MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Midnight Sun: ప్రపంచంలో సూర్యుడే అస్తమించని 5 దేశాలు.. అద్భుతమైన ప్రదేశాలు..

Midnight Sun: ప్రపంచంలో సూర్యుడే అస్తమించని 5 దేశాలు.. అద్భుతమైన ప్రదేశాలు..

Midnight Sun: ప్రకృతిలో ఎన్నో వింతలు, అద్భుతాలు దాగి ఉన్నాయి. సాధారణంగా పగలు, రాత్రి అనేవి భూభ్రమణం కారణంగా మారుతుంటాయి. అయితే, ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని నెలల పాటు సూర్యుడు అస్తమించడు. దానినే 'మిడ్‌నైట్ సన్' (Midnight Sun) అంటారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 06 2026, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
1. స్వాల్‌బార్డ్, నార్వే (Svalbard, Norway)
Image Credit : Asianet News

1. స్వాల్‌బార్డ్, నార్వే (Svalbard, Norway)

నార్వే దేశాన్ని అధికారికంగా 'ల్యాండ్ ఆఫ్ ది మిడ్‌నైట్ సన్' అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న స్వాల్‌బార్డ్ దీవుల్లో ఏప్రిల్ 20 నుంచి ఆగస్టు 20 వరకు సుమారు 120 రోజుల పాటు (నాలుగు నెలలు) సూర్యుడు అసలు అస్తమించడు. అంటే ఇక్కడ దాదాపు నాలుగు నెలల పాటు రాత్రి సమయం అనేది ఉండదు, ఎప్పుడూ పగటి వెలుతురుగానే ఉంటుంది. ఈ ప్రాంతం మరో ప్రత్యేకతకు కూడా నిలయం; ఇక్కడ మనుషుల జనాభా కేవలం 2,500 మంది మాత్రమే ఉంటే, భయంకరమైన ధ్రువపు ఎలుగుబంట్ల (Polar Bears) సంఖ్య 3,000 కు పైగా ఉండటం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2. బారో, అలస్కా, అమెరికా (Barrow, Alaska)
Image Credit : Ken Hill / National Park Service

2. బారో, అలస్కా, అమెరికా (Barrow, Alaska)

అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో ఉన్న ఈ మంచు ప్రాంతం అత్యంత శీతలమైనది. ఇక్కడ మే నెల చివరి నుంచి జూలై చివరి వరకు అంటే సుమారు 84 రోజుల పాటు సూర్యుడు అస్తమించడు. ఈ సుదీర్ఘ కాలం అంతా ఇక్కడ పగలే కనిపిస్తుంది. అయితే దీనికి పూర్తిగా వ్యతిరేకంగా నవంబర్ నెలలో ఇక్కడ సూర్యుడు అస్తమిస్తే, మళ్ళీ సుమారు 67 రోజుల పాటు సూర్యరశ్మి కనిపించదు. ఈ కాలాన్ని 'పోలార్ నైట్' (Polar Night) అని పిలుస్తారు.

35
3. ఫిన్లాండ్ (Finland)
Image Credit : pinterest

3. ఫిన్లాండ్ (Finland)

అత్యద్భుతమైన సుందరమైన సరస్సులకు పేరుగాంచిన ఫిన్లాండ్ దేశంలో వేసవి కాలంలో అద్భుతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ వేసవిలో ఏకంగా 73 రోజుల పాటు సూర్యుడు అస్తమించకుండా ఆకాశంలోనే ప్రకాశిస్తూ ఉంటాడు. రాత్రి రెండు గంటల సమయమైనా సరే బయట ప్రకాశవంతంగా ఎండ కాస్తూనే ఉంటుంది. ఈ సమయంలో ప్రజలు నిద్రపోవడానికి తమ ఇళ్లలోని కిటికీలకు మందపాటి నలుపు రంగు కర్టెన్లు (Blackout Curtains) వేసుకొని గదిని పూర్తిగా చీకటి చేసుకుని నిద్రపోవడం ఇక్కడ సర్వసాధారణం.

45
4. టునావుట్, కెనడా (Tununak, Canada)
Image Credit : AFP

4. టునావుట్, కెనడా (Tununak, Canada)

ఆర్కిటిక్ సర్కిల్‌కు కేవలం 2 డిగ్రీల ఎత్తులో ఉండే ఈ కెనడియన్ ప్రాంతంలో ప్రకృతి వింతగా ప్రవర్తిస్తుంది. ఇక్కడ ఏకంగా రెండు నెలల పాటు సూర్యుడు 24 గంటలూ ఆకాశంలోనే ఉంటాడు. దీనికి పూర్తిగా విరుద్ధంగా శీతాకాలం ప్రారంభమైతే మాత్రం, వరుసగా 30 రోజుల పాటు ఇక్కడ చిమ్మచీకటి అలుముకుంటుంది. ఇక్కడ పగలు, రాత్రుల చక్రం పూర్తిగా విభిన్నంగా మారుతుంటుంది.

55
5. ఐస్‌లాండ్, యూరప్ (Iceland)
Image Credit : Asianet News

5. ఐస్‌లాండ్, యూరప్ (Iceland)

యూరప్ ఖండంలోని ప్రముఖ ద్వీప దేశమైన ఐస్‌లాండ్‌లో జూన్ నెల వచ్చిందంటే చాలు సూర్యుడు అస్తమించడు. ఆకాశం ఎప్పుడూ పగటి వెలుతురుతోనే కళకళలాడుతూ కనిపిస్తుంది. ఇక్కడ చీకటి పడే అవకాశం లేకపోవడంతో, రాత్రి 12 గంటలు దాటినప్పటికీ పర్యాటకులు బయట రోడ్లపై తిరుగుతూ, గోల్ఫ్ ఆడుతూ, హైకింగ్ చేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతుంటారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వైరల్ న్యూస్
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken : తెలుగు రాష్ట్రాల్లోనే ఈ కోడికూర ఫేమస్.. అంకాపూర్ చికెన్ ఎందుకంత రుచిగా ఉంటుందో తెలుసా?
Recommended image2
Train: రైల్వేస్టేషన్లో రైలు ఏ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకెళ్లాలో లోకో పైలట్‌కు ఎలా తెలుస్తుంది?
Recommended image3
Andhra Paris: ఆ ఊరు మధ్యలోంచే ప్రవహించే భారీ మంచినీటి కాలువలు.. అందుకే ఆంధ్రా పారిస్‌ పేరు
Related Stories
Recommended image1
Parrots: చిలుకకు రామచిలుక అనే పేరు ఎలా వచ్చింది? అవి మనుషుల్లా ఎలా మాట్లాడగలవు?
Recommended image2
Tripod Fish: ఈత కొట్టడం రాని వింత చేప... మహాసముద్రంలో ఎలా బ్రతుకుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved