MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Love song: ఈ పాటకు ఏ అమ్మాయైనా కరిగిపోవాల్సిందే.. ‘సొమ్మసిల్లి పోతున్నవే’ పాట పూర్తి లిరిక్స్ ఇవిగో

Love song: ఈ పాటకు ఏ అమ్మాయైనా కరిగిపోవాల్సిందే.. ‘సొమ్మసిల్లి పోతున్నవే’ పాట పూర్తి లిరిక్స్ ఇవిగో

Love Song : తెలుగు ఫోక్ సాంగ్స్ ఇప్పుడు సినిమా పాటలను మించిన పాపులారిటీతో దుమ్మురేపుతున్నాయి. సోషల్ మీడియాను షేక్ చేసిన 'సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నా రాములమ్మ' పాట పూర్తి లిరిక్స్ మీకోసం. ఈ సాంగ్ ను రాము రాథోడ్ పాడారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 09 2026, 09:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రేమికులకు పిచ్చెక్కిస్తున్న ఓ సిన్నా రాములమ్మ సాంగ్
Image Credit : Youtube/msadda615

ప్రేమికులకు పిచ్చెక్కిస్తున్న ఓ సిన్నా రాములమ్మ సాంగ్

ప్రస్తుతం తెలుగు ఫోక్ సాంగ్స్ హవా నడుస్తోంది. మట్టి వాసనతో, స్వచ్ఛమైన గ్రామీణ యాసతో సాగే ఈ పాటలు అందరి మనసులను గెలుచుకుంటున్నాయి. ఈ క్రమంలో 'సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నా రాములమ్మ' అనే పాట యూట్యూబ్‌లో సంచలనం రేపింది. సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ పాటలోని మాధుర్యం, భావోద్వేగం ఏ అమ్మాయినైనా కరిగించేలా ఉంటుంది.

ఈ సాంగ్ ను 'M S ADDA' అనే యూట్యూబ్ ఛానల్ విడుదల చేసింది. ఈ పాటను ప్రముఖ ఫోక్ సింగర్ రాము రాథోడ్ పాడారు. పాటకు తన గాత్రంతో ప్రాణం పోశాడు. కేవలం పాడటమే కాకుండా, ఈ పాటలో రాము రాథోడ్ నటించారు. జోడీగా దివ్య భగత్ నటించగా, వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ సాంగ్‌ను విజువల్‌గా కూడా క్లాసిక్‌గా మార్చేసింది. యూట్యూబ్ లో ఇప్పటివరకు 31 కోట్లకు పైగా (318184426) వ్యూస్, 1.6M లైకులు వచ్చాయి. ఈ సూపర్ హిట్ ఫోక్ సాంగ్ పూర్తి లిరిక్స్ ఇలా ఉన్నాయి..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సొమ్మసిల్లి పోతున్నవే పాట లిరిక్స్
Image Credit : Youtube/msadda615

సొమ్మసిల్లి పోతున్నవే పాట లిరిక్స్

కంటికి కునుకే కరువాయనే..

గుండెల బరువే మొదలాయనే..

సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నా రాములమ్మ

చెమ్మగిల్లి ముద్దియ్యవే చూపించవే నాపై ప్రేమ

నల్ల నల్లని కళ్ళతో నాజూకు నడుముతో

నన్నాగమే జేస్తివే

గుండె గాలిలో తేలుతూ ఆరాటాలాడుతు

నీ వొళ్ళోనే వాలెనే

సుట్టు దిప్పుకున్నావే ఓ సిన్నా రాములమ్మ

సెమట సుక్కోలే తీసెయ్యకే

నీ సీర కొంగుకే ముడివెయ్యవే

Related Articles

Related image1
మహిళల పరువు తీస్తున్నారు, క్షమాపణ చెబితే సరిపోదు.. ఆ హీరోయిన్ పై మహిళా కమిషన్ ఆగ్రహం
Related image2
IAS కంటే ఇన్ ఫ్లుయెన్సర్ల సంపాదన ఎక్కువా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ లెక్కలు!
35
సింపుల్ పదాలతోనే పాట రచన
Image Credit : Youtube/msadda615

సింపుల్ పదాలతోనే పాట రచన

సాయంకాలం వేళ సందె పొద్దులాగ సెంతలోనే ఉండవే

సీకటేల మెరిసే సుక్కలాగ గుండెలోన దాగవే

నీటిలోన నీడ చూస్తుంటే ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే

నీ చేతినద్దేసి కలలన్ని చెరిపేసి కాలాన్ని మార్చకే

ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాజి నవ్వులే

సక్కనైన సొగసులే నాకిచ్చి స్వర్గంలో బంధించవే

45
మంచి లొకేషన్లలో పాట చిత్రీకరణ
Image Credit : Youtube/msadda615

మంచి లొకేషన్లలో పాట చిత్రీకరణ

ఏటి గట్టు మీద ఎదురుసూపుల్లోన కళ్ళల్లో నిండినవే

గాలివానల్లోన గొడుగల్లే రమ్మన్న వెచ్చగా కౌగిలికే

నీ ఊహలే కన్న నీ ధ్యాసలో ఉన్న నా దరికి రమ్మంటినే

నిను వెతికే దారుల్లో అడ్డంకులెన్నున్నా నా అడుగు నీ జాడకే

ముద్దుగున్నా నా చెలివే ఓ సిన్నా రాములమ్మ

సెంత సేరే రోజెన్నడే ప్రాణం అల్లాడే నీకోసమే

55
ఇంటి దీపాన్ని వెలిగించవే
Image Credit : Youtube/msadda615

ఇంటి దీపాన్ని వెలిగించవే

పారేటి సెలయేరు పలకరించకున్నా పరువాలేదనుకుంటినే

ప్రాణం కన్నా నువ్వు ఎక్కువ అంటున్నా పట్టించుకోవెందుకే

పువ్వుల్లో దాగున్న పరిమళాలన్నీ నీ చెంత చేరిస్తినే

పంచభూతాలన్నీ సాక్షులుగా ఉంచేసి మనువాడుకుంటానులే

జన్మ జన్మాల బంధానివే ఓ సిన్నా రాములమ్మ

నా సీకటి బ్రతుకుల ఎలుగియ్యవే నా ఇంటి దీపాన్ని ఎలిగించవే

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Krishnan: పుకార్లకు చెక్ పెట్టిన త్రిష, లండన్ టూర్‌ వెనుక అసలు కథ ఇదే.. అభిమానులకు గుడ్‌న్యూస్‌
Recommended image2
OTT: థియేటర్స్ లో యావరేజ్, ఓటీటీలో మాత్రం దున్నేస్తున్న పృథ్వీరాజ్ సినిమా.. వారణాసి విలన్ అదరగొట్టడయ్యా
Recommended image3
Toxic 8 Days Collections: నెగటివ్‌ టాక్ తోనూ యష్‌ మూవీకి ఊహించని కలెక్షన్లు.. టాక్సిక్‌ కి ఇంకా ఎంత రావాలంటే?
Related Stories
Recommended image1
మహిళల పరువు తీస్తున్నారు, క్షమాపణ చెబితే సరిపోదు.. ఆ హీరోయిన్ పై మహిళా కమిషన్ ఆగ్రహం
Recommended image2
IAS కంటే ఇన్ ఫ్లుయెన్సర్ల సంపాదన ఎక్కువా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ లెక్కలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved