MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

Weather Update : బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొట్టనున్నాయి. ఎండల తీవ్రత తగ్గనుంది. రానున్న రోజుల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 08 2026, 07:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రాబోయే 48 గంటలు చాలా డేంజర్.. ఏపీ, తెలంగాణకు పిడుగుల అలర్ట్
Image Credit : Gemini

రాబోయే 48 గంటలు చాలా డేంజర్.. ఏపీ, తెలంగాణకు పిడుగుల అలర్ట్

భానుడి భగభగలకు, ఉక్కపోతకు అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అదిరిపోయే కూల్ కబురు చెప్పింది. ఎండల టార్చర్‌కు ఎండ్ కార్డ్ పడే టైమ్ వచ్చేసింది. రైతన్నలు ఎప్పుడెప్పుడా అని వెతురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) జూన్ 10వ తేదీన లేదా అంతకంటే ముందే తెలంగాణను టచ్ చేసేందుకు రెడీ అయిపోయాయి. ప్రస్తుతం ఇవి అరేబియా సముద్రం, బంగాళాఖాతం రెండు చోట్లా క్రేజీగా దూసుకొస్తున్నాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో ఇవి తెలంగాణలో ఫుల్ యాక్టివ్ కానున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఎల్ నినో టెన్షన్ అవుట్.. అంటార్కిటికా రాకాసి గాలుల బూస్ట్
Image Credit : chatgpt

ఎల్ నినో టెన్షన్ అవుట్.. అంటార్కిటికా రాకాసి గాలుల బూస్ట్

సాధారణంగా జూన్ ఒకటో తేదీనే రావాల్సిన రుతుపవనాలు ఈసారి ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల కొంచెం లేట్‌గా జూన్ 4న కేరళను తాకాయి. ఈ ఎల్ నినో వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉంటాయని మొదట్లో అందరూ తెగ టెన్షన్ పడ్డారు. కానీ అంటార్కిటికాలో వచ్చిన సడెన్ ఛేంజెస్ వల్ల గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రాకాసి గాలులు పుట్టుకొచ్చాయి. ఇవి హిందూ మహాసముద్రం మీదుగా భూమధ్య రేఖ వైపు దూసుకొస్తూ ఎల్ నినో వేడిని ఐస్ చేసేస్తున్నాయి. వాతావరణంలో తేమను పెంచుతూ రుతుపవనాలకు ఫుల్ బూస్టప్ ఇస్తున్నాయి. దీంతో ఈసారి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

36
బంగాళాఖాతంలో అల్పపీడన సంకేతాలు
Image Credit : Gemini AI

బంగాళాఖాతంలో అల్పపీడన సంకేతాలు

ప్రస్తుతం బంగాళాఖాతంలో వాతావరణ సమీకరణాలు చాలా ఫాస్ట్‌గా మారిపోతున్నాయి. నైరుతి, పశ్చిమ మధ్య భాగాల్లో నైరుతి గాలులు స్ట్రాంగ్‌గా విస్తరిస్తున్నాయి. దీనివల్ల ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. తమిళనాడు పక్కన, శ్రీలంక చుట్టూ ఒక బలమైన అల్పపీడనం ఏర్పడే సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. అక్కడ గంటకు 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ అల్పపీడనం గనుక ఒక షేప్‌కు వస్తే, దీని ఎఫెక్ట్ వల్ల ఏపీ, తెలంగాణలో వర్షాలు నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి.

46
తెలంగాణలో భారీ వర్షాలు
Image Credit : Getty

తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణలో ఉదయం నుంచే చాలా ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్మేస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత చాలా ఏరియాల్లో జల్లులు స్టార్ట్ అయి, రాత్రి 7 గంటల వరకు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ లో కూడా మోస్తరు వాన పడే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం తెలంగాణలో 55%, ఏపీలో 50%కి పెరిగింది. దీనివల్ల ఉష్ణోగ్రతలు 34 నుండి 39 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయి, వెదర్ చాలా కూల్‌గా మారబోతోంది.

56
ఈ ప్రాంతాల్లో వానలే వానలు
Image Credit : ANI

ఈ ప్రాంతాల్లో వానలే వానలు

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజులు తెలంగాణవ్యాప్తంగా గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు మెరుపులతో వానలు పడనున్నాయి. ముఖ్యంగా కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అలర్ట్ ఇచ్చారు.

66
ఏపీలో పిడుగుల హెచ్చరిక.. ఒకవైపు వడగాలులు
Image Credit : Gemini AI

ఏపీలో పిడుగుల హెచ్చరిక.. ఒకవైపు వడగాలులు

ఆంధ్రప్రదేశ్‌లో కర్ణాటక నుంచి కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని వల్ల అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అయితే, మరోవైపు రాష్ట్రంలోని 56 మండలాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం కూడా కొనసాగుతోంది. నిన్న ప్రకాశం జిల్లా కరేడులో ఏకంగా 43.5 డిగ్రీల ఎండ దంచికొట్టింది. సో, వాతావరణం మారేంతవరకు జాగ్రత్తగా ఉండాలి.

రైతులు తమ ముందస్తు వ్యవసాయ పనులను ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, కరెంట్ స్తంభాల పక్కన నిలబడకూడదని ఐఎండీ హెచ్చరించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
Google Messages New Feature: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. గూగుల్ తీసుకొచ్చిన ట్యాప్ టు డ్రాఫ్ట్ ఫీచర్ ఏంటో తెలుసా?
Recommended image2
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved