- Home
- Feature
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10లో టాప్ 5 ఎవరెవరో తేల్చేసిన శివాజీ..వర్షిణికి ఛాన్స్ లేనట్లేనా ?
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10లో టాప్ 5 ఎవరెవరో తేల్చేసిన శివాజీ..వర్షిణికి ఛాన్స్ లేనట్లేనా ?
బిగ్ బాస్ తెలుగు 10లో చివరి దశ మొదలైంది. ఈ నేపథ్యంలో విన్నర్ పై, టాప్ 5పై ఆడియన్స్ అనేక రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నటుడు శివాజీ మాత్రం తన స్టైల్ లో టాప్ 5 పై జోస్యం చెప్పారు.

బిగ్ బాస్ తెలుగు 10
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో చివరి దశ ప్రారంభమైనట్లే అని చెప్పొచ్చు. ఇక మరో నెలరోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. దీనితో ఇంట్లో ఉన్న సభ్యులు టికెట్ టు ఫినాలే కోసం, టాప్ 5లో చోటు దక్కించుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎవరికి వారు తమ వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు అనే విషయంలో ఆడియన్స్ లో కొన్ని పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
శివాజీ కామెంట్స్
అయితే ప్రముఖ నటుడు శివాజీ టాప్ 5 లో ఉండబోయే వారి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివాజీ బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. సెకండ్ రన్నరప్ గా నిలిచారు. ప్రస్తుతం బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా చేస్తున్నారు. అలీ హోస్ట్ గా చేస్తున్న అలీతో అల్లరి షోకి శివాజీ అతిథిగా వెళ్లారు. ఈ షోలో శివాజీ బిగ్ బాస్ తెలుగు 10లో టాప్ లో ఎవరెవరు ఉంటారో జోస్యం చెప్పారు.
టాప్ 5 లో ఉండేది వీళ్ళే
ముకేశ్, త్రిగుణ్, నరేష్, దేబ్జానీ తప్పనిసరిగా టాప్ 5లో ఉంటారు. ఇక ఐదవ వ్యక్తి ఎవరనేది స్పష్టంగా చెప్పలేదు. ఐదవ వ్యక్తిగా రామ్ ప్రసాద్, అమన్, వంశీ లలో ఎవరైనా ఉండొచ్చు అని అన్నారు. వర్షిణి పేరు మాత్రం చెప్పలేదు. అంటే వర్షిణిపై శివాజీకి అంతగా అంచనాలు లేవని అర్థం అవుతోంది.
వర్షిణికి నో ఛాన్స్ ?
ఆడియన్స్ లో కూడా వర్షిణిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వర్షిణి కేవలం గ్లామర్ కోసమే హౌస్ లో ఉందా ? ఫిజికల్ టాస్క్ లలో ఆమె ప్రమేయం అస్సలు ఉండడం లేదు అంటూ విమర్శిస్తున్నారు. ముకేశ్ తో క్లోజ్ గా ఉండడం వల్ల కూడా వర్షిణికి స్క్రీన్ స్పేస్ లభిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
డిక్టేటర్స్ గేమ్
ప్రస్తుతం హౌస్ లో డిక్టేటర్స్ గేమ్ సాగుతోంది. త్రిగుణ్, ముకేశ్ డిక్టేటర్స్ గా వ్యవహరిస్తున్నారు. నరేష్ కి ఎక్కువగా వినోదం అందించడంలో మార్కులు పడుతున్నాయి. దేబ్జానీ అవసరం అయినప్పుడల్లా తన ప్రజెన్స్ చూపిస్తోంది. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీలుగా వచ్చిన నీతూ, ఆర్కే పై అంతగా అంచనాలు లేవు. శివకుమార్ మాత్రం తన ప్రజెన్స్ చూపించే విధంగా గేమ్ ఆడుతున్నాడు.













