MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Feature
  • బంగారం కన్నా ఖరీదైన మొక్క.. దీని ఆకులతోనే కోట్ల వ్యాపారం, మనదేశంలోనే దొరుకుతుంది

బంగారం కన్నా ఖరీదైన మొక్క.. దీని ఆకులతోనే కోట్ల వ్యాపారం, మనదేశంలోనే దొరుకుతుంది

ఓ అరుదైన మొక్క.. అందులో అత్యంత విలువైన ఔషధ మొక్క. మలేరియా, కంటి సమస్యల వంటి ఎన్నో రోగాలను తగ్గించే శక్తి దీనికి ఉంది. అందుకే దీన్ని బంగారం కన్నా ఎక్కువ విలువిచ్చి కొనుగోలు చేస్తున్నారు. అక్రమ రవాణాలు కూడా జరుగుతున్నాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 13 2026, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బంగారం కన్నా విలువైన మొక్క
Image Credit : Gemini

బంగారం కన్నా విలువైన మొక్క

బంగారాన్నే ఇప్పుడు అత్యంత విలువైనదిగా చూస్తున్నాం. కానీ దీని కన్నా విలువైన మొక్క ఒకటుంది. ఆ మొక్క ఎక్కడో కాదు మనదేశంలోనే ఉంది. బంగారం కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ విలువైన మొక్కగా దీన్ని పరిగణిస్తారు. ఈ మొక్క ఆకులనే వేల రూపాయలు పెట్టి కొంటారు. చైనా ఈ మొక్కల కోసం దొంగ దారులు వెతికి అక్రమంగా మొక్కలను దొంగిలించి అమ్ముకుంటోంది. ఇంత విలువైన ఆ మొక్క పేరు 'మిష్మి తీతా'. ఈ మొక్క కథేంటో పూర్తిగా తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఏ రోగాలకు పనిచేస్తుంది?
Image Credit : Gemini

ఏ రోగాలకు పనిచేస్తుంది?

మిష్మి తీతా మొక్క అరుదైనది. దీనిలో ఔషధ గుణాలు ఎక్కువ. దీని శాస్త్రీయ నామం 'కాప్టిస్ తీతా'. ఇది మనకు హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుంది. దీని వేర్లు చాలా చేదుగా ఉంటాయి. ఈశాన్య భారత భాషల్లో 'తీతా' అంటే చేదు అని అర్థం. అందుకే దీన్ని మిష్మి తీతా అని పిలుచుకుంటారు.

సాంప్రదాయ ఆయుర్వేదం, చైనీస్ వైద్య విధానం, ఈశాన్య భారత గిరిజన వైద్యంలో ఈ మొక్కలోని భాగాలను అనేక రకాలుగా వాడతారు. ఈ మొక్క ఆకుల్లో 'బెర్బెరిన్' అనే ముఖ్యమైన రసాయనం ఉంటుంది. దీనివల్ల మలేరియా, కంటి సమస్యలు, కడుపునొప్పి, జ్వరం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

Related Articles

Related image1
Cars Under 5 Lakhs: రూ.5 లక్షల లోపు కారు కొనాలనుకుంటే అదిరిపోయే మైలేజ్ ఇచ్చే 5 కార్లు ఇవిగో
Related image2
మనదేశంలో నదులన్నీ ఆడవే... కానీ ఒకే ఒక్క మగ నది ఉంది, అదేంటో తెలుసా?
33
ఈ మొక్కల ధర ఎంత?
Image Credit : Gemini

ఈ మొక్కల ధర ఎంత?

మిష్మి తీతా మొక్కలు ఎక్కడ పడితే అక్కడ బతకలేవు. కొన్ని వాతావరణాల్లోనే జీవించడగలవు. ఈ మొక్కల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణ కలిగిన అరుణాచల్ ప్రదేశ్‌లోని 'మిష్మి కొండల్లో' (Mishmi Hills) ఇది ఎక్కువగా పెరుగుతుంది. చైనాలోని టిబెట్ సరిహద్దు, మిజోరాం, నాగాలాండ్, మయన్మార్ సరిహద్దు అడవుల్లో కూడా ఈ మొక్కలు అరుదుగా దొరుకుతూ ఉంటాయి. సముద్ర మట్టానికి 2,000 నుంచి 3,000 మీటర్ల ఎత్తులో, తేమ, చల్లగా ఉండే సతత హరిత అడవుల్లో మాత్రమే ఈ మొక్కలు పెరగగలవు. అయితే ఈ మొక్కలను విపరీతంగా వాడేయడం… ఇతర దేశాలకు అక్రమ రవాణా చేయడం వల్ల ఇప్పుడు ఈ మొక్కలు అంతరించిపోతున్న జాతుల జాబితాలోకి చేరిపోయాయి.

భారత మార్కెట్లో మిష్మి తీతా ధర దాని నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. క్వాలిటీని బట్టి కిలోకు రూ.3,000 నుంచి రూ.9,000 వరకు ఉంటుంది. మంచి నాణ్యత ఉన్న ఎండిన వేర్ల హోల్‌సేల్ మార్కెట్ ధర సాధారణంగా కిలోకు రూ.4,000 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది. అత్యంత అరుదైన, ప్రాసెస్ చేసిన ఆర్గానిక్ మెడిసిన్ గ్రేడ్ వేర్ల ధర కిలోకు రూ.8,000 - రూ.9,000 లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఇక పొడి (Powder) రూపంలో చిల్లరగా కొంటే 100 గ్రాములకు రూ.300 నుంచి రూ.500 వరకు ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ishtakameshwari Temple: గుండె ధైర్యం ఉంటేనే ఇక్కడికి వెళ్లగలరు.. నల్లమల అడవుల్లో మనిషిలా మారే విగ్రహ ఆలయం !
Recommended image2
Onion Tears : ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయి? దీని వెనక ఇంత కెమిస్ట్రీ దాగుందా?
Recommended image3
Beer Facts: బీర్‌లో నురగ ఎందుకు వస్తుంది? 6 వేల ఏళ్ల చరిత్ర వెనుక ఆసక్తికర విషయాలివే
Related Stories
Recommended image1
Cars Under 5 Lakhs: రూ.5 లక్షల లోపు కారు కొనాలనుకుంటే అదిరిపోయే మైలేజ్ ఇచ్చే 5 కార్లు ఇవిగో
Recommended image2
మనదేశంలో నదులన్నీ ఆడవే... కానీ ఒకే ఒక్క మగ నది ఉంది, అదేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved