాత్‌లోని ఆ గ్రామం ప్రత్యేకత ఏంటి.?

భారతదేశంలోని అత్యంత సంపన్న గ్రామంగా పేరుగాంచిన గ్రామం పేరు మధాపర్. ఇది గుజరాత్‌లోని కచ్ జిల్లాలో భుజ్ నగరానికి సమీపంలో ఉంది. సుమారు 32 వేల జనాభా కలిగిన ఈ గ్రామం తన ప్రత్యేకతలతో అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణ గ్రామాలకు భిన్నంగా ఇక్కడ పెద్ద పెద్ద బంగ్లాలు, విశాలమైన రహదారులు, అందమైన సరస్సులు కనిపిస్తాయి. అంతేకాదు.. ఆధునిక జీవనానికి అవసరమైన అనేక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. గ్రామంలో పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, దేవాలయాలు ఉన్నాయి. గ్రామంలోకి అడుగుపెడితే ఒక అభివృద్ధి చెందిన పట్టణంలోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బ్యాంకుల్లో రూ.7 వేల కోట్లకు పైగా డిపాజిట్లు
Image Credit : Counting Unique/Youtube

బ్యాంకుల్లో రూ.7 వేల కోట్లకు పైగా డిపాజిట్లు

మధాపర్ గ్రామ సంపద గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా ఇక్కడి బ్యాంకు డిపాజిట్ల గురించి తెలుసుకోవాలి. ఈ గ్రామానికి చెందిన ప్రజలు వివిధ బ్యాంకుల్లో కలిపి రూ.7 వేల కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు కలిగి ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), ఐసీఐసీఐ (ICICI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) వంటి ప్రముఖ బ్యాంకులు ఇక్కడ సేవలు అందిస్తున్నాయి. మొత్తంగా గ్రామంలో 17 ప్రధాన బ్యాంకు శాఖలు ఉన్నట్లు సమాచారం. ఒక గ్రామంలో ఇన్ని బ్యాంకులు ఉండటం, వాటిలో వేల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉండటం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడి ప్రజల ఆర్థిక స్థితికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

35
విదేశాల్లో నివసిస్తున్న వారే గ్రామ సంపదకు ప్రధాన కారణం
Image Credit : Counting Unique/Youtube

విదేశాల్లో నివసిస్తున్న వారే గ్రామ సంపదకు ప్రధాన కారణం

మధాపర్ గ్రామం ఇంత సంపన్నంగా మారడానికి ప్రధాన కారణం అక్కడి ప్రజల విదేశీ సంబంధాలే. ఈ గ్రామ జనాభాలో దాదాపు 65 శాతం మంది విదేశాల్లో నివసిస్తున్నట్లు సమాచారం. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు పలు ఆఫ్రికా దేశాల్లో మధాపర్‌కు చెందిన వారు స్థిరపడ్డారు. వీరిలో చాలామంది నిర్మాణ రంగం, వ్యాపారాలు, ఇతర ఉద్యోగాల్లో పనిచేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. విదేశాల్లో సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని తమ సొంత గ్రామానికి పంపిస్తుంటారు. ఇలా ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో డబ్బు గ్రామానికి చేరుతోంది. ఈ నిధులు గ్రామ ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు స్థానిక అభివృద్ధికి కూడా ఉపయోగపడుతున్నాయి.

45
లండన్‌తోనూ ప్రత్యేక అనుబంధం
Image Credit : Counting Unique/Youtube

లండన్‌తోనూ ప్రత్యేక అనుబంధం

మధాపర్ గ్రామానికి లండన్‌తో కూడా ప్రత్యేక సంబంధం ఉంది. లండన్‌లో పనిచేస్తున్న మధాపర్ గ్రామ సంఘం విదేశాల్లో నివసిస్తున్న గ్రామస్తులను ఒకే వేదికపైకి తీసుకువస్తోంది. ఈ సంఘం ద్వారా విదేశాల్లో ఉన్నవారు తమ గ్రామంతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలకు సహకరిస్తున్నారు. విదేశాల్లో సంపాదించిన డబ్బును సొంత గ్రామంలో పెట్టుబడులు పెట్టడానికి, అభివృద్ధి పనులకు వినియోగించడానికి ప్రోత్సహిస్తున్నారు. దీంతో విదేశాల్లో ఉన్నప్పటికీ గ్రామ ప్రజలు తమ స్వస్థలాన్ని మర్చిపోకుండా అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. ఈ విధంగా విదేశాల్లోని ప్రవాసులు, గ్రామంలో నివసించే ప్రజల మధ్య బలమైన అనుబంధం కొనసాగుతోంది.

55
సంపదతో పాటు సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యం
Image Credit : Counting Unique/Youtube

సంపదతో పాటు సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యం

మధాపర్ గ్రామం ప్రత్యేకత కేవలం అక్కడి ప్రజల సంపద మాత్రమే కాదు. ఆ సంపదను గ్రామ అభివృద్ధికి కూడా వినియోగించడం మరో ముఖ్యమైన విషయం. విదేశాల్లో నివసిస్తున్న గ్రామస్తులు వ్యక్తిగత అవసరాలకే పరిమితం కాకుండా సామాజిక కార్యక్రమాలకు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సంప్రదాయ సంస్కృతిని కాపాడుకుంటూనే ఆధునిక సౌకర్యాలను అందిపుచ్చుకుంటున్నారు. ఒకప్పుడు సాధారణ గ్రామంగా ఉన్న మధాపర్.. నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం వెనుక అక్కడి ప్రజల కృషి, విదేశాల్లో స్థిరపడిన వారి సహకారం కీలకంగా ఉన్నాయి. గ్రామస్తులంతా కలిసి తమ సొంత ఊరి అభివృద్ధికి పనిచేస్తే ఎలాంటి మార్పు సాధ్యమవుతుందో మధాపర్ గ్రామం చాటి చెబుతోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
 
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
(37.2 ov)121/3
SLSL
98
Day 1
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Vizag: తీరానికి దగ్గరే ఉన్న సునామీలు, సైక్లోన్ లు టచ్ చేయని సిటీ ?
Recommended image2
Goosebumps : బాగా ఎగ్జైట్ అయితే గూస్‌బంప్స్ వస్తాయి.. ఎందుకో తెలుసా?
Recommended image3
Milk Powder: పాలపొడిని ఎలా తయారు చేస్తారో తెలుసా? లీటర్ పాల నుంచి ఎన్ని గ్రాముల పొడి తయారవుతుంది?
Related Stories
Recommended image1
100 కోట్ల వ్యూస్ దిశ‌గా దూసుకెళ్తున్న తెలంగాణ ఫోక్ సాంగ్‌.. ఇంత‌లా ఈ పాట‌లో ఏముంద‌బ్బా?
Recommended image2
Iron and Steamer: ఇస్త్రీ కోసం ఇంకా అవే ఐర‌న్ బాక్సులే కొంటున్నారా.? అప్డేట్ అవ్వండి బ్రో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved