ప్రపంచ బైక్ మార్కెట్లో ఆసియా హవా...అత్యధికంగా బైక్ తయారు చేసే దేశం ఏదో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా బైక్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కొందరికి బైక్ అంటే ఒక ఏమోషన్. అందుకే వీటి తయారీకి చాలా దేశాలు పరిశ్రమలనే ఏర్పాటు చేశాయి. ఆసియా దేశాలైతే బైక్ తయారీలో ప్రపంచాన్నే శాసిస్తున్నాయి. అత్యధికంగా బైక్ లు తయారు చేసే దేశమేదో తెలుసా?

ప్రపంచంలో బైక్‌లు తయారు చేసే టాప్ 10 దేశాలు
2024లో అందుబాటులో ఉన్న అంతర్జాతీయ పరిశ్రమల గణాంకాల ప్రకారం భారత్ ప్రపంచంలోనే అత్యధిక మోటార్‌సైకిళ్లు తయారు చేసిన దేశంగా నిలిచింది. బ్రెజిల్‌కు చెందిన ద్విచక్ర వాహన పరిశ్రమ సంఘం Abraciclo ప్రచురించిన గ్లోబల్ ప్రొడక్షన్ ర్యాంకింగ్‌లో భారత్ మొదటి స్థానంలో ఉంది. చైనా రెండో స్థానంలో ఉండగా, ఇండోనేషియా మూడో స్థానాన్ని దక్కించుకుంది.
1. భారత్
బైక్‌ల తయారీలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. 2024లో సుమారు 2.15 కోట్ల మోటార్‌సైకిళ్లను తయారు చేసింది. దేశీయంగా బైక్‌లకు భారీ డిమాండ్ ఉండటంతో పాటు ఎగుమతులు కూడా భారత తయారీ రంగానికి బలాన్నిస్తున్నాయి. హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి సంస్థలు ఈ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
2. చైనా.. 3. ఇండోనేషియా
2. చైనా
చైనా సుమారు 1.99 కోట్ల బైక్‌ల తయారీతో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ సంప్రదాయ పెట్రోల్ బైక్‌లతో పాటు ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రపంచ మార్కెట్లకు బైక్‌లను ఎగుమతి చేసే దేశాల్లో చైనా ముందుంటుంది.
3. ఇండోనేషియా
ఇండోనేషియా సుమారు 69 లక్షల బైక్‌ల తయారీతో మూడో స్థానంలో ఉంది. ఇక్కడ ద్విచక్ర వాహనాలకు భారీ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా హోండా, యమహా వంటి సంస్థలకు ఈ మార్కెట్ కీలకంగా ఉంది.
4. వియత్నాం..5. థాయ్‌లాండ్
4. వియత్నాం
వియత్నాం సుమారు 30 లక్షల బైక్‌లను తయారు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. ఇక్కడ కూడా బైక్‌లు ప్రజల రోజువారీ ప్రయాణంలో ముఖ్యమైన భాగం. హోండా, యమహా వంటి కంపెనీలకు వియత్నాం కీలక తయారీ కేంద్రంగా ఉంది.
5. థాయ్‌లాండ్
థాయ్‌లాండ్ సుమారు 18.91 లక్షల బైక్‌ల తయారీతో ఐదో స్థానంలో ఉంది. ఆటోమొబైల్, ద్విచక్ర వాహన పరిశ్రమలకు ఈ దేశం ఆసియాలో ముఖ్యమైన కేంద్రంగా గుర్తింపు పొందింది.
6. బ్రెజిల్, 7. ఫిలిప్పీన్స్
6. బ్రెజిల్
బ్రెజిల్ సుమారు 17.48 లక్షల బైక్‌లను తయారు చేస్తూ ఆరో స్థానంలో ఉంది. ముఖ్యంగా మనౌస్ ప్రాంతంలో మోటార్‌సైకిల్ తయారీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. లాటిన్ అమెరికా మార్కెట్‌కు బ్రెజిల్ కీలక ఉత్పత్తి కేంద్రం.
7. ఫిలిప్పీన్స్
ఫిలిప్పీన్స్ సుమారు 13.73 లక్షల బైక్‌ల తయారీతో ఏడో స్థానంలో ఉంది. నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు, వ్యక్తిగత ప్రయాణ అవసరాల కారణంగా ద్విచక్ర వాహనాలకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది.
8. తైవాన్..9. కొలంబియా..10. జపాన్
8. తైవాన్
తైవాన్ సుమారు 10.12 లక్షల బైక్‌లను తయారు చేసింది. ముఖ్యంగా స్కూటర్లు, చిన్న సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్ల తయారీలో ఈ దేశానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కిమ్కో, ఎస్వైఎం వంటి సంస్థలు ఇక్కడి ప్రముఖ బ్రాండ్లు.
9. కొలంబియా
కొలంబియా సుమారు 7.75 లక్షల బైక్‌ల తయారీతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక్కడి ప్రజల రోజువారీ రవాణాలో బైక్‌లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. స్థానిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పలు కంపెనీలు తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
10. జపాన్
ప్రపంచ ప్రఖ్యాత బైక్ బ్రాండ్లకు నిలయమైన జపాన్ ఈ జాబితాలో పదో స్థానంలో ఉంది. 2024లో సుమారు 6.39 లక్షల మోటార్‌సైకిళ్లను తయారు చేసింది. హోండా, యమహా, సుజుకి, కవాసకి వంటి అంతర్జాతీయ బ్రాండ్లు ఈ దేశానికి చెందినవే.
ఆసియా దేశాలదే ఆధిపత్యం!
ఈ జాబితాను గమనిస్తే టాప్ 10లో భారత్, చైనా, ఇండోనేషియా, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి ఆసియా దేశాలే ఎక్కువగా ఉన్నాయి. బైక్‌లకు భారీ డిమాండ్, తక్కువ ఖర్చుతో తయారీ, విస్తృతమైన సరఫరా వ్యవస్థలు ఈ దేశాలను ప్రపంచ తయారీ కేంద్రాలుగా మార్చాయి. ముఖ్యంగా భారత్, చైనా రెండూ కలిపి 2024లో సుమారు 4.14 కోట్ల మోటార్‌సైకిళ్లను తయారు చేశాయి. ప్రపంచ ద్విచక్ర వాహన పరిశ్రమలో ఈ రెండు దేశాల ప్రాధాన్యం ఎంత ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.













