MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Highway Photos: బంపర్ ఆఫర్.. హైవేపై ఫోటోలు తీయండి, ఫోటోకు రూ.1000 బహుమతి పొందండి

Highway Photos: బంపర్ ఆఫర్.. హైవేపై ఫోటోలు తీయండి, ఫోటోకు రూ.1000 బహుమతి పొందండి

Highway Photos: హైవేలపై అపరిశుభ్ర టాయిలెట్ల ఫోటోలు తీసి రూ. 1000 గెలుచుకోండి. ఇది మీకు వింతగా అనిపించినా.. ఇది నిజం. ఏప్రిల్ 10 నుండి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు రద్దుతో పాటు పలు రూల్స్ మారాయి. కొత్త ఫాస్టాగ్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 08 2026, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైవేపై ఫోటో తీస్తే చాలు
Image Credit : Gemini

హైవేపై ఫోటో తీస్తే చాలు

హైవేపై ఫోటో తీస్తే చాలు మీ ఫాస్టాగ్‌లోకి రూ. 1000 క్రెడిట్ అవుతాయి. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. రహదారుల వెంట ఉండే టాయిలెట్ల పరిశుభ్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్' అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో పాటు టోల్ వసూళ్ల ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చేస్తూ ఏప్రిల్ 10ని డెడ్ లైన్‌గా ప్రకటించింది.

25
ఫోటో తీయండి.. బహుమతి గెలవండి
Image Credit : Gemini

ఫోటో తీయండి.. బహుమతి గెలవండి

హైవేలపై ప్రయాణించే సమయంలో టోల్ ప్లాజాల వద్ద ఉండే టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉంటే, ప్రయాణికులు ఇకపై మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఆ మురికి టాయిలెట్లను ఫోటో తీసి, ప్రభుత్వ అధికారిక హైవే యాత్ర యాప్‌లో అప్‌లోడ్ చేయడమే. మీ ఫిర్యాదు నిజమని తేలితే, ప్రోత్సాహకంగా మీ ఫాస్టాగ్ ఖాతాలోకి రూ. 1,000 విలువైన బ్యాలెన్స్‌ను ప్రభుత్వం క్రెడిట్ చేస్తుంది. ప్రయాణికులను డిజిటల్ డిటెక్టివ్‌లు గా మార్చి, సిస్టమ్‌లో ఉన్న లోపాలను సరిదిద్దడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

Related Articles

Related image1
IAS కంటే ఇన్ ఫ్లుయెన్సర్ల సంపాదన ఎక్కువా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ లెక్కలు!
Related image2
మీకో గుడ్ న్యూస్.. సర్కార్ అదిరిపోయే గిఫ్ట్.. ఇకపై సగానికే ఇన్సూరెన్స్ పాలసీలు !
35
ఏప్రిల్ 10 నుంచి నగదు చెల్లింపులు బంద్
Image Credit : Gemini

ఏప్రిల్ 10 నుంచి నగదు చెల్లింపులు బంద్

డిజిటల్ లావాదేవీలను వంద శాతం అమలు చేయాలనే పట్టుదలతో ఉన్న ఎన్‌హెచ్‌ఏఐ, ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు స్వీకరణను పూర్తిగా నిలిపివేస్తోంది. ఇకపై ప్రతీ వాహనం తప్పనిసరిగా ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా యూపీఐ ద్వారా చెల్లించాలని ప్రయత్నిస్తే, దానిపై అదనంగా 0.25% వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేసేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

45
ఐడీ కార్డులు చూపించినా...
Image Credit : Gemini

ఐడీ కార్డులు చూపించినా...

గతంలో ప్రభుత్వ ఉద్యోగులమని లేదా స్థానికులమని ఐడి కార్డులు చూపిస్తూ టోల్ మినహాయింపు పొందడం సర్వసాధారణంగా ఉండేది. అయితే, కొత్త నిబంధనల ప్రకారం ప్రైవేట్ వాహనాలకు ఇలాంటి మినహాయింపులు ఇకపై వర్తించవు. కేవలం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వాహనాలకు మాత్రమే మినహాయింపు పొందిన ఫాస్టాగ్ కేటాయిస్తారు. ఆ ట్యాగ్ ఉంటేనే టోల్ ఫీజు లేకుండా ప్రయాణించే వీలుంటుంది. వ్యక్తిగత గుర్తింపు కార్డుల ఆధారంగా ఉచిత ప్రవేశం కల్పించే విధానానికి స్వస్తి పలికారు.

55
మినహాయింపు పొందిన ఫాస్టాగ్ అంటే ఏమిటి?
Image Credit : Gemini

మినహాయింపు పొందిన ఫాస్టాగ్ అంటే ఏమిటి?

భారత జాతీయ రహదారుల రుసుము నిబంధనలు 2008 ప్రకారం, కొన్ని ప్రత్యేక వాహనాలకు మాత్రమే టోల్ నుండి మినహాయింపు ఉంటుంది. అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలు, మిలిటరీ వాహనాలు, వివిఐపిల వాహనాలకు ఈ Exempted FASTag జారీ చేస్తారు. ఈ ట్యాగ్ ఉన్న వాహనాలు టోల్ ప్లాజా వద్ద ఆగే అవసరం లేకుండా సెన్సార్ల ద్వారా గుర్తించి.. ఉచితంగా వెళ్ళిపోతాయి. సాధారణ పౌరులు తమ ఫాస్టాగ్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలని, లేనిపక్షంలో రెట్టింపు టోల్ చెల్లించాల్సి వస్తుందని అధికారులు గుర్తు చేస్తున్నారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Revanth Reddy in Kerala: కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి| Asianet News Telugu
Recommended image2
IIT Baba హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు..?
Recommended image3
ఏమిటీ 'క్యాచ్ దెమ్ యంగ్' స్ట్రాటజీ..? ఇది మీ పిల్లలను బానిసలుగా మార్చేస్తుంది.. జాగ్రత్త
Related Stories
Recommended image1
IAS కంటే ఇన్ ఫ్లుయెన్సర్ల సంపాదన ఎక్కువా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ లెక్కలు!
Recommended image2
మీకో గుడ్ న్యూస్.. సర్కార్ అదిరిపోయే గిఫ్ట్.. ఇకపై సగానికే ఇన్సూరెన్స్ పాలసీలు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved