MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • IRCTC Panch Mahatirth Yatra: ఒకే టికెట్‌పై పూరి, కాశీ, అయోధ్య.. 5 పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ

IRCTC Panch Mahatirth Yatra: ఒకే టికెట్‌పై పూరి, కాశీ, అయోధ్య.. 5 పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ

IRCTC Panch Mahatirth Yatra: ఐఆర్‌సీటీసీ భారత్ గౌరవ్ స్పెషల్ ట్రెయిన్ ద్వారా ఒకే టికెట్ పై పూరి జగన్నాథ ఆలయం, కామాఖ్య, గయ, కాశీ, అయోధ్యలను సందర్శించవచ్చు. ఈ 'పంచ్ మహాతీర్థ దర్శన్ యాత్ర' ప్యాకేజీ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 07 2026, 11:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
IRCTC క్రేజీ టూర్.. ఒకే ప్రయాణంలో పూరి జగన్నాథ ఆలయం, కామాఖ్య, కాశీ ప్రయాణం
Image Credit : Gemini

IRCTC క్రేజీ టూర్.. ఒకే ప్రయాణంలో పూరి జగన్నాథ ఆలయం, కామాఖ్య, కాశీ ప్రయాణం

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక క్రేజీ అప్‌డేట్ తీసుకొచ్చింది. 'భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రెయిన్' ద్వారా "పంచ్ మహాతీర్థ దర్శన్ యాత్ర" పేరుతో ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో భాగంగా పూరి జగన్నాథ ఆలయం, కామాఖ్య టెంపుల్, గయ, వారణాసి కాశీ విశ్వేశ్వర స్వామి, అయోధ్య వంటి దేశంలోని అత్యంత పవిత్రమైన ఐదు మహా పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏయే క్షేత్రాలను సందర్శించవచ్చు?
Image Credit : Asianet News

ఏయే క్షేత్రాలను సందర్శించవచ్చు?

ఈ 13 రోజుల టూర్‌లో భక్తులు దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలను కవర్ చేయవచ్చు. పూరిలో జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, లింగరాజ్ ఆలయం, పూరి బీచ్‌లను సందర్శిస్తారు. గౌహతిలో ప్రసిద్ధ కామాఖ్య దేవి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఇక బోధ్‌గయలో విష్ణుపద్ ఆలయం, మా సర్వ మంగళ గౌరీ శక్తిపీఠం, బిగ్ బుద్ధ, మహాబోధి టెంపుల్‌కు తీసుకెళ్తారు. వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, అన్నపూర్ణ ఆలయ దర్శనంతో పాటు గంగా హారతిని వీక్షించవచ్చు. చివరిగా అయోధ్యలో రామ్ జన్మభూమి ఆలయం, హనుమాన్ గడిలను సందర్శించేలా రూట్ మ్యాప్ డిజైన్ చేశారు.

Related Articles

Related image1
Telangana New Airports: హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్
Related image2
Bonalu Potharaju Story: అసలు ఎవరీ పోతురాజు? బోనాల జాతరలో కొరడా దెబ్బల రహస్యం ఇదే !
35
బోర్డింగ్ పాయింట్లు, ప్రయాణ షెడ్యూల్ వివరాలు ఇవే
Image Credit : Asianet News

బోర్డింగ్ పాయింట్లు, ప్రయాణ షెడ్యూల్ వివరాలు ఇవే

ఈ స్పెషల్ ట్రెయిన్ ఎక్కడానికి, దిగడానికి రైల్వే శాఖ పలు స్టేషన్లను కేటాయించింది. రాజ్‌కోట్, సురేంద్ర నగర్, విరామ్‌గామ్, సబర్మతి జంక్షన్, నడియాడ్, ఆనంద్, ఛాయాపురి, గోద్రా, దాహోద్, రత్లాం, ఉజ్జయిని, అండ్ సంత్ హీర్దారామ్ నగర్ స్టేషన్ల నుంచి భక్తులు ఈ రైలును ఎక్కవచ్చు లేదా దిగవచ్చు. ఆగస్టు 29న రాజ్‌కోట్‌లో టూర్ ప్రారంభమవుతుంది. ఆగస్టు 31న పూరి చేరుకుంటారు. అక్కడ రెండు రోజులు గడిపిన తర్వాత, సెప్టెంబర్ 3న గౌహతి చేరుకుని కామాఖ్య దేవిని దర్శించుకుంటారు. సెప్టెంబర్ 5న గయకు, సెప్టెంబర్ 7న వారణాసికి చేరుకుంటారు. సెప్టెంబర్ 8న అయోధ్య రామయ్యను దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. సెప్టెంబర్ 10న రైలు తిరిగి రాజ్‌కోట్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

45
ప్యాకేజీ ధరలు, క్లాస్ వివరాలు
Image Credit : Gemini AI

ప్యాకేజీ ధరలు, క్లాస్ వివరాలు

ఈ భక్తి యాత్రలో బడ్జెట్‌ను బట్టి మూడు రకాల క్లాస్‌లను అందుబాటులో ఉంచారు. ఎకానమీ క్లాస్ (స్లీపర్), స్టాండర్డ్ క్లాస్ (3AC), మరో స్టాండర్డ్ క్లాస్ (2AC) ఆప్షన్స్ ఉన్నాయి.

• స్టాండర్డ్ (3AC): ఒకరికి రూ. 24,200/-

• ఎకానమీ (SL): ఒకరికి రూ. 40,100/-

• స్టాండర్డ్ (2AC): ఒకరికి రూ. 49,500/-

ప్యాకేజీ ధరలోనే రైలు ప్రయాణం, ప్యూర్ వెజిటేరియన్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. స్లీపర్ క్లాస్ వారికి నాన్ ఏసీ బడ్జెట్ హోటళ్లలో, ఏసీ క్లాస్ వారికి ఏసీ బడ్జెట్ హోటళ్లలో ట్విన్/ట్రిపుల్ షేరింగ్ బేసిస్‌పై బస కల్పిస్తారు. అలాగే లోకల్ సైట్ సీయింగ్ కోసం నాన్-ఏసీ బస్సులు ఉంటాయి. రోజుకు రెండు వాటర్ బాటిళ్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, రైలులో సెక్యూరిటీ స్టాఫ్, అనౌన్స్‌మెంట్ల కోసం టూర్ ఎస్కార్ట్ సేవలు ఉచితంగా అందిస్తారు.

55
ముఖ్యమైన నిబంధనలు, బుకింగ్ వివరాలు
Image Credit : gemini

ముఖ్యమైన నిబంధనలు, బుకింగ్ వివరాలు

ఈ టూర్ రాజ్‌కోట్ నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 12 రాత్రులు, 13 రోజుల పాటు సాగే ఈ లాంగ్ అండ్ డివైన్ జర్నీ ఆగస్టు 29 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 10 వరకు కొనసాగుతుంది. ఈ టూర్‌లో పర్సనల్ ఖర్చులు, టెంపుల్ ఎంట్రీ ఫీజులు, బోటింగ్ ఛార్జీలు, స్పెషల్ దర్శనం టికెట్లు, గైడ్ సర్వీసులు ప్యాకేజీలో భాగం కావు. తమ వెంట ఓటర్ ఐడీ, ఆధార్, పాన్ కార్డ్ వంటి ఒరిజినల్ ఐడీ ప్రూఫ్స్ కచ్చితంగా ఉంచుకోవాలి.

రైలులో ధూమపానం, లిక్కర్ సేవించడం పూర్తిగా నిషేధం. ప్రయాణం ముగిసిన తర్వాత ఉద్యోగులకు ఎల్‌టీసీ సదుపాయం కోసం ఐఆర్సీటీసీ సర్టిఫికేట్ ఇస్తుంది. బుకింగ్స్ లేదా ఇతర వివరాల కోసం roadi@irctc.com కు ఈమెయిల్ చేయవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Inspirational Story: రూ. 2.9 కోట్ల యూఎస్ జాబ్ వద్దనుకుని కిరాణా దుకాణం.. ఐఐటీ బాంబే గోల్డ్ మెడలిస్ట్ వైరల్ స్టోరీ !
Recommended image2
Nameless Railway Station : ఇండియాలో పేరు లేని ఏకైక రైల్వేస్టేషన్.. ఇక్కడికి వెళ్లాలంటే టికెట్ ఎలా..?
Recommended image3
Rahul Gandhi Investments : రాహుల్ గాంధీ టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు.. ఏడాదిలోనే కోట్లు కుమ్మరించాయిగా!
Related Stories
Recommended image1
Telangana New Airports: హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్
Recommended image2
Bonalu Potharaju Story: అసలు ఎవరీ పోతురాజు? బోనాల జాతరలో కొరడా దెబ్బల రహస్యం ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved