MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Feature
  • IRCTC Hyderabad to Ooty Tour: హైదరాబాద్ టూ ఊటీ మస్త్ ట్రిప్.. బడ్జెట్ లోనే ఐఆర్‌సీటీసీ క్రేజీ ప్యాకేజీ డీటెయిల్స్ ఇవే

IRCTC Hyderabad to Ooty Tour: హైదరాబాద్ టూ ఊటీ మస్త్ ట్రిప్.. బడ్జెట్ లోనే ఐఆర్‌సీటీసీ క్రేజీ ప్యాకేజీ డీటెయిల్స్ ఇవే

IRCTC Hyderabad to Ooty Tour: ఊటీ చల్లని లోయల్లో తేలిపోవాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ అదిరిపోయే బడ్జెట్ టూరిజం ప్యాకేజీ తెచ్చేసింది. తక్కువ బడ్జెట్ లోనే లైఫ్ టైం మెమొరీస్ అందించే ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ టు ఊటీ టూర్ వివరాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 19 2026, 07:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఐఆర్‌సీటీసీ క్రేజీ ఆఫర్
Image Credit : Gemini

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఐఆర్‌సీటీసీ క్రేజీ ఆఫర్

సిటీలో ఎండలు ఇప్పటికీ దంచికొడుతున్నాయి. ఉక్కపోత, వర్క్ ప్రెజర్‌తో మైండ్ బ్లాక్ అవుతుంటే.. కాసేపు అలా ప్రశాంతమైన హిల్ స్టేషన్‌కు వెళ్లి చిల్ అవ్వాలనిపించడం కామన్. మీకూ అలాగే ఉందా? అయితే మీ కోసమే ఐఆర్‌సీటీసీ (IRCTC ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ఒక సూపర్ ప్లాన్ తీసుకొచ్చింది.

"అల్టిమేట్ ఊటీ - ఎక్స్ హైదరాబాద్" పేరుతో సరికొత్త టూర్ ప్యాకేజీని అనౌన్స్ చేసింది. ప్రతి మంగళవారం సికింద్రాబాద్ నుంచి ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది. 5 రాత్రులు, 6 రోజుల పాటు సాగే ఈ ట్రిప్‌లో మీరు ఊటీ అందాలను, కూనూర్ లోయలను మనసారా ఆస్వాదించవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
IRCTC Hyderabad to Ooty Tour: సికింద్రాబాద్ టు కోయంబత్తూర్.. అక్కడి నుంచి ఊటీకి కార్ లో జర్నీ
Image Credit : Asianet News

IRCTC Hyderabad to Ooty Tour: సికింద్రాబాద్ టు కోయంబత్తూర్.. అక్కడి నుంచి ఊటీకి కార్ లో జర్నీ

ఈ ట్రిప్ ఎలా సాగుతుందో ఏ రోజు ఎక్కడికి వెళ్తామో అనే వివరాలు గమనిస్తే..

  1. డే 1 (మంగళవారం): మధ్యాహ్నం 2:25 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 20629) ఎక్కడంతో మన జర్నీ మొదలవుతుంది. రాత్రంతా హ్యాపీగా ట్రైన్ లో నిద్రపోవచ్చు.
  2. డే 2 (బుధవారం): ఉదయం 09:10 గంటల కల్లా కోయంబత్తూర్ స్టేషన్ చేరుకుంటారు. అక్కడ ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన ఏసీ వాహనంలో 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీకి మిమ్మల్ని తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ అయ్యాక, కాస్త ఫ్రెష్ అప్ అయి.. మధ్యాహ్నం ఫేమస్ బొటానికల్ గార్డెన్స్, ప్రశాంతమైన ఊటీ లేక్ చూసేయొచ్చు. రాత్రికి ఊటీలోనే బస.
  3. డే 3 (గురువారం): పొద్దున్నే హోటల్‌లో టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ ముగించి సైట్ సీయింగ్‌కు రెడీ అవ్వాలి. ఊటీలోనే ఎత్తైన దొడబెట్ట శిఖరం, ఘుమఘుమలాడే టీ మ్యూజియం, అద్భుతమైన పైకారా జలపాతాలను చూపిస్తారు. నైట్ మళ్లీ ఊటీలోనే స్టే.
  4. డే 4 (శుక్రవారం): ఈ రోజు కూనూర్ అందాలను ఎక్స్‌ప్లోర్ చేసే టైం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక కూనూర్ లోని బెస్ట్ లొకేషన్స్ కవర్ చేస్తారు. మధ్యాహ్నానికి మళ్లీ ఊటీకి రిటర్న్ వచ్చేసి, నైట్ అక్కడే రెస్ట్ తీసుకుంటారు.
  5. డే 5 (శనివారం): మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు హోటల్ చెక్ అవుట్ చేయాలి. అక్కడి నుంచి తిరిగి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు డ్రాప్ చేస్తారు. మధ్యాహ్నం 3:40 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 20630) ఎక్కి తిరుగు ప్రయాణం అవుతాం.
  6. డే 6 (ఆదివారం): ఉదయం 11:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో మీ మెమరబుల్ ఊటీ ట్రిప్ హ్యాపీగా ముగుస్తుంది.
35
ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ టు ఊటీ టూర్ ప్యాకేజీలో ఏమున్నాయి? ఏం లేవు?
Image Credit : Asianet News

ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ టు ఊటీ టూర్ ప్యాకేజీలో ఏమున్నాయి? ఏం లేవు?

ఈ ప్యాకేజీ తీసుకుంటే మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే ట్రైన్ టికెట్లు, కోయంబత్తూర్ నుంచి ఊటీకి షేరింగ్ బేసిస్‌పై ఏసీ వెహికల్ ట్రాన్స్‌పోర్ట్, ఊటీలో 3 రాత్రులు నాన్ ఏసీ హోటల్ స్టే, అలాగే 3 రోజులు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్, పార్కింగ్, జీఎస్టీ అన్నీ ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి.

కానీ, ట్రైన్ లో ఫుడ్, ఊటీలో మధ్యాహ్నం, రాత్రి భోజనం ఖర్చులు మీవే. దాంతో పాటు పర్యాటక ప్రాంతాల ఎంట్రీ టికెట్లు, బోటింగ్, హార్స్ రైడింగ్ లాంటి పర్సనల్ యాక్టివిటీస్ ఖర్చులు మీరే పెట్టుకోవాలి. రూమ్‌లో ముగ్గురు ఉంటే ఎక్స్‌ట్రా మ్యాట్రెస్ ఇస్తారు.

45
ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ టు ఊటీ టూర్ బడ్జెట్ ధరల వివరాలు
Image Credit : Getty

ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ టు ఊటీ టూర్ బడ్జెట్ ధరల వివరాలు

ఈ ప్యాకేజీ ధరలు జూలై 30 నుంచి సెప్టెంబర్ 22 మధ్య ప్రయాణించే వారికి వర్తిస్తాయి. మీరు ఎంచుకునే క్లాస్, షేరింగ్‌ని బట్టి రేట్లు మారుతుంటాయి. మొదటగా కంఫర్ట్ (3AC) క్లాస్ విషయానికి వస్తే.. సింగిల్ షేరింగ్ ₹28,730 చొప్పున, ఇద్దరు కలిసి రూమ్ పంచుకుంటే ఒక్కొక్కరికి ₹16,460 చొప్పున, అలాగే ముగ్గురు కలిసి ఉంటే ఒక్కొక్కరికి ₹15,550 చొప్పున ఛార్జ్ చేస్తారు. ఇక 5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లల కోసం బెడ్ కావాలనుకుంటే ₹8,840, బెడ్ అవసరం లేదు అనుకుంటే ₹6,490 చెల్లించాల్సి ఉంటుంది.

మరోవైపు తక్కువ బడ్జెట్‌లో వెళ్లాలనుకునే వారి కోసం స్టాండర్డ్ క్లాస్ అందుబాటులో ఉంది. ఇందులో సింగిల్ షేరింగ్ ధర ₹26,190 కాగా, ట్విన్ షేరింగ్‌కు ఒక్కొక్కరికి ₹13,920, ట్రిపుల్ షేరింగ్‌కు ఒక్కొక్కరికి ₹13,010 గా నిర్ణయించారు. ఇందులో పిల్లల (5-11 ఏళ్లు) విషయానికి వస్తే బెడ్‌తో కలిపి ₹6,300, బెడ్ లేకుండా కేవలం ₹3,950 గా ఉంది. కాబట్టి సింగిల్ గా వెళ్లే దానికంటే ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో గ్రూప్‌గా వెళ్తే ఈ ట్రిప్ మరింత తక్కువ బడ్జెట్ తో పూర్తి చేయవచ్చు.

55
కాన్సిలేషన్ రూల్స్.. కాంటాక్ట్ వివరాలు ఇవే
Image Credit : Freepik

కాన్సిలేషన్ రూల్స్.. కాంటాక్ట్ వివరాలు ఇవే

టికెట్ బుక్ చేసుకున్నాక ఏవైనా కారణాల వల్ల క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే, ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్ ([www.irctctourism.com](https://www.irctctourism.com)) ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో చేయాలి. రైల్వే కౌంటర్లలో ఇది కుదరదు. ట్రిప్ స్టార్ట్ అవ్వడానికి 15 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే ప్యాసింజర్‌కు ₹250 మాత్రమే కట్ అవుతుంది. అదే 8-14 రోజుల ముందు అయితే 25%, 4-7 రోజుల ముందు అయితే 50% డబ్బులు కట్ అవుతాయి.

జర్నీకి 4 రోజుల కన్నా తక్కువ టైం ఉన్నప్పుడు క్యాన్సిల్ చేస్తే రూపాయి కూడా రీఫండ్ రాదు.

మరిన్ని వివరాలు లేదా బుకింగ్ కోసం సికింద్రాబాద్ లోని ఆక్స్ ఫర్డ్ ప్లాజా, ఎస్.డి. రోడ్డులో ఉన్న ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ ఆఫీస్‌ను సంప్రదించవచ్చు. లేదా 8287932229, 9701360701 మొబైల్ నంబర్లకు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ప్రయాణం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Heritage Trains: 170 ఏళ్లు వచ్చినా తగ్గని ఫేరీ క్వీన్ స్పీడ్.. ఇండియాలోని టాప్ 5 హెరిటేజ్ రైళ్లు ఇవే
Recommended image2
Top 5 Largest Ganesha Temples: ప్రపంచంలోనే ప్రముఖ, అతిపెద్ద గణపతి ఆలయాలు ఇవే
Recommended image3
ఇప్ప‌టి వాళ్లు నిజంగానే 1980లోకి వెళ్తే.. ప్రపంచం ఎలా కనిపిస్తుంది? ఈ మార్పులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
Related Stories
Recommended image1
Kainchi Dham: కోహ్లీ, స్టీవ్ జాబ్స్, మార్క్ జూకర్ బర్గ్ జీవితాలను మార్చిన ఆలయం.. కైంచీ ధామ్ సీక్రెట్ ఇదే !
Recommended image2
IRCTC Ayodhya Kashi Tour: ఒక్క టికెట్‌తో అయోధ్య, కాశీ ప్రయాణం.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved