MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Biryani: బిర్యానీ తిన్నాక పుచ్చకాయ తింటే ప్రాణాంతకమా? ఇందులో నిజమెంత?

Biryani: బిర్యానీ తిన్నాక పుచ్చకాయ తింటే ప్రాణాంతకమా? ఇందులో నిజమెంత?

Biryani: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా? ముంబై ఘటన వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? బిర్యానీ తర్వాత పుచ్చకాయ తినడం గురించి వైద్యుల హెచ్చరికలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Apr 30 2026, 08:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిర్యానీ తర్వాత పుచ్చకాయ తింటే డేంజరా?
Image Credit : Gemini

బిర్యానీ తర్వాత పుచ్చకాయ తింటే డేంజరా?

"బిర్యానీ తిన్న వెంటనే పుచ్చకాయ తిన్న ఒక కుటుంబం మరణించింది" అనే వార్త ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ముంబైలో జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనతో చాలా మంది బిర్యానీ తర్వాత పుచ్చకాయ తినాలంటేనే భయపడుతున్నారు. అయితే నిజంగానే బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినడం ప్రమాదమా? ఇందులో ఎంతవరకు నిజముంది?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అసలు ఏం జరిగింది?
Image Credit : Asianet News

అసలు ఏం జరిగింది?

ముంబైకి చెందిన పలువురు రాత్రి సమయంలో బిర్యానీ తిని, ఆ తర్వాత డెజర్ట్‌గా పుచ్చకాయ ముక్కలు తిన్నారు. కొద్దిసేపటికే వారికి వాంతులు, విరేచనాలు మొదలై పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారని ఆ వార్తలో పేర్కొన్నారు. ఈ ఘటన ప్రజల్లో ఒక రకమైన భయాన్ని కలిగించింది. బిర్యానీ వంటి మసాలా ఆహారం తర్వాత చలువ చేసే పుచ్చకాయ తింటే శరీరంలో విషపూరితమైన కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయని చాలా మంది నమ్మడం మొదలుపెట్టారు.

Related Articles

Related image1
Wet Bulb Temperature : జాగ్రత్త! ఈ కొత్త రకం వేడితో ప్రాణాలు పోయే ఛాన్స్.. వెట్ బల్బ్ అంటే ఏంటో తెలుసా?
Related image2
Weather Update: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో వర్షం.. ఈ ప్రాంతాలకు అలర్ట్
35
వైద్య నిపుణులు ఏమంటున్నారు?
Image Credit : Gemini

వైద్య నిపుణులు ఏమంటున్నారు?

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. బిర్యానీ, పుచ్చకాయ కలిపి తినడం వల్ల శరీరంలో ఎలాంటి విష రసాయనాలు ఉత్పత్తి కావు. ఈ రెండింటి కలయిక నేరుగా మరణానికి కారణం అవుతుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణంగా మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి జఠర రసం తోడ్పడుతుంది. ఒకవేళ ఈ రెండు పదార్థాలు కలిసినా గ్యాస్ లేదా అజీర్తి వంటి చిన్నపాటి సమస్యలు రావచ్చు కానీ, ప్రాణాలు పోయేంత ప్రమాదం మాత్రం జరగదు.

45
మరణానికి అసలు కారణం ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు!
Image Credit : Getty

మరణానికి అసలు కారణం ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు!

ఈ మరణాలకు ప్రధాన కారణం ఆహారాల కలయిక కాదు, ఆ ఆహారం కలుషితం కావడమేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

1. బాక్టీరియా పెరుగుదల: బిర్యానీ వంటి మాంసాహార పదార్థాలను వండిన తర్వాత ఎక్కువ సేపు బయట గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే అందులో బాక్టీరియా వేగంగా పెరుగుతుంది.

2. నిల్వ పండ్లు: బయట రోడ్ల మీద ముందుగానే కట్ చేసి ఉంచిన పుచ్చకాయ ముక్కలపై దుమ్ము, ధూళితో పాటు ప్రమాదకరమైన బాక్టీరియా చేరుతుంది.

3. కృత్రిమ రసాయనాలు: పుచ్చకాయలు ఎర్రగా, తీపిగా ఉండటానికి కొన్ని చోట్ల ప్రమాదకరమైన ఇంజెక్షన్లు, రంగులు వాడుతుంటారు. ఇవి శరీరంలోకి వెళ్ళినప్పుడు తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తాయి.

55
మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
Image Credit : freepik

మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

ఆహారం ఏదైనా సరే అది తాజాది కాకపోతే ప్రమాదకరమే. బయట దొరికే కట్ చేసిన పండ్లను అస్సలు కొనకండి. అలాగే బిర్యానీ వంటి ఆహారాన్ని వండిన రెండు లేదా మూడు గంటల లోపు తినడం మంచిది. ఒకవేళ నిల్వ ఉంచాల్సి వస్తే సరైన ఉష్ణోగ్రతలో ఫ్రిజ్‌లో భద్రపరచాలి. ఆహారం వాసన చూసినప్పుడు లేదా రుచిలో తేడా అనిపించినప్పుడు మొహమాటం లేకుండా పారేయడమే ఉత్తమం.

బిర్యానీ తర్వాత పుచ్చకాయ తింటే చనిపోతారనేది కేవలం ఒక అపోహ మాత్రమే. అసలు సమస్య మనం తినే ఆహారపు నాణ్యత, శుభ్రతలో ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
ఆహారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Income Tax Rules : ఓ ఫ్యామిలీ ఇంట్లో ఎంత డబ్బు దాచుకోవచ్చు? ఎక్కువుంటే ఏమైనా ప్రాబ్లమా?
Recommended image2
Facts : ఏ జంతువుకు ఎన్నిపళ్ళు ఉంటాయి? నోట్లో ఒక్క పన్ను లేని జీవి 14 వేల పళ్లుండే జీవిని తినేస్తుందా..!
Recommended image3
Longest Lifespan Animals: బాబోయ్.. ఏకంగా 4300 ఏళ్లు బతుకుతుందా? భూమిపై అత్యంత ఎక్కువ ఆయుష్షు ఉన్న జీవి ఇదే !
Related Stories
Recommended image1
Wet Bulb Temperature : జాగ్రత్త! ఈ కొత్త రకం వేడితో ప్రాణాలు పోయే ఛాన్స్.. వెట్ బల్బ్ అంటే ఏంటో తెలుసా?
Recommended image2
Weather Update: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో వర్షం.. ఈ ప్రాంతాలకు అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved