MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Unhappiest Countries: ఈ దేశాల్లోని ప్రజలకు సంతోషమంటేనే తెలియదు, ఇక్కడ పుట్టడమే శాపం

Unhappiest Countries: ఈ దేశాల్లోని ప్రజలకు సంతోషమంటేనే తెలియదు, ఇక్కడ పుట్టడమే శాపం

Unhappiest countries : వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 విడుదలైంది. ఈ దేశాల జాబితాలో ఫిన్లాండ్ మరోసారి టాప్ లో నిలవగా, ఆఫ్ఘనిస్తాన్ అత్యంత దుర్భరమైన స్థితిలో ఉంది. మరి భారత్ ర్యాంకు ఎంతో తెలుసా?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 09 2026, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆ దేశాల్లో బతుకు భారమైందా?
Image Credit : Chat gpt

ఆ దేశాల్లో బతుకు భారమైందా?

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు, ఆర్థిక ఇబ్బందులు మధ్య 'వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026' విడుదలైంది. అసలు ప్రపంచంలో ఏ దేశ ప్రజలు హాయిగా నవ్వుతూ గడుపుతున్నారు? ఏ దేశాల్లో బతుకు భారంగా మారింది? మరి భారతదేశం పరిస్థితి ఏంటి? అనే ఆసక్తికర విషయాలు ఈ రిపోర్టులో వెల్లడయ్యాయి. ఆశ్చర్యకరంగా 2006 నుంచి ఇప్పటివరకు దాదాపు 79 దేశాలు తమ సంతోష స్థాయిలను మెరుగుపరుచుకోగా, కొన్ని దేశాలు మాత్రం అట్టడుగు స్థాయికి పడిపోయాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
టాప్ లో ఫిన్లాండ్.. వరుసగా 9వ సారి
Image Credit : freepik

టాప్ లో ఫిన్లాండ్.. వరుసగా 9వ సారి

సంతోషం అంటే మాదే అని ఫిన్లాండ్ మరోసారి నిరూపించింది. వరుసగా 9వ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ టాప్ లో నిలిచింది. 10 పాయింట్లకు గానూ ఈ దేశం 7.764 స్కోరు సాధించింది. ఇక టాప్ 10 జాబితాలో ఐస్‌లాండ్ (2వ), డెన్మార్క్ (3వ) స్థానాల్లో ఉండగా, కోస్టారికా అనూహ్యంగా 4వ స్థానానికి చేరడం విశేషం. స్వీడన్, నార్వే, ఇజ్రాయెల్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు కూడా టాప్ 10లో తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నాయి.

Related Articles

Related image1
Love song: ఈ పాటకు ఏ అమ్మాయైనా కరిగిపోవాల్సిందే.. ‘సొమ్మసిల్లి పోతున్నవే’ పాట పూర్తి లిరిక్స్ ఇవిగో
Related image2
Highway Photos: బంపర్ ఆఫర్.. హైవేపై ఫోటోలు తీయండి, ఫోటోకు రూ.1000 బహుమతి పొందండి
35
పొరుగు దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి ఏంటి?
Image Credit : Getty

పొరుగు దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి ఏంటి?

భారతదేశం తన ర్యాంకును నెమ్మదిగా మెరుగుపరుచుకుంటోంది. 2024లో 126వ స్థానంలో ఉన్న భారత్, 2025 నాటికి 118కి, ప్రస్తుతం 116వ స్థానానికి చేరుకుంది. భారత్ స్కోరు 4.536గా నమోదైంది. అయితే, మన పొరుగు దేశాలైన నేపాల్ (99), పాకిస్తాన్ (104) భారత్ కంటే మెరుగైన ర్యాంకుల్లో ఉండటం గమనార్హం. బంగ్లాదేశ్ 127వ స్థానంలో, శ్రీలంక 134వ స్థానంలో ఉన్నాయి. ఉద్రిక్తతల మధ్య కూడా భారత్ ర్యాంకు మెరుగుపడటం సానుకూల అంశం.

45
అత్యంత బాధాకరమైన స్థితిలో ఆఫ్ఘనిస్తాన్
Image Credit : Getty

అత్యంత బాధాకరమైన స్థితిలో ఆఫ్ఘనిస్తాన్

ఈ రిపోర్టులో అత్యంత విషాదకరమైన అంశం ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి. మొత్తం 147 దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో (147) నిలిచింది. దీని స్కోరు కేవలం 1.446 మాత్రమే. రాజకీయ అస్థిరత, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, మానవ హక్కుల లేమి వంటి కారణాలు అక్కడి ప్రజల సంతోషాన్ని దూరం చేశాయి. ఇక్కడ నివసించడం ఒక యుద్ధంలా మారిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

55
సంతోషం లేని టాప్ 10 దేశాలు ఇవే !
Image Credit : Getty

సంతోషం లేని టాప్ 10 దేశాలు ఇవే !

సంతోషం కరువైన దేశాల జాబితాలో ఎక్కువగా ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలే ఉన్నాయి.

  1. ఆఫ్ఘనిస్తాన్ (147)
  2. సియెర్రా లియోన్ (146)
  3. మలావి (145)
  4. జింబాబ్వే (144)
  5. బోట్స్వానా (143)
  6. యెమెన్ (142)
  7. లెబనాన్ (141)
  8. డీఆర్ కాంగో (140)
  9. ఈజిప్ట్ (139)
  10. టాంజానియా (138)

జింబాబ్వేలో కరెన్సీ కష్టాలు, లెబనాన్‌లో ఆర్థిక సంక్షోభం ఆయా దేశాల ప్రజల జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీశాయి. అట్టడుగున ఉన్న దేశాలలో టాంజానియా ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా నిలిచింది. ఈ జాబితాలో ఉన్న దేశాలన్నీ తమ స్కోరును కోల్పోగా, టాంజానియా మాత్రం స్వల్పంగా (+0.132) మెరుగుపడింది. ఇది ఆ దేశంలో జరుగుతున్న అభివృద్ధికి సంకేతం. మరోవైపు, ఈజిప్ట్ వంటి దేశాల్లో ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ప్రజల అసంతృప్తి పెరుగుతోందని రిపోర్టు పేర్కొంది.

సంతోషం అనేది కేవలం డబ్బుతోనే రాదు, సామాజిక భద్రత, స్వేచ్ఛ, ప్రభుత్వం అందించే సపోర్టు సరిగ్గా ఉన్నప్పుడే ప్రజలు హాయిగా ఉంటారని ఈ రిపోర్ట్ చెబుతోంది. భారత్ వంటి దేశాలు ఇంకా ప్రయాణించాల్సిన దూరం చాలా ఉందని ఈ ర్యాంకులు గుర్తు చేస్తున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
పాకిస్తాన్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Railways Rules: ట్రైన్ మిస్ అయితే అదే టికెట్‌తో మరో రైలు ఎక్కొచ్చా? లేక రీఫండ్ వస్తుందా?
Recommended image2
Heatwave Safety Tips : ఇక రోళ్లు పగిలే స్థాయిలో రోహిణి కార్తె ఎండలు.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు?
Recommended image3
Indian Railways : రైల్లో బ్యాగ్ లేదా ఫోన్ మర్చిపోయారా? ఈ ఒక్క నెంబర్ కి కాల్ చేస్తే చాలు.. వెతికి మరీ ఇస్తారు
Related Stories
Recommended image1
Love song: ఈ పాటకు ఏ అమ్మాయైనా కరిగిపోవాల్సిందే.. ‘సొమ్మసిల్లి పోతున్నవే’ పాట పూర్తి లిరిక్స్ ఇవిగో
Recommended image2
Highway Photos: బంపర్ ఆఫర్.. హైవేపై ఫోటోలు తీయండి, ఫోటోకు రూ.1000 బహుమతి పొందండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved