MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jr NTR - Mutton: మటన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇష్టంగా తినే పార్ట్ ఏదో తెలుసా? 200 ముక్కలు లాగించేస్తాడట?

Jr NTR - Mutton: మటన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇష్టంగా తినే పార్ట్ ఏదో తెలుసా? 200 ముక్కలు లాగించేస్తాడట?

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడని అందరికి తెలిసిందే. ఒకప్పుడు ఆయన ఎలా ఉండోవాడో కూడా అందరికి తెలుసు. తారక్ ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ లో మటన్ ఒకటి. అందులో ఆయన బాగా ఇష్టంగా తినేది ఏదో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 12 2026, 11:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జూనియర్ ఎన్టీఆర్ ఇష్టమైన ఫుడ్.. ఆయన లావవడానికి గల కారణం?
Image Credit : Asianet News

జూనియర్ ఎన్టీఆర్ ఇష్టమైన ఫుడ్.. ఆయన లావవడానికి గల కారణం?

టాలీవుడ్ మాస్ ఆఫ్ మ్యాసెస్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కు సినిమా రంగంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో మందితో మంచి అనుబంధాలు ఉన్నాయి . ఆయన నటన, డ్యాన్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో.. భోజనం చేయడం పట్ల కూడా ఆయనకు అంతే మక్కువ ఎక్కువ. అయితే ఒకానొక సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా లావుగా ఉండేవారు. గతంలో జరిగిన ఈ మాయ పేరేమిటో సినిమా వేడుకలో తారక్ తను అంతగా లావవడానికి గల కారణాన్ని, తనకు ఇష్టమైన మటన్ వంటకం గురించి పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన మటన్ పార్ట్ ? ఎన్ని తింటారు?
Image Credit : Asianet News

ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన మటన్ పార్ట్ ? ఎన్ని తింటారు?

ఈ ఈవెంట్ లో తారక్ స్వయంగా తనకు నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టమో వివరించారు. ముఖ్యంగా మటన్ లో 'మూలిగెలు' లేదా 'నల్లీలు' (Mutton Nalli/Bone Marrow) అంటే తనకు అమితమైన ఇష్టమని . సాధారణంగా ఎవరైనా హోటల్ లేదా ఇంట్లో తిన్నప్పుడు ఒకటి లేదా రెండు నల్లీలు తింటారు. కానీ ఎన్టీఆర్ విషయంలో అది చాలా భిన్నంగా ఉంటుంది. తనకు నల్లీలు ఇష్టమని తెలిస్తే ఒకటి రెండు కాదు.. ఏకంగా 200 నల్లీల వరకు వండేసేవారని, తాను కూడా వాటిని అంతే ఇష్టంగా లాగించేసేవాడినని తారక్ ఆశ్చర్యకరమైన విషయాన్ని బయటపెట్టారు

Related Articles

Related image1
Janaki Vs Savitri: మహానటి సావిత్రితో వివాదం.. ఆమెకు పాడనని తెగేసి చెప్పిన ఎస్ జానకి, కారణం ఏంటి?
Related image2
Janaki Awards: పద్మభూషణ్ ను రిజెక్ట్ చేసిన సంచలన గాయని, జానకిని అవార్డులతో గౌరవించిన రాష్ట్ర ప్రభుత్వాలెన్నో..
34
జూనియర్ ఎన్టీఆర్ లావవ్వడానికి కారణం ఎవరు?
Image Credit : Asianet News

జూనియర్ ఎన్టీఆర్ లావవ్వడానికి కారణం ఎవరు?

ఈ మాయ పేరేమిటో సినిమా వేడుకలో తారక్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఈసినిమా హీరో తండ్రి విజయ్ ఫైట్ మాస్టర్. ఆయనతో తారక్ కు చాలా ఏళ్లుగా అనుబంధం ఉంది. ఎన్టీఆర్ సినిమాలకు విజయ్ ఫైట్ మాస్టర్ గా ఉన్నారు. ఆయన, ఆయన భార్య పెట్టే ఫుడ్ వల్లే తాను బాగా లావయ్యానని ఎన్టీఆర్ అన్నారు. తనకు మటన్ నల్లి ఇష్టమని తెలిసి.. విజయ్ భార్య ఎంతో ప్రేమతో భారీ సంఖ్యలో వాటిని వండి.. షూటింగ్ లొకేషన్స్ కు పంపించేదట. . తాను ఎన్నో సార్లు అడగడం.. ఆవిడ ఎంతో ఓపికగా వండి పంపించడం సాగిందని ఆయన గుర్తు చేసుకున్నారు.

44
దగ్గరుండి వడ్డించి.. ఎలా తినాలో నేర్పించారు.
Image Credit : Asianet News

దగ్గరుండి వడ్డించి.. ఎలా తినాలో నేర్పించారు.

విజయ్, ఆయన భార్య వండి పంపించడమే కాకుండా, స్వయంగా ఎన్టీఆర్ పక్కనే ఉండి, ఆ నల్లీలను వడ్డించి వాటిని ఏ విధంగా రుచి చూడాలో, 'ఎలా తినాలో కూడా నేర్పించారని' తారక్ ఎంతో ఆప్యాయంగా పంచుకున్నారు. అడిగినప్పుడల్లా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 నల్లి బోన్స్ ను వండి పంపించేవారట. అందుకే నేను అప్పుడు అంత లావు ఉన్నాను అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వారిద్దరి పట్ల తనకున్న కృతజ్ఞతను తెలియజేస్తూ.. "ఇది ఎన్ని జన్మల బంధమో తెలియదు, ఈ రుణం కూడా ఏంటో తెలియదు.. అది నేను ఎప్పటికీ తీర్చుకోలేని రుణం" అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Janaki Vs Savitri: మహానటి సావిత్రితో వివాదం.. ఆమెకు పాడనని తెగేసి చెప్పిన ఎస్ జానకి, కారణం ఏంటి?
Recommended image2
Sai Pallavi House: సింపుల్ గా సాయి పల్లవి సొంత ఇల్లు, స్టార్ హీరోయిన్ హౌస్ ఇలా కూడా ఉంటుందా?
Recommended image3
S Janaki Last Wish: వేల పాటలు పాడి జాతీయ అవార్డులు అందుకున్న ఎస్ జానకి చివరి కోరిక ఇదా.. నిజంగా షాకింగ్
Related Stories
Recommended image1
Janaki Vs Savitri: మహానటి సావిత్రితో వివాదం.. ఆమెకు పాడనని తెగేసి చెప్పిన ఎస్ జానకి, కారణం ఏంటి?
Recommended image2
Janaki Awards: పద్మభూషణ్ ను రిజెక్ట్ చేసిన సంచలన గాయని, జానకిని అవార్డులతో గౌరవించిన రాష్ట్ర ప్రభుత్వాలెన్నో..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved