MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Pawan Kalyan: రామ్ చరణ్ తో పాటు వరుణ్ తేజ్ ను కూడా బ్లాక్ మెయిల్ చేసిన పవన్ కళ్యాణ్, ఏందుకలా చేసేవాడంటే ?

Pawan Kalyan: రామ్ చరణ్ తో పాటు వరుణ్ తేజ్ ను కూడా బ్లాక్ మెయిల్ చేసిన పవన్ కళ్యాణ్, ఏందుకలా చేసేవాడంటే ?

Pawan Kalyan: మెగా ఫ్యామిలీలో కుర్ర హీరోలను ఒక ఆట ఆడుకున్నాడు వవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్ తో పాటు వరుణ్ తేజ్ కూడా బ్లాక్ మెయిట్ చేసి ఆయన ఏం చేసేవాడో తెలుసా? రీసెంట్ గా మెగా ప్రిన్స్ చెప్పిన సీక్రేట్ ఎంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 12 2026, 11:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మెగా గ్రూప్ లీడర్ గా పవన్ కళ్యాణ్..
Image Credit : Asianet News

మెగా గ్రూప్ లీడర్ గా పవన్ కళ్యాణ్..

చిరంజీవి స్టార్ హీరో అయిన తరువాత తన తమ్ముళ్లు వాళ్ల పిల్లలు, తన తనయుడితో పాటు కూతుర్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. దాంతో అతి పెద్ద సి నిమా కుటుంబంగా మెగా ప్యామిలీ టాలీవుడ్ లోపేరు తెచ్చుకుంది. అయితే వీళ్లంతా సినిమాల్లోకి రాకముందు చెన్నైలో ఉన్న టైమ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ గ్రూప్ కు లీడర్ గా ఉండేవారు. పవన్ కూడా హీరో అవ్వకముందు చిరంజీవి ఇంట్లోనే ఉంటూ చదువుకునేవారు. అప్పుడు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సుస్మిత, వీళ్లంతా చాలా చిన్న పిల్లలు కావడంతో పవన్ వారిని ఒక ఆట ఆడుకునేవారట బ్లాక్ మెయిల్ కూడా చేసేవారట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వరుణ్ తేజ్ తో కాళ్లు పట్టించుకున్న పవన్ కళ్యాణ్..
Image Credit : Asianet News

వరుణ్ తేజ్ తో కాళ్లు పట్టించుకున్న పవన్ కళ్యాణ్..

రీసెంట్ గా వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మూవీ ఈవెంట్ ఒకటి జరిగింది. దానికి చిరంజీవి ముఖ్య అథిదిగా హాజరయ్యారు. ఈవెంట్ లో వరుణ్ చిన్ననాటి పోటో ఒకటి స్క్రీన్ పై చూపించారు. అందులో పవన్ కళ్యాన్ కాళ్లు పట్టుకుని వరుణ్ తేజ్ కనిపించారు. పవన్ అభయంఇస్తున్నట్టు కనిపించారు. ఈ ఫోటోగురించి మాట్లాడుతూ.. ''పవన్ బాబాయ్ ఏదో ఒక అవసరం కోసం ఇలా బ్లాక్ మెయిట్ చేసేవారు. డబ్బులు కావచ్చు.. ఏదైనా కావచ్చు..మేం కూడా ఏదో అవసరం కోసంమే అలా కాళ్లు పట్టేవాళ్లు.. అప్పుడు చాలా సరదాగా ఉండేది'' అని వరుణ్ తేజ్ అన్నారు. వరుణ్ ను మాత్రమే కాదు గతంలో రామ్ చరణ్ ను కూడా పవన్ కళ్యాణ్ ఇలానే బ్లాక్ మెయిల్ చేసేవారు. గతంలో ఈ విషయాన్ని ఇంటర్యూలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఒప్పుకున్నారు.

34
రామ్ చరణ్ దగ్గర పవన్ కళ్యాణ్ అప్పు..
Image Credit : instagram

రామ్ చరణ్ దగ్గర పవన్ కళ్యాణ్ అప్పు..

పవన్-చరణ్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. హీరోలు కాకముందు బాబాయ్ అబ్బాయిలా కాకుండా మంచి ఫ్రెండ్స్ లా ఉండేవారట వీరు. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు రామ్ చరణ్ దగ్గర అప్పు తీసుకున్నాడు! ఇది నిజమే. కానీ ఈ సంఘటన చాలా రోజుల క్రింతం జరిగింది. అప్పటికి పవన్ సినిమాల్లోకి రాలేదు, రామ్ చరణ్ అయితే ఇంకా చిన్నవాడు. మెగా కుటుంబం చెన్నైలో ఒకే ఇంట్లో నివసిస్తుండగా, పవన్ ఖాళీగా ఉండేవారు, పాకెట్ మనీ కోసం చిరంజీవి మీద ఆధారపడేవారు. చిరంజీవి ఇచ్చిన డబ్బులు అయిపోతే, చరణ్‌కు ఇచ్చిన పాకెట్ మనీ నుంచి ఏదో ఒక కథ చెబుతూ డబ్బులు అడిగేవాడట.వడ్డీతో కలిపి ఇస్తానని చెప్పి చరణ్ దగ్గర డబ్బులు తీసుకునేవాడట పవన్. డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని చరణ్‌ కూడా ఇచ్చేసేవాడట. కాని ఆతరువాత డబ్బులు అడిగితే ఏదో ఒక మాయచేసేవారని వారు నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. ఇది పవన్ స్వయంగా రామ్ చరణ్‌తో కలిసి పంచుకున్న జ్ఞాపకం.

44
చరణ్ - వరుణ్ తో పనులు చేయించిన పవన్ కళ్యాన్
Image Credit : Asianet News

చరణ్ - వరుణ్ తో పనులు చేయించిన పవన్ కళ్యాన్

చిన్నతనంలో చరణ్‌, వరుణ్ ఇద్దరు ఏదైనా అవసరం వస్తే పవన్ బాబాయ్ దగ్గరకు వెళ్లేవాడట. తమ తండ్రులతో ఏదైనా చెప్పే ధైర్యం లేకపోతే పవన్ ను అడిగేవారట. అయితే పవన్ కళ్యాణ్ ఊరికే సాయం చేయకుండా.. వారి దగ్గర డబ్బులు వసూలు చేసేవారట. అంతే కాదు చిన్న చిన్న పనులు చేయించుకోవడం లేదా ఆటపట్టించడం చేసేవారట.

వరుణ్ తేజ్ చిన్నప్పుడు చాలా పొడుగ్గా, బొద్దుగా ఉండేవాడు. వరుణ్ ఏవైనా అల్లరి పనులు చేసినా లేదా చెప్పిన మాట వినకపోయినా.. "నువ్వు సరిగ్గా చదువుకోకపోతే లేదా అల్లరి చేస్తే నిన్ను రౌడీలకు ఇచ్చేస్తా, లేదా హాస్టల్‌కు పంపించేస్తా" అని పవన్ కళ్యాణ్ భయపెట్టేవారట.

చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత , రామ్ చరణ్ మధ్య చిన్న చిన్న తగువులు కూడా పెట్టేవారట పవన్ . ఇద్దరికి ఒకరికి ఇంకొకరికి చాడీలు చెపుతూ గొడవలు పెట్టి నవ్వుకునేవాడట. అలా చిన్నతనంలో పవన్ కళ్యాణ్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఈ విషయాలన్నీ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మెగా ఫ్యామిలీలో తెరపై కనిపించే మాస్ ఇమేజ్ వెనుక చాలా సరదా సన్నివేశాలు చాలా ఉన్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Recommended image2
Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ అఫీషియల్, పండగ రోజు గుడ్ న్యూస్..సెలెబ్రిటీల రియాక్షన్ చూశారా
Recommended image3
Chiranjeevi: ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే..ఎదురు చూసే అలవాటు లేదు, అందుకే సినిమాలు చేయలేదు
Related Stories
Recommended image1
Rajamouli: రాజమౌళి ఏం చదివాడో తెలుసా? జక్కన్న క్వాలిఫికేషన్ పై రమారాజమౌళి సెటైర్లు..
Recommended image2
Yamuna: 55 ఏళ్ల వయసులో ఇంత అందంగానా? యమున బ్యూటీ సీక్రేట్ ఏంటో తెలుసా? రోజు ఏం తింటుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved