MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Feature
  • Mutton: చికెన్, మటన్ కలిపి తింటే ఏమౌతుంది? రెండు మాంసాలు కలిపి వండొచ్చా..?

Mutton: చికెన్, మటన్ కలిపి తింటే ఏమౌతుంది? రెండు మాంసాలు కలిపి వండొచ్చా..?

Chicken: మన దేశంలో మాంసాహార ప్రియులు ఎక్కువైపోయారు. కొంత మంది మటన్ ఇష్టపడితే.. మరికొంత మంది చికెన్ ను చాలా ఇష్టంగా లాగించేస్తుంటారు. మరి ఈ రెండు కలిపి తింటే ఎలా ఉంటుందో తెలుసా? మటన్, చికెన్ ను కలిపి వండొచ్చా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 14 2026, 08:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆదివారం ముక్క లేనిదే ముద్ద దిగదు
Image Credit : gemini AI

ఆదివారం ముక్క లేనిదే ముద్ద దిగదు

మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులకు కొరత లేదు. ఆదివారం వచ్చిందంటే చాలు ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే కొందరు వెరైటీ కోసం లేదా ఇంట్లో అందరి ఇష్టాల కోసం చికెన్ (కోడి మాంసం), మటన్ (మేక మాంసం) రెండింటినీ ఒకేరోజు తెచ్చుకుంటారు. కొందరైతే ఈ రెండింటినీ కలిపి ఒకే కూరగా వండే ప్రయోగాలు కూడా చేస్తుంటారు. మరి ఇలా చికెన్, మటన్ కలిపి వండడం లేదా ఒకేసారి కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్య నిపుణులు, పోషకాహార నిపుణులు దీనిపై ఏం చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
చికెన్, మటన్‌ కలిపి వండవచ్చా?
Image Credit : gemini AI

చికెన్, మటన్‌ కలిపి వండవచ్చా?

సాంకేతిక కోణంలో చూస్తే చికెన్, మటన్‌ లను కలిపి వండడం అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ రెండు రకాల మాంసాలు ఉడికే సమయం (Cooking time) పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చికెన్ చాలా త్వరగా, సులభంగా ఉడికిపోతుంది. కానీ మటన్ గట్టిగా ఉండడం వల్ల అది పూర్తిగా ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. రెండింటినీ కలిపి ఒకేసారి వండితే, మటన్ ఉడికేసరికి చికెన్ ముక్కలు పూర్తిగా మెత్తగా అయిపోయి, విడిపోయి గుజ్జులా మారిపోతాయి. ఒకవేళ చికెన్ ఉడికిన వెంటనే దించేస్తే మటన్ పచ్చిగా ఉండిపోతుంది. పచ్చి మాంసం తినడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

Related Articles

Related image1
Jr NTR - Mutton: మటన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇష్టంగా తినే పార్ట్ ఏదో తెలుసా? 200 ముక్కలు లాగించేస్తాడట?
Related image2
Salary: అమెరికాలో చెత్త ఏరుకునేవారి జీతం ఎంత ఉంటుందో తెలుసా? ఏ జాబ్ కి ఎంత శాలరి వస్తుంది?
36
చికెన్, మటన్‌ కలిపి తింటే ఏమౌతుంది? జీర్ణక్రియపై ప్రభావం:
Image Credit : Asianet News

చికెన్, మటన్‌ కలిపి తింటే ఏమౌతుంది? జీర్ణక్రియపై ప్రభావం:

ఆరోగ్య పరంగా చూసుకుంటే చికెన్ అనేది 'వైట్ మీట్' (White Meat) కిందకు వస్తుంది, మటన్ 'రెడ్ మీట్' (Red Meat) కిందకు వస్తుంది. చికెన్ తేలికగా ఉండి త్వరగా జీర్ణమవుతుంది. కానీ మటన్‌లో కొవ్వు, ప్రొటీన్ల శాతం ఎక్కువగా ఉండడం వల్ల అది జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండింటినీ ఒకేసారి తిన్నప్పుడు జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తవచ్చు.అధిక క్యాలరీలు, ప్రొటీన్లు: రెండు రకాల మాంసాలను కలిపి తిన్నప్పుడు శరీరానికి ఒకేసారి భారీ మొత్తంలో ప్రొటీన్లు, కొవ్వు అందుతాయి. శరీరం ఒకేసారి ఇంత భారీ మోతాదులో పోషకాలను శోషించుకోలేదు. ఫలితంగా కాలేయం (Liver), మూత్రపిండాలపై (Kidneys) ఒత్తిడి పెరుగుతుంది.

46
ఆరోగ్య నిపుణుల సూచనలు:
Image Credit : Gemini AI

ఆరోగ్య నిపుణుల సూచనలు:

ఈ విషయంలో ఆరోగ్య నిపుణులు ఏమంటారంటే?.. చికెన్, మటన్‌లను కలిపి వండకుండా, విడివిడిగా వండుకుని వేర్వేరు సమయాల్లో తినడం ఉత్తమం. ఉదాహరణకు మధ్యాహ్నం మటన్ తింటే, రాత్రికి చికెన్ తినడం లేదా ఒక రోజు చికెన్ తింటే, మరుసటి రోజు మటన్ తినడం మంచిది. ఏ మాంసమైనా అతిగా తింటే ప్రమాదకరమే. ముఖ్యంగా రెడ్ మీట్ (మటన్) వారానికి ఒకటి లేదా రెండు సార్ల కంటే ఎక్కువ తినకూడదని వైద్యులు సూచిస్తుంటారు.

56
ఎక్కువగా ఏది ఇష్టపడుతున్నారు?
Image Credit : gemini AI

ఎక్కువగా ఏది ఇష్టపడుతున్నారు?

మన దేశంలో జనాలు మటన్ కంటే చికెన్‌ను చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) , వివిధ రిపోర్ట్ ల ప్రకారం, భారతదేశంలో చికెన్ వినియోగం వేగంగా పెరుగుతోంది. దీనికి ముఖ్య కారణాలు చికెన్ ధర తక్కువగా ఉండటం, సులభంగా లభించడం, ఆరోగ్యపరంగా లీన్ ప్రొటీన్ (Lean Protein) కలిగి ఉండటమే. మటన్ (రెడ్ మీట్) ధరలు ఎక్కువగా ఉండటం ..అది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో, జనాలు నిత్యం చికెన్ తినడానికే మొగ్గు చూపుతున్నారు.

66
అసలు విషయం ఏంటంటే?
Image Credit : Mana Chef/YT

అసలు విషయం ఏంటంటే?

చికెన్ , మటన్ కలిపి తినడం వల్ల తక్షణమే ప్రాణాంతక సమస్యలు రాకపోయినప్పటికీ, దీర్ఘకాలంలో ఇది జీర్ణక్రియను మందగించేలా చేస్తుంది. అనేక రకాల ఆరోగ్య సంస్యలు రావచ్చు. కాబట్టి మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యం కోసం ఈ రెండు రకాల మాంసాలను విడివిడిగా, తగిన పరిమితిలో ఆస్వాదించడమే సురక్షితమైన మార్గం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Science Facts : తొమ్మిది కాదు ఎనిమిదే గ్రహాలు.. ప్లూటోను గ్రహాల లిస్ట్ లోంచి ఎందుకు తొలగించారు?
Recommended image2
Psychology: మీ మంచితనాన్ని ఎవరైనా వాడుకుంటున్నారా? ఈ 5 సైకాలజీ ట్రిక్స్‌తో తెలుసుకోండి!
Recommended image3
USA: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Related Stories
Recommended image1
Jr NTR - Mutton: మటన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇష్టంగా తినే పార్ట్ ఏదో తెలుసా? 200 ముక్కలు లాగించేస్తాడట?
Recommended image2
Salary: అమెరికాలో చెత్త ఏరుకునేవారి జీతం ఎంత ఉంటుందో తెలుసా? ఏ జాబ్ కి ఎంత శాలరి వస్తుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved