MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • Bonalu Potharaju Story: అసలు ఎవరీ పోతురాజు? బోనాల జాతరలో కొరడా దెబ్బల రహస్యం ఇదే !

Bonalu Potharaju Story: అసలు ఎవరీ పోతురాజు? బోనాల జాతరలో కొరడా దెబ్బల రహస్యం ఇదే !

Bonalu Story of Potharaju: బోనాల జాతరలో అందరి కళ్లు పోతురాజు పైనే ఉంటాయి. బోనాల జాతరలో పోతురాజు పూనకాల అసలు రహస్యం ఏంటి? అసలు ఏవరీ పోతరాజు? అమ్మవారికి, పోతురాజుకు సంబంధం ఏంటి? ఈ ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 07 2026, 08:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బోనాల జాతరలో పోతురాజు పూనకాల అసలు రహస్యం.. ఆ రౌద్ర రూపం వెనుక కథ ఇదీ
Image Credit : Gemini

బోనాల జాతరలో పోతురాజు పూనకాల అసలు రహస్యం.. ఆ రౌద్ర రూపం వెనుక కథ ఇదీ

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బోనాల పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది నెత్తిన బోనం ఎత్తిన మహిళలు, ఆ తర్వాత ఒంటి నిండా పసుపుతో భీకర రూపంలో కనిపించే పోతురాజు. ఆషాఢ మాసంలో జరిగే ఈ జాతరలో అందరి కళ్లు పోతురాజు పైనే ఉంటాయి. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా ఆయన వేసే స్టెప్పులు నెక్స్ట్ లెవెల్ వైబ్స్ ఇస్తాయి. అసలు ఎవరీ పోతురాజు? బోనాల జాతరలో ఆయనకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పోతురాజు పుట్టుక వెనుక ఉన్న పురాణ రహస్యం ఏంటి?
Image Credit : X/RaoKavitha

పోతురాజు పుట్టుక వెనుక ఉన్న పురాణ రహస్యం ఏంటి?

పురాణాల ప్రకారం, పోతురాజు గ్రామ దేవతలైన మహంకాళి, పోచమ్మ, ఎల్లమ్మ వంటి ఏడుగురు అక్కాచెల్లెళ్లకు స్వయంగా తమ్ముడు. ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం.. ఒకసారి పార్వతీ దేవి పొరపాటున లక్ష్మీదేవి దివ్య శక్తి ఉన్న కొన్ని నీటి చుక్కలను మింగేసింది. ఆ నీటి చుక్కల నుండి ఏడుగురు సోదరి దేవతలు అంటే గ్రామ దేవతలు జన్మించారు. అయితే, ఆ దేవతల దివ్య శక్తులను కాపాడటానికి, వారికి తోడుగా ఉండటానికి ఒక శక్తివంతమైన రక్షకుడు అవసరమయ్యాడు. ఆ సమయంలోనే పోతురాజు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని జానపద కథల్లో ఇతడిని విష్ణుమూర్తి అవతారంగా కూడా పూజిస్తారు.

Related Articles

Related image1
Telangana New Airports: హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్
Related image2
Inspirational Story: రూ. 2.9 కోట్ల యూఎస్ జాబ్ వద్దనుకుని కిరాణా దుకాణం.. ఐఐటీ బాంబే గోల్డ్ మెడలిస్ట్ వైరల్ స్టోరీ !
36
బోనాల జాతరలో పోతురాజు ఉగ్రరూపం.. గూస్‌బంప్స్ లుక్
Image Credit : Gemini

బోనాల జాతరలో పోతురాజు ఉగ్రరూపం.. గూస్‌బంప్స్ లుక్

బోనాల ఊరేగింపులో పోతురాజు పాత్రను చాలా హ్యాండ్సమ్‌గా, మంచి బాడీ బిల్డింగ్ ఉన్న వ్యక్తి పోషిస్తాడు. ఆయన లుక్ చూస్తేనే భక్తితో పాటు ఒక రకమైన భయం కలుగుతుంది. ఒంటి నిండా పసుపు దట్టంగా రాసుకుని, నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంటాడు. కేవలం ఒక చిన్న ఎర్రటి ధోవతి మాత్రమే కట్టుకుని, కాళ్లకు, నడుముకు భారీ గజ్జలు కట్టుకుంటాడు. చేతిలో పెద్ద కొరడా పట్టుకుని డప్పుల సౌండ్‌కు పూనకంతో ఊగిపోతూ డాన్స్ చేస్తుంటే జాతరలో క్రేజ్ మామూలుగా ఉండదు.

46
పలహారం బండి ముందు రౌద్ర నృత్యం
Image Credit : our own

పలహారం బండి ముందు రౌద్ర నృత్యం

ఊరేగింపులో పోతురాజు పలహారం బండి అంటే ప్రసాదం మోసుకెళ్లే వాహనం ముందు కూడా డాన్స్ చేస్తాడు. అమ్మవారి పూనకంలో ఉండి శిగం ఊగే మహిళలను పోతురాజే స్వయంగా నడిపించుకుంటూ ఆలయానికి తీసుకెళ్తాడు. ఆయన నడుముకు పచ్చటి వేప ఆకులను కట్టుకుంటాడు. చేతిలో ఉన్న కొరడాతో గాల్లో గట్టిగా కొడుతూ, భీకరమైన శబ్దాలు చేస్తూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న భక్తులను అలరిస్తాడు. ఈ పండుగను ప్రారంభించేది, సమాజాన్ని కాపాడేది పోతురాజే అని భక్తుల నమ్మకం.

56
బోనాలు - పోతరాజు : గ్రామాలను కాపాడే రక్షకుడు.. కొరడా దెబ్బల కథ ఇదే
Image Credit : Gemini

బోనాలు - పోతరాజు : గ్రామాలను కాపాడే రక్షకుడు.. కొరడా దెబ్బల కథ ఇదే

పూర్వ కాలంలో గ్రామాల్లో కలరా, ప్లేగు వంటి మహమ్మారులు వచ్చినప్పుడు, కరవులు సంభవించినప్పుడు ప్రజలు తీవ్రంగా భయపడేవారు. అవన్నీ అమ్మవారి ఉగ్రరూపం వల్లే జరుగుతున్నాయని నమ్మేవారు. ఆ సమయంలో అమ్మవారి తమ్ముడు, భక్తుడైన పోతురాజు రంగంలోకి దిగుతాడు. అమ్మవారి భీకరమైన కోపాన్ని, ఆ ఉగ్ర శక్తిని తనలోకి తీసుకుని, ఊరి ప్రజలకు ఎలాంటి కీడు జరగకుండా కాపాడుతాడు. అందుకే ఆయన పూనకంతో ఊగిపోతూ తనను తాను కొరడాతో కొట్టుకుంటూ దిష్టి తీస్తాడు. దుష్ట శక్తులను తరిమికొట్టి భక్తులకు రక్షణ కల్పిస్తాడు.

66
లష్కర్ బోనాల్లో పోతురాజు హంగామా
Image Credit : our own

లష్కర్ బోనాల్లో పోతురాజు హంగామా

సికింద్రాబాద్‌లో జరిగే లష్కర్ బోనాల్లో పోతురాజుల హంగామా అంతా ఇంతా కాదు. ఇక్కడి శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం, శ్రీ దేవి పోచమ్మ ఆలయం, శ్రీ ముత్యాలమ్మ ఆలయం వంటి ప్రముఖ గుడుల దగ్గర వందలాది మంది పోతురాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఈ పండుగలో అమ్మవారికి కోళ్లు, మేకలు, తాటికల్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత జరిగే రంగం భవిష్యవాణి ముగిశాక, పోతురాజు ఆధ్వర్యంలోనే అసలైన ఊరేగింపు మొదలవుతుంది. తెలంగాణ జానపద సంస్కృతిలో పోతురాజు ఒక వీరుడిగా, దైవ స్వరూపంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
పండుగలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
THROWBACK : అసెంబ్లీలో కేసీఆర్ Vs రేవంత్ రెడ్డి | KCR VS Revanth Reddy In Telangana Assembly
Recommended image2
Now Playing
BIG BREAKING: మహిళా MLA అని కూడా చూడకుండా.. అసెంబ్లీ వద్ద తీవ్ర రచ్చ! 🚨
Recommended image3
Telangana Assembly: బీఆర్ఎస్ vs కాంగ్రెస్.. అసెంబ్లీ దగ్గర నల్ల టీషర్టుల రచ్చ.. ! సభలో బీజేపీ ఆందోళన
Related Stories
Recommended image1
Telangana New Airports: హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్
Recommended image2
Inspirational Story: రూ. 2.9 కోట్ల యూఎస్ జాబ్ వద్దనుకుని కిరాణా దుకాణం.. ఐఐటీ బాంబే గోల్డ్ మెడలిస్ట్ వైరల్ స్టోరీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved