MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Feature
  • మనదేశంలో నదులన్నీ ఆడవే... కానీ ఒకే ఒక్క మగ నది ఉంది, అదేంటో తెలుసా?

మనదేశంలో నదులన్నీ ఆడవే... కానీ ఒకే ఒక్క మగ నది ఉంది, అదేంటో తెలుసా?

భారతదేశంలో ఉన్న నదుల సంఖ్య ఎక్కువ. వాటి పేర్లు అన్ని స్త్రీలవే. కానీ వాటిని ఆడ నదులుగా చెప్పుకుంటారు. కానీ ఒక నది మాత్రం మగది. పైగా దానిపేరు మగ పేరే. అదేంటో... దాని విశేషాలేంటో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 13 2026, 10:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఒకే ఒక్క మగనది ఏది?
Image Credit : Gemini AI

ఒకే ఒక్క మగనది ఏది?

భారతదేశంలో గంగా, యమునా, గోదావరి, కృష్ణా, కావేరి, నర్మదా, తపతి.. ఇలా ఎన్నో నదులు ఉన్నాయి. నదుల పేర్లన్నీ స్త్రీల పేర్లుగానే ఉంటాయి. అయితే భారతదేశంలో ఒక నది మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అదే బ్రహ్మపుత్ర నది. పేరు చూస్తేనే ఇది ప్రత్యేకంగా అనిపిస్తుంది. ‘బ్రహ్మపుత్ర’ అంటే ‘బ్రహ్మ దేవుడి కుమారుడు’ అని అర్థం. అందుకే బ్రహ్మపుత్రను భారతదేశంలోని ఒకే ఒక్క ‘మగ నది’గా చాలామంది చెబుతుంటారు. నిజానికి ఇది కేవలం పేరు విషయంలోనే కాదు.. తన ప్రవాహం, స్వభావం విషయంలోనూ ప్రత్యేకత ఉంటుంది. టిబెట్‌లో పుట్టిన ఈ నది భారత్‌లోకి అరుణాచల్‌ప్రదేశ్‌ మీదుగా ప్రవేశిస్తుంది. అక్కడ దీనిని ‘సియాంగ్’ అని పిలుస్తారు. ఆ తర్వాత అసోంలోకి చేరినప్పుడు బ్రహ్మపుత్రగా మారుతుంది. చివరికి బంగ్లాదేశ్‌లోకి వెళ్లి గంగానదితో కలిసి సముద్రంలో కలుస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ప్రవాహం కూడా తీవ్రం
Image Credit : Gemini AI

ప్రవాహం కూడా తీవ్రం

బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన కథలు భారతీయ పురాణాల్లో కూడా కనిపిస్తాయి. పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడి కుమారుడిగా ఈ నదిని భావిస్తారు. అందుకే దీనికి ‘బ్రహ్మపుత్ర’ అనే పేరు వచ్చింది. సంస్కృతంలో ‘పుత్ర’ అంటే కుమారుడు. ఈ కారణంగానే ఇతర ప్రధాన నదులతో పోలిస్తే బ్రహ్మపుత్ర పేరు ప్రత్యేకంగా కనిపిస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బ్రహ్మపుత్ర నదిని భారత్‌లో మాత్రమే కాకుండా టిబెట్, చైనా, బంగ్లాదేశ్‌లో కూడా వేర్వేరు పేర్లతో పిలుస్తారు. టిబెట్‌లో దీనిని ‘యార్లుంగ్ సాంగ్‌పో’ అని అంటారు. భారత్‌లోకి వచ్చిన తర్వాత ‘సియాంగ్’, ‘దిహాంగ్’ వంటి పేర్లు వినిపిస్తాయి. అసోంలోకి వచ్చిన తర్వాతే ఇది బ్రహ్మపుత్రగా ప్రసిద్ధి చెందింది. ఈ నది కేవలం పేరుతోనే ప్రత్యేకం కాదు. భారీ నీటి ప్రవాహం, పొడవైన ప్రయాణం, వర్షాకాలంలో వచ్చే వరదల కారణంగా కూడా ఇది ప్రపంచంలోని ముఖ్యమైన నదుల్లో ఒకటిగా నిలిచింది.

Related Articles

Related image1
SIP Investment: సిప్‌లో నెలకు 5 వేలు ఇన్వెస్ట్ చేసి కోటి రూపాయలకు పైగా సంపాదించండి ఇలా
Related image2
AC Remote: ఏసీ రిమోట్ తెల్లగా ఉంటే.. టీవీ రిమోట్ నల్లగా ఉంటుంది, ఎందుకో తెలుసా?
33
వరదలు వస్తే అంతే సంగతి
Image Credit : Gemini AI

వరదలు వస్తే అంతే సంగతి

బ్రహ్మపుత్ర నది ఈశాన్య భారతదేశానికి ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా అసోం రాష్ట్రంలోని ప్రజల జీవితం ఈ నదితోనే ముడిపడి ఉంది. వ్యవసాయం, చేపల వేట, రవాణా, తాగునీరు వంటి ఎన్నో అవసరాలకు ఈ నది ఉపయోగపడుతోంది. అదే సమయంలో వర్షాకాలంలో బ్రహ్మపుత్ర ఉప్పొంగితే అసోంలో పెద్ద ఎత్తున వరదలు కూడా వస్తుంటాయి. నదిలోని నీటి ప్రవాహం చాలా బలంగా ఉండటంతో దాని స్వభావం కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందుకే బ్రహ్మపుత్రను కేవలం ‘మగ నది’ అని పిలవడం వెనుక పేరు మాత్రమే కారణం కాదు.. దాని బలమైన ప్రవాహం కూడా. యితే భారతదేశంలోని అన్ని నదులు ‘ఆడ నదులే’ అని చెప్పడం శాస్త్రీయ వర్గీకరణ కాదు. ఇది ప్రధానంగా మన భాష, పురాణాలు, సంప్రదాయాల్లో ఏర్పడిన పేర్ల ఆధారంగా చెప్పే విషయం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Water In Dreams: కలలో నీళ్లు లేదా సముద్రం కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
Gold Investment : ఈరోజు తులం బంగారం కొంటే 2050 నాటికి ఎంత డబ్బు వస్తుంది? లాభం ఎంత?
Recommended image3
Dimple Cheeks : కొందరి బుగ్గలపై సొట్టలు పడతాయి? ఈ సొట్టబుగ్గలకు కారణమేంటి?
Related Stories
Recommended image1
SIP Investment: సిప్‌లో నెలకు 5 వేలు ఇన్వెస్ట్ చేసి కోటి రూపాయలకు పైగా సంపాదించండి ఇలా
Recommended image2
AC Remote: ఏసీ రిమోట్ తెల్లగా ఉంటే.. టీవీ రిమోట్ నల్లగా ఉంటుంది, ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved